Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
Five Planets Transit in September 2021:5 గ్రహాల రవాణాతో ఈ రాశుల ఆర్థిక ప్రయోజనాలు...!
2021 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో ఐదు గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2021 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో ఐదు గ్రహాలు తమ స్థానం నుండి మరో స్థానంలోకి మారనున్నాయి. ఈ సమయంలో అస్థిర పరిస్థితులు ఏర్పడనున్నాయి.

ఆగస్టు మాసంలో కూడా ఇలాగే కొన్ని గ్రహాలు రవాణా చేశాయి. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కొంత ప్రభావం పడింది. సెప్టెంబర్ మాసంలోనూ గ్రహాల ప్రయాణం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు.. మరికొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.

సెప్టెంబర్ మాసంలో ముందుగా ఐదో తేదీన శుక్రుడు తన సొంత రాశి అయిన తుల రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ మరుసటి రోజే అంటే సెప్టెంబర్ 6వ తేదీన అంగారకుడు కన్యరాశిలోకి సంచారం చేయనున్నాడు. అనంతరం గురుడు మకర రాశిలోకి రవాణా చేయనున్నాడు.

సెప్టెంబర్ 16న సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశించనుండగా.. చివరగా సెప్టెంబర్ 22వ తేదీన బుధుడు తులా రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. సెప్టెంబర్ 27 నుండి వ్యతిరేక దిశలో రవాణా చేయనున్నాడు. అంటే తిరోగమన ప్రయాణం అన్నమాట. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఈ ఐదు గ్రహాల రవాణా వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయట. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి మరి...

వృషభరాశి..
ఈ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో అన్నీ మంచి ఫలితాలే రానున్నాయి. మీరు ఏ పని చేసినా అందులో సంపూర్ణ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. గత నెల కంటే ఈ నెలలో ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీరు ఇదివరకు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలను ఆర్జిస్తారు. ఈ సమయంలో విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది.

మిధున రాశి..
ఈ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గ్రహాల మార్పు వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. అంతేకాకుండా ఈ నెలలో మీ పరిస్థితులు మెరుగుపడతాయి. దీని వల్ల మీ మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. మీరు నూతన అవకాశాలను సాధించడంలో కూడా సక్సెస్ అవుతారు. మరోవైపు ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో మీరు బంధువులు, స్నేహితుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. మొత్తానికి సెప్టెంబర్ నెలలో మీకు అన్నింటా అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి..
ఈ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఐదు గ్రహాలు మార్పు వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీరు పెద్ద సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. ఈ మాసంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీకు ఈ సమయంలో ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లోనూ విజయం సాధిస్తారు. మీరు చేపట్టిన పనులు, పెండింగులో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసేస్తారు.

కన్య రాశి..
సెప్టెంబర్ నెలలో ఐదు గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారికి ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు పెండింగులో ఉన్న పనులను ముందుగా పూర్తి చేస్తారు. మీకు ఆర్థిక పరంగా పరిస్థితులు మెరుగుపడతాయి. గ్రహాల రవాణా కారణంగా మీ తెలివితేటలు, జ్ణానం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు మీరు చేపట్టే ఎలాంటి ప్రయత్నంలోనైనా పూర్తి విజయం సాధిస్తారు. ఈ నెలలో మీకు మొత్తం మంచి ఫలితాలొస్తాయి.

వృశ్చికరాశి..
సెప్టెంబర్ నెలలో ఐదు గ్రహాల ప్రయాణం వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు అనేక శుభవార్తలు వింటారు. కొందరు పరిచయస్తులు లేదా బంధువుల కారణంగా ఆగిపోయిన పని ప్రారంభమవుతుంది. ఈ నెలలో మీ ఇంట్లో కొన్నిశుభకార్యాలు నిర్వహిస్తారు. అంతేకాదు ఆర్థిక పరంగా ఈ కాలంలో అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. అయితే మీరు పనికి సంబంధించి కొంత డబ్బును ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబసభ్యులతో, ఇతరులతో సంబంధాలు మరింత మెరుగవుతాయి.



Click it and Unblock the Notifications
