Latest Updates
-
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్!
ఇంట్లోని ప్రతికూల శక్తిని ఎలా తొలగించాలి, ఈ చిట్కాలతో నెగెటివ్ ఎనర్జీని తీసేయండి
ఇంట్లో నుండి ప్రతికూల శక్తిని ఎలా తొలగించాలి, ఎలాంటి వాస్తు చిట్కాలు పాటిస్తే ఇంట్లో నుండి ప్రతికూల శక్తిని తొలగించవచ్చో ఇప్పుడు తెలుసుకందాం.
ప్రతి ఇంట్లో సానుకూల శక్తి, ప్రతికూల శక్తి రెండూ ఉంటాయి. కొన్ని వాస్తు దోషాల వల్ల ప్రతికూల శక్తి ప్రభావం ఎక్కువ అవుతుంది. దాని వల్ల ఇంట్లో నివసించే కుటుంబసభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. దంపతుల మధ్య కలహాలు మొదలవుతాయి. మానసిక ప్రశాంతత దూరమవుతుంది. ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. సంపాదించినదంతా ఖర్చవుతుంది. ప్రతికూల శక్తి ఇంట్లో ఉండటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.

ఇంట్లో నుండి ప్రతికూల శక్తిని ఎలా తొలగించాలి, ఎలాంటి వాస్తు చిట్కాలు పాటిస్తే ఇంట్లో నుండి ప్రతికూల శక్తిని తొలగించవచ్చో ఇప్పుడు తెలుసుకందాం.

ఇంట్లో ప్రతికూల శక్తిని ఎలా గుర్తించాలి?
కుటుంబసభ్యుల అనారోగ్యం, గొడవలు, కలహాలు, ప్రశాంతత లేకపోవడం, ఆర్థిక సమస్యలు, ఒత్తిడి, నిరాశ, ఆందోళన లాంటి సమస్యలు ఇంట్లో ఉండే కుటుంబసభ్యులు ఎదుర్కొంటుంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అర్థం.

విరిగిన వస్తువులు తీసెయ్యాలి:
వాస్తు శాస్త్రంప్రకారం ఇంట్లో విరిగిన ఫర్నిచర్, ఆగిపోయిన గడియారం, పగిలిన అద్దం లాంటివి ఉంచకూడదు. వాటిని వీలైనంత త్వరగా తీసెయ్యాలి. ఇంట్లో ఉండే విరిగిన వస్తువులు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి.

సూర్యకాంతి ఇంట్లోకి వచ్చేలా చూడాలి:
ఇంట్లో సానుకూల శక్తి వచ్చేందుకు సూర్యకాంతి చక్కగా దోహదపడుతుంది. ఇంట్లోకి సూర్యకాంతి ప్రసరించేలా కిటికీలు తీయాలి, కర్టెన్లు తొలగించాలి. ఇంట్లోని టాక్సిన్లను తొలగించడానికి, ప్రతికూల శక్తిని సూర్యకాంతి తరిమికొడుతుంది.

ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి:
ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల చక్కగా కనిపించడమే కాదు ప్రతికూల శక్తిని పోగొట్టవచ్చు. ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేయడం, వస్తువులు వదిలేయడం, ఇళ్లంతా చిందరవందరగా ఉంటే ప్రతికూల శక్తిని ఇల్లు ఆవాసం అవుతుంది.
కాబట్టి ఇంటిని పద్ధతిగా ఉంచుకోవాలి. ఏ వస్తువు దాని చోట ఉంచాలి. బట్టలు ఒక చోట సర్దుకోవాలి. పుస్తకాలు, పెన్నులు, కుర్చీలు అన్ని పద్ధతిగా పెట్టుకోవాలి.

ఉప్పుతో ప్రతికూల శక్తిని తరిమికొట్టవచ్చు:
ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమికొట్టే శక్తి ఉప్పుకు ఉంది. ఇంటిని నీటితో తుడిచేటప్పుడు ఆ నీటిలో ఉప్పు కలుపుకోవాలి. సముద్రపు ఉప్పును గాజు గిన్నెలో ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి పోతుంది. అలాగే గురువారం నాడు ఇంటిని కడగడం మానుకోవాలి.

ప్రతికూల శక్తిని గ్రహించే మొక్కలు పెంచాలి:
కొన్ని మొక్కలు ఇంట్లోని ప్రతికూల శక్తిని గ్రహిస్తాయి. ప్రతికూల శక్తిని తీసేసి సానుకూల శక్తిని ప్రసారం చేస్తాయి. అదృష్టాన్ని తీసుకువస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులో తులసి మొక్కను పెంచుకోవడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. లక్కీ బాంబూ, జాస్మిన్, మనీ ప్లాంట్, పీస్ లిల్లీ, స్పైడర్ ప్లాంట్ ఇంట్లో సానుకూల శక్తిని ప్రసారం చేస్తాయి. అదృష్టాన్ని తీసుకువస్తాయి.

సేజ్, ధూపం, కర్పూరం వెలిగించాలి:
పొగ, ధూపం, కర్పూరం ఇంట్లో వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సైజ్, ధూపం వెలింగించి ఇంట్లోని కిటికీలను తెరచి ఉంచాలి. ఇంట్లో సాయంత్రం సమయంలో కర్పూరం వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మెరుగుపడుతుంది.

విండ్ చైమ్స్ వేలాడదీయాలి:
ధ్వని ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. గాలికి శబ్ధం చేసే విండ్ చైమ్స్ ఇంట్లో అక్కడక్కడ వేలాడదీయడం వల్ల ఇంట్లోని చెడు శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వస్తుంది.



Click it and Unblock the Notifications
