Latest Updates
-
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్‌లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.!
ప్రియుడు పర్మినెంట్ గా కావాలని భర్తకే ధైర్యంగా చెప్పిన భార్య, కట్ చేస్తే కరెంట్ ఫోల్ లో
భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలున్న కుటుంబం పెద్దగా ఇబ్బందులు లేకుండా సవ్యంగా సాగిపోతావుంది. అయితే భార్య గత ఏడేళ్లుగా మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఇటీవల అనుమానాస్పదంగా తిరుగుతున్న భార్య భాగోతాన్ని ఆమె భర్త గుర్తించాడు. తన అక్రమ సంబంధం గురించి భర్తకు తెలియడంతో భార్య గొడవకు దిగడంతో ఇద్దరి మద్య చిన్నపాటి యుద్ధం జరిగింది.
ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన భార్య పక్కనే ఉన్న హైటెన్షన్ వైరు విద్యుత్ స్తంభంపైకి ఎక్కి హైడ్రామా క్రియేట్ చేసింది. ఆమె అక్రమ సంబంధానికి ఊరంతా విసిగిపోయింది. పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను కిందకు దించే ప్రయత్నం చేశారు. గుట్టు చప్పుడుకాకుండా ఇంత కాలం అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ మహిళ ఊరు మొత్తం వినపడేలా నాకు నా మొగుడు కావాలి, అంతకంటే ఎక్కువగా పర్మినెంట్ గా నా ప్రియుడు కావాలి అంటూ కేకలు వెయ్యడంతో అందరూ బిత్తరపోయారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పైపెరాచ్ గ్రామానికి చెందిన రామ్ గోవింద్ కు చాలా సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. రామ్ గోవింద్ భార్యకు 34 ఏళ్లు. ఆమె ముగ్గురు పిల్లల తల్లి. గత ఏడేళ్లుగా ఆమెకు వేరొకరితో అక్రమ సంబంధం ఉంది. ఇన్ని సంవత్సరాలు ఆ మహిళ అక్రమ సంబంధం సాఫీగా సాగిపోయింది. అయితే ఈ విషయం మహిళ భర్త రామ్ గోవింద్ కు తెలీదు. ఇటీవల భార్య తీరుతో రామ్ గోవింద్ కు అనుమానం వచ్చింది.
వాడితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు వాడితో బయట తిరుగుతున్నావు అంటూ రామ్ గోవింద్ అతని భార్యను నిలదీశాడు. అయితే భార్య మాత్రం నేను అతనితో అక్రమ సంబంధం పెట్టుకోలేదని, తాను పతివ్రత అనే విషయం ఎక్కడకావాలంటే అక్కడ నిరిపిస్తానని భర్త రామ్ గోవింద్ ను తిట్టిపోసింది. దాంతో భర్త రామ్ గోవింద్ ఏం చెయ్యాలో అర్థంకాక మౌనంగా ఉన్నాడు. ఇటీవలే రామ్ గోవింద్ అతని అతని భార్య అక్రమ సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్ చూసి ఆమెను స్పాట్ లో పట్టుకున్నాడు.
భార్య అక్రమ సంబంధం బయటపడింది. దీంతో కోపోద్రిక్తుడైన రామ్ గోవింద్ అతని భార్యను మందలించి పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. తరువాత భార్య డిమాండ్ విన్న రామ్ గోవింద్ బిత్తరపోయాడు. తాను అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని మన ఇంట్లోనే పెట్టుకుందామని, తరువాత ఈ విషయం బయటకురాదని, తన ప్రియుడికి ఉద్యోగం లేదని, అతని ఖర్చులకు కొంత డబ్బు ఇవ్వాలని భార్య రామ్ గోవింద్ ను డిమాండ్ చేసింది.
భార్య మాటలకు ఆగ్రహించిన రామ్ గోవింద్ ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. భర్త రామ్ గోవింద్ చితకబాదడంతో ఆవేశంగా వెళ్లిన అతని భార్య ఇంటి పక్కనే ఉన్న హైటెన్షన్ వైరు విదుత్య్ స్తంభాన్ని ఎక్కింది. మహిళ విద్యుత్ స్తంభం ఎక్కుతుండగా స్థానికులు వచ్చి ఆమెను కిందకు దిగాలని చెప్పారు. విద్యుత్ స్థంభం ఎక్కిన మహిళ ఆమె భర్త రామ్ గోవింద్ ను బూతులు తిడుతూ ఇంకా పైకి ఎక్కింది.
రామ్ గోవింద్ భార్య ఎవ్వరిమాట వినకపోవడంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి కరెంటు తీశాయాలని సూచించారు.
విద్యుత్ సరఫరా కట్ చేసిన తరువాత పోలీసులు, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నానా ఇబ్బందులు పడి చివరికి రామ్ గోవింద్ భార్యను కిందకు దించారు.
ఇంత హంగామా జరగడానికి కారణం అయిన మహిళ మీద విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్తులు ఫిర్యాదు చెయ్యడంతో ఆమె మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం మీద భర్తతో పాటు ప్రియుడిని కూడా ఒకే ఇంట్లో పెట్టుకుని కాపురం చెయ్యాలని ఓ మహిళ బహిరంగంగా ఊరిమద్యలో డిమాండ్ చెయ్యడంతో ఆమె ధైర్యం చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మహిళకు తగినబుద్ది చెప్పాలని చాలా ఆ ప్రాంతంలోని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications