Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఎద్దే కదా అనుకుంటే ఎగిరి తన్నింది, యమలోకం అంచుల వరకు వెళ్లి రిటన్ వచ్చాడు, వీడియో వైరల్ !
వీధిలో గంగిరెద్దు దాడి చెయ్యడం కలకలం రేపింది. పొద్దున్నే నిద్రలేచిన తరువాత అతను ఎవరి ముఖం చూశాడో ఏమో, యమలోకం అంచుల వరకు వెళ్లిన ఒక్క క్షణంలో ప్రాణాలతో బయటపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బెంగళూరులో వీధుల్లో వెలుతున్న ఓ గంగిరెద్దు ఒక్కసారిగా ఎగిరి బైక్ రైడర్ ను ఢీకొట్టడంతో అతను ఎగిరి ట్రక్కు చక్రాల కింద పడిపోయాడు,
అయితే ఆ ట్రక్కు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వెయ్యడంతో బైక్ రైడర్ ఒక్క క్షణంలో ప్రాణాలతో భయటపడ్డాడు. ఆ సమయంలో రికార్డు అయిన సీసీటీవీ కెమెరా క్లిప్పింగ్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బెంగళూరు సిటీలో కలకలం రేపిన ఈ ఘటన రాజాజీనగర సమీపంలోని మహాలక్ష్మి లేఔట్ లోని రద్దీగా ఉండే రోడ్డులో జరిగింది. ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. రద్దీగా ఉండే రోడ్డుపై బైక్‌లతో పాటు ట్రక్కులు, కార్లు వేగంగా వెలుతున్నాయి.
ఆసమయంలో ఓ మహిళ గంగిరెద్దును పట్టుకుని భిక్షం ఎత్తుకుంటూ అటువైపు వచ్చింది. గంగిరెద్దు మెడకు తాడు కట్టిన ఆమె ఆ తాడు పట్టుకుని రోడ్డు పక్కన నడుచుకుంటూ వెలుతోంది. అదే సమయంలో గంగిరెద్దు పక్కనే అటువైపు, ఇటు వైపు వాహనాలు వేగంగా వెలుతున్నాయి. ఆ సందర్బంలో అక్కడ అనుకోకుండా ఓ సంఘటన జరిగింది. అకస్మాత్తుగా ఆ ఎద్దు ఎటువంటి కారణం లేకుండా బైకర్‌పై దాడి చేసింది.
ఎద్దు వేగంతో బైక్‌పై నుంచి దూసుకెళ్లింది. మరో విషయం ఏమిటంటే, బైక్ రైడర్ ఎదురుగా వస్తున్న ట్రక్కు చక్రాల కింద పడిపోవడం. ఆ సందర్భాలలో అటువైపు వెలుతున్న వాళ్లు అతను కచ్చితంగా చనిపోతాడు అనుకున్నారు. అయితే ఆ ట్రక్కు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వెయ్యడంతో అతను ప్రాణాలతో బయటపడిపోయాడు. అతను తన ట్రక్ చక్రాల కిందపడ్డాడు అని గమనించిన డ్రైవర్ వెంటనే సడన్ బ్రేక్ వెయ్యడంతో బైక్ లో వెలుతున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
మరోవైపు ఇంత జరగడానికి కారణం అయిన ఆ ఎద్దు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రాణాలతో బయటపడిన బైక్ రైడర్ తరువాత తేరుకుని తన ప్రాణాలు కాపాడిన ట్రక్కు డైవర్ కు రెండు చేతులు జోడించి నమస్కరించాడు. యమలోకం అంచుల వరకు వెళ్లి చివరికి ప్రాణాలతో బయపడిన వ్యక్తి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడని తెలిసింది.



Click it and Unblock the Notifications