For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ నర్సుగా ఎంపికై రికార్డు నెలకొల్పిన అన్బు రూబీ...

ఆ ట్రాన్స్ జెండర్లను ఆదర్శంగా తీసుకున్న అన్బు రూబీ అనే హిజ్రా తాజాగా తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా ఎంపికై రికార్డు నెలకొల్పింది.

|

మన దేశంలో ట్రాన్స్ జెండర్లు అందరికీ చిన్నచూపే. ఇప్పటికీ వారిని మనలాగా జీవించే మానవులుగా చాలా మంది గుర్తించట్లేదు. అయినా కూడా ట్రాన్స్ జెండర్లు తమ హక్కుల కోసం మొక్కవోని ధైర్యంతో పోరాడుతూనే ఉన్నారు. సమాజంలో అడుగడుగునా ఎదురయ్యే కష్టాలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ తమకు కూడా పురుషులు, స్త్రీల లాగా బతికే స్వేచ్ఛ, స్వతంత్రం ఉందని నిరూపిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది హిజ్రాలు తామేంటో నిరూపించుకున్నారు.

తాజాగా తమిళనాడులో మరో ట్రాన్స్ జెండర్ ఒక కొత్త రికార్డు నెలకొల్పింది. మన దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ నర్సుగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందించేందుకు నియమించబడింది. అంతేకాదు ఆమె హిజ్రాలందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో అది మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంత పోటీ ఉన్నా.. దానినంతటిని తట్టుకుని విజయవంతంగా ఎదుర్కొని అన్బు రూబీ అనే ట్రాన్స్ జెండర్ ఈ ఉద్యోగానికి ఎలా ఎంపికయ్యిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

గతంలో ట్రాన్స్ జెండర్ ఎస్సై...

గతంలో ట్రాన్స్ జెండర్ ఎస్సై...

మన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలోనే తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ సబ్ ఇన్ స్పెక్టర్ గా ఎంపికై రికార్డు నెలకొల్పిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు అయితే యాషిని అనే ట్రాన్స్ జెండర్ లింగ మార్పిడి చేయించుకుని ఎస్సైగా ఎంపికయ్యేందుకు మొదట్లో ఒక సెకను కాలం ఆలస్యం కావడంతో తన కలను నెరవేర్చుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత ఆమె తన కలను నిజం చేసుకుంది.

తొలి ట్రాన్స్ జెండర్ నర్సు..

తొలి ట్రాన్స్ జెండర్ నర్సు..

ఆ ట్రాన్స్ జెండర్లను ఆదర్శంగా తీసుకున్న అన్బు రూబీ అనే హిజ్రా తాజాగా తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా ఎంపికై రికార్డు నెలకొల్పింది. ఈ ట్రాన్స్ జెండర్ మహిళ స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాస్కర్ చేతుల మీదుగా ఈ నియామక ఉత్తర్వులను అందుకుంది.

ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని..

ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని..

తను నర్సుగా ఎంపికైన సందర్భంగా ట్రాన్స్ జెండర్ మహిళ ఈ విధంగా మాట్లాడారు. ‘నేను ఒక మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాను. నేను చిన్నగా ఉన్నప్పుడే మా నాన్న కంటిచూపు కోల్పోయాడు. మా అమ్మ అరటి ఆకులు అమ్ముతూ, ఆ సంపాదనతోనే నన్ను చదివించింది.

నా మిత్రుల, ప్రొఫెసర్ల ప్రోత్సాహం..

నా మిత్రుల, ప్రొఫెసర్ల ప్రోత్సాహం..

నేను ఈ స్థాయికి రావడానికి నా మిత్రులు, ప్రొఫెసర్ల ప్రోత్సాహం మరువలేనిది. సాధారణంగా ట్రాన్స్ జెండర్ల కష్టాల గురించి సమాజానికి అంతగా తెలియదు. వాళ్లని కూడా దగ్గరకు చేర్చుకోవాలి. ఆ ఆదరణే అన్ని కష్టాలను మరిచిపోయేలా చేస్తుంది‘ అని అన్బు రూబే తన మనోగతాన్ని వెల్లడించింది.

గతంలోనూ ఓ ట్రాన్స్ జెండర్..

గతంలోనూ ఓ ట్రాన్స్ జెండర్..

ఇదే తమిళనాడు రాష్ట్రం నుండి గతంలో కూడా రక్షిక రాజ్ అనే ట్రాన్స్ జెండర్ మహిళ పద్మశ్రీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుండి నర్సుగా పట్టభద్రురాలిగా నిలిచింది. ఆమె కూడా తొలి ట్రాన్స్ ఉమెన్ రక్షికగా నిలిచింది. అయితే అంతకుముందు ఆ కాలేజీలో మగవాడిగా కాలేజీలో చేరాల్సి వచ్చింది.

అయితే ఆ తర్వాత దేశంలోని ప్రతి పౌరుడు మాదిరిగానే లింగ మార్పిడి చేసుకున్న వారు కూడా అన్ని హక్కులకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు ఉద్యోగ, ఉపాధి, విద్యతో పాటు ఇతర రంగాలలో వీరికి స్థానం కల్పించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఆమె తను ట్రాన్స్ జెండర్ అనే వాస్తవాన్ని బయట పెట్టింది.

English summary

First Transgender Nurse Appointed to a Government Hospital in Tamil Nadu

Here we talking about first transgender nurse appointed to a government hospital in tamilnadu. Read on
Desktop Bottom Promotion