Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
12 రాశుల వారు బ్రేకప్ బాధ నుండి ఎలా బయటపడతారంటే...!
ఈ రాశుల వారు బ్రేకప్ బాధ నుండి ఎలా బయటపడతారో ఇప్పుడు తెలుసుకుందాం...
మనలో చాలా మంది తమ లవ్ లైఫ్ జీవించినంత కాలం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు. తాము మనస్పూర్తిగా, నిజాయితీగా ప్రేమించిన వారు తమకు కలకాలం తోడు ఉండాలని ఆశిస్తుంటారు.

అయితే మనం ఊహించినట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది..ఎందుకంటే కొన్ని ప్రేమలు విజయవంతంగా పరిణయం దాకా వెళ్తాయి.. మరికొందరి ప్రేమ వివాహం దాకా వెళ్లి ఆగిపోతూ ఉంటుంది. ఇంకా కొందరికి చాలా బాధాకరంగా మధ్యలోనే బ్రేకప్ జరుగుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా విడిపోవడం అనేది ఎవ్వరికైనా చాలా ఇబ్బందిగానే ఉంటుంది.

ఎందుకంటే ఒకరితో రిలేషన్ కోసం మనం ఎంతగానో సర్దుకుపోతుంటాం.. ఎన్నో త్యాగాలు సైతం చేస్తుంటాం.. అలాంటిది మనం మనసారా ప్రేమించిన వ్యక్తితో బంధాన్ని తెంచుకోవాలంటే.. బ్రేకప్ పేరుతో తమ బంధానికి బ్రేకులు వెయ్యాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ నుండి ద్వాదశ రాశుల వారు ఎలా బయటపడతారో తెలుసుకోవచ్చట. అదెలాగో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బ్రేకప్ వంటి బాధాకరమైన విషయాలను ఏ రాశి వారు ఎలా అధిగమిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు తాము ఎంతగానో ప్రేమించిన వ్యక్తితో విడిపోయాక అందరిని వదిలి ఏకాంతంగా గడపాలని భావిస్తారు. బ్రేకప్ బాధ నుండి బయటపడటానికి చాలా సహనంతో ఉంటారు. ముఖ్యంగా ఆ విషయాన్ని పక్కనబెట్టి వ్యక్తిగతంగా.. కెరీర్ పరంగా ముందుకు సాగాలని ప్రిపేర్ అవుతారు. అందుకోసం చాలా కష్టపడతారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు ప్రేమలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఈ లోకంలో తమ కంటే గొప్ప ప్రేమ ఏదీ లేదని ఫీలవుతుంటారు. ఎందుకంటే తాము ప్రేమకు చాలా విలువ ఇస్తామని భావిస్తారు. కానీ వీరి ప్రేమలో మధ్యలో బ్రేకప్ జరిగితే అస్సలు తట్టుకోలేరు. అయితే ఆ బాధ నుండి త్వరగానే బయటపడతారు. కెరీర్ పరంగా డెవలప్ అయ్యేందుకు ఆలోచనలు స్టార్ట్ చేస్తారు.

మిధున రాశి..
ఈ రాశి వారు.. ప్రేమలో విఫలమైతే భావోద్వేగ పరంగా చాలా బాధపడతూ ఉంటారు. బ్రేకప్ బాధను తట్టుకునేందుకు వీరు ఎక్కువ టైమ్ తీసుకుంటారు. వీరు మానసిక ప్రశాంతత కోసం విభిన్న ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో చిరాకుగా ఉంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు లవ్ ఫెయిల్యూర్ ని ప్రతికూలంగా భావిస్తారు. బ్రేకప్ జరిగితే ఇక తమ లైఫ్ మొత్తం నాశనం అయినట్లు అనుకుంటూ ఉంటారు. దీంతో జీవితంపై పెద్దగా శ్రద్ధ చూపరు. తమ టార్గెట్లను సైతం పక్కన పెట్టేస్తారు.

సింహ రాశి..
ఈ రాశి వారికి అహంకారం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ప్రేమ విషయంలో ఏదైనా తప్పు జరిగితే.. అది ఎదుటి వ్యక్తులది అనే భావనలో ఉంటారు. ఒక లవ్ ఫెయిల్ అయితే అందులో తమ లోపం ఏమీ లేదని.. తాము కెరీర్ పరంగా ముందుకు వెళ్లేందుకే ఇలా జరిగిందని భావిస్తుంటారు.

కన్య రాశి..
ఈ రాశి వారు ప్రేమలో విఫలమయ్యాక.. కొన్ని విషయాల గురించి చాలా ఓపికగా ఆలోచిస్తారు. ముందుగా ఎందుకు ఇలా జరిగింది.. ఇక ముందు అలా జరగకుండా ఉండేందుకు ఏమి చేయాలనే దానిపై ఫోకస్ పెడతారు. అందుకే వీరు లవ్ ఫెయిల్యూర్ నుండి బయటపడేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు.

తుల రాశి..
ఈ రాశి వారు బ్రేకప్ బాధ నుండి కష్టపడి బయటికొస్తారు. వీరు ప్రేమలో విఫలమైతే.. అలా ఎందుకు జరిగిందని చింతించే రకం కాదు.. దాని గురించి పట్టించుకోకుండా భవిష్యత్తులో ఏమి చేయాలనే విషయాలపై ఫోకస్ పెడతారు. అయితే లవ్ ఫెయిల్యూర్ వంటి విషయాల నుండి బయట పడేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు బ్రేకప్ బాధను తట్టుకోలేరు. ఒక్కసారి లవ్ లైఫ్ లో దెబ్బ తింటే తాము కోలుకోలేమని భావిస్తారు. అయితే దాని నుండి మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సక్సెస్ సాధించే వరకు ఎక్కువ కష్టపడతారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు ప్రేమలో విఫలమైతే చాలా బాధపడతారు. అయితే ఆ బాధ నుండి బయటపడేందుకు చాలా కష్టపడతారు. అందుకోసం మంచిగా ప్లాన్ చేసుకుంటారు. వీరు అనుభవం ఉన్న సలహాలు తీసుకుని సక్సెస్ వైపు అడుగులు వేస్తారు.

మకర రాశి..
ఈ రాశి వారు లవ్ లో ఫెయిలైతే.. తమకు ఇంకో ఛాన్స్ దక్కుతుందని ఆశిస్తారు. బ్రేకప్ జరిగినా అది తమ మంచికే అని భావిస్తారు. జీవితంలో తమకు ఇంకా అనేక అవకాశాలు లభిస్తాయని పాజిటివ్ మైండ్ తో ఉంటారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు లవ్ ఫెయిల్యూర్ వల్ల కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఎందుకంటే వీరు ఎక్కువగా సానుకూల ఆలోచనలు చేస్తారు. బ్రేకప్ వంటి వాటి వల్ల తమకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయని ఎక్కువగా నమ్ముతారు.

మీన రాశి..
ఈ రాశి వారు లవ్ ఫెయిల్యూర్ గురించి పెద్దగా బాధపడరు. తమను దక్కించుకునే అవకాశం ఎదుటి వ్యక్తులకు లేదనే ఎక్కువగా ఫీలవుతుంటారు. అందుకే బ్రేకప్ జరిగిందని భావిస్తారు. భవిష్యత్తులో హ్యాపీగా ఉండేందుకు.. ఏం చేయాలనే విషయాలపై ఎక్కువ ఫోకస్ పెడతారు. అందుకోసం ప్రశాంతంగా ఉండే ప్రదేశాలలో ఎక్కువ సమయం గడుపుతారు.



Click it and Unblock the Notifications











