Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Friendship Day 2021 :మీ రాశిని బట్టి ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తారంటే...!
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుండి బంధువులను ఎంపిక చేసుకోలేరు. తోబుట్టువులను కూడా సెలెక్ట్ చేసుకోలేరు.

కానీ ఒక్క స్నేహితులను మాత్రమే మీకు నచ్చిన వారిని ఎంపిక చేసుకోవచ్చు. వారితో మీరు కొత్త కుటుంబాన్ని కూడా ఏర్పాటు చేయొచ్చు. అలాంటి సమయంలోనే మీరు మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని బయటకు చెప్పుకోగలరు.

స్కూల్ లో అయినా.. కాలేజీలో అయినా.. లేదా ఆఫీసులో అయినా ఇంకా మీరు జీవితంలో ఎదుర్కొంటున్న ఏవైనా ఇబ్బందుల నుండి స్నేహితులతో చర్చించడానికి ఏ విధంగానూ సంకోచించరు. అయితే ఒకరితో స్నేహాన్ని కొనసాగించడానికి పరస్పర సమన్వయం అనేది కచ్చితంగా అవసరం. ఇందులో అహంకారం కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మీరు మీ రాశిని బట్టి మీ కోసం పుట్టిన స్నేహితులను, ముఖ్యంగా బెస్ట్ ఫ్రెండ్స్ కనుగొనవచ్చట. వినడానికి వింతగా ఉన్నా ఇందులో వాస్తవం ఉందని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులతో ఆనందంగా గడపండి. ఇక అసలు విషయానికొస్తే.. మీ రాశిని బట్టి మీరు ఎక్కువ ఏ రాశి వ్యక్తులతో స్నేహం కొనసాగిస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి..
ఈ రాశి వారు ధనస్సు రాశి వారితో ఎక్కువగా స్నేహం చేస్తారు. వీరితో బంధం చాలా బలంగా ఉంటుంది. అలాగే సింహ రాశి వ్యక్తులతో కూడా మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు ఎక్కువగా మకర రాశి వారితో స్నేహం చేస్తారు. వీరితో స్నేహాం చేయడాన్ని వృషభరాశి వారు బాగా ఆస్వాదిస్తారు.

మిధున రాశి..
ఈ రాశి వారు కుంభ రాశి వారితో ఎక్కువగా స్నేహం చేయడానికి ఇష్టపడతారు. వీరితో ఎక్కువ సమయం గడపడం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని భావిస్తారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు మీన రాశి వారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉంటారు. వీరితో ఫ్రెండ్ షిప్ చేయడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తారు.

సింహ రాశి..
ఈ రాశి వారు మిధున రాశి మరియు ధనస్సు రాశి వారితో స్నేహం చేస్తారు. అలాగే సింహ రాశి వారితో వీరి అనుబంధం మంచిగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారు మిధున రాశి మరియు సింహ రాశితో స్నేహం చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

తుల రాశి..
ఈ రాశి వారు వృషభరాశి వ్యక్తులతో బాగా కలిసిపోతారు. అదే సమయంలో కుంభ రాశి వ్యక్తులతో కూడా మంచి స్నేహాన్ని కొనసాగిస్తారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు మీన రాశి మరియు సింహ రాశి వారితో ఎక్కువగా స్నేహం చేయడానికి ఆసక్తి చూపుతారు. వీరితో ఫ్రెండ్ షిప్ చేయడం వల్ల తమకు మంచి ఫలితాలొస్తాయని భావిస్తారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు సింహ రాశి మరియు కర్కాటక రాశి వారితో స్నేహం చేయడాన్ని బాగా ఇష్టపడతారు. వీరి స్నేహ బంధం చాలా బలంగా ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారు మిధున రాశి మరియు వృషభరాశి వ్యక్తులతో గాఢమైన స్నేహాన్ని కొనసాగిస్తారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు తుల, మకర రాశి మరియు వృషభరాశి వారితో ఎక్కువగా స్నేహం చేయడానికి ఆసక్తి చూపుతారు. వీరి స్నేహ బంధం చాలా బలంగా ఉంటుంది.

మీన రాశి..
ఈ రాశి వారికి కర్కాటక రాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులుగా ఉంటారు. వీరు ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకుంటారు.



Click it and Unblock the Notifications
