Latest Updates
-
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే!
పోచమ్మ తల్లి మహత్యం, హుండీలో చెయ్యి చిక్కుకుని అడ్డంగా బుక్కైపోయిన అమ్మదొంగ :వీడియో వైరల్
హిందూ ఆలయాల్లో ప్రతి గుడిలో దేవుడి విగ్రహం ఎదురుగా, లేదంటే ఆలయం ఆవరణంలో హుండీ ఏర్పాటు చేస్తారు. గుడికి వెళ్లిన భక్తులు దేవుడికి పూజలు చేస్తారు. మేము కోరుకున్న కోర్కెలు తీరిస్తే నీకు మొక్కులు చెల్లించుకుంటామని భక్తులు దేవుడిని వేడుకుంటారు. కోరుకున్న కోరికలు తీరిన తరువాత భక్తులు ఆ గుడిలో దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
కోరుకున్న కోర్కెలు తీరిన తరువాత భక్తులు వారి స్థోమతను బట్టి ఆ గుడిలో ఉన్న హుండీలో నగదుతో పాటు బంగారు, వెండితో పాటు విలువైన వస్తువులు స్వామి వారికి సమర్పించుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతో పాటు దేశంలోని అనేక దేవాలయాల్లో ఏర్పాటు చేసిన హుండీల్లో నగదు చోరీ చేసిన సంఘటనలు ఇంతకాలం చాలానే వెలుగులోకి వచ్చాయి.

అయితే గుడిలో ఉన్న హుండీలో నగదు చోరీ చెయ్యడానికి ప్రయత్నించిన ఓ దొంగ అదే హుండీలో చేతులు చిక్కుకోవడంతో అడ్డంగా బుక్కైపోయాడు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లిలో మాసుపల్లి పోచమ్మ ఆలయం ఉంది. ఇదే ఆలయంలో సురేష్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. పోచమ్మ ఆలయానికి వస్తున్న భక్తులు ఎంతెంత డబ్బులు హుండీలో వేస్తున్నారు. హుండీలో నగదు ఎంత ఉంటుంది, ఆ హుండీ ఎప్పుడు నిండుతుంది, ఆ హుండీని ఎప్పుడు తీస్తారు అని సురేష్ కు ఓ ఐడియా ఉందని తెలిసింది.
మంగళవారం గుడిలో పూజలు చేసిన తరువాత అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత సురేష్ పోచమ్మ గుడిలోని హుండీలో నగదు చోరీ చెయ్యడానికి స్కెచ్ వేశాడు. అప్పటికే హుండీ పై భాగాన్ని కొంచెం ధ్వంసం చేసిన సురేష్ తరువాత హుండీలో చెయ్యి పెట్టి నగదు బయటకు తియ్యాలని ప్రయత్నించాడు. అయితే పోచమ్మ గుడిలో మంగళవారం పూట డబ్బులు చోరీ చెయ్యడానికి ప్రయత్నించిన సురేష్ కు గ్రహాలు అన్ని అడ్డం తిరిగాయి.
హుండీ లోపల చెయ్యి పెట్టిన సురేష్ అతని చెయ్యిని బయటకు తియ్యడానికి ప్రయత్నించాడు. అయితే పోచమ్మ మహత్యమో, ఏమో కాని సురేష్ అతని చెయ్యిని హుండీలో నుండి బయటకు తియ్యలేకపోవడంతో అతను అలాగే ఉండిపోయాడు. రాత్రి మొత్తం హుండీలో చెయ్యి పెట్టిన సురేష్ నిద్రలేకుండా జాగారం చేశాడు. బుధవారం ఉదయం గుడికి వెళ్లిన భక్తులు విషయం గుర్తించి ఆలయ కమిటి నిర్వహకులు, పోలీసుకు సమాచారం ఇచ్చారు.
ఆలయ కమిటి నిర్వహకులు, పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకుని సురేష్ నుండి వివరాలు సేకరించారు. గుడిలో డబ్బులు కొట్టేయాలని ప్రయత్నించిన సురేష్ అడ్డంగా చిక్కిపోవడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో సురేష్ గుడిలో చోరీ చేసినట్లు అతని మీద ఎలాంటి ఫిర్యాదులు లేవని, మొదటిసారి చోరీ చెయ్యడానికి ప్రయత్నించిన సురేష్ అడ్డంగా చిక్కిపోయాడని స్థానికులు అంటున్నారని పోలీసులు తెలిపారు.



Click it and Unblock the Notifications