Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
జోష్ యాప్ లో #EkNumber ఛాలెంజ్ విజేతకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్న సోనుసూద్, మౌనిరాయ్...
మన దేశంలోని మోస్ట్ పాపులర్ స్టార్స్ సోనుసూద్, మోని రాయ్ తో పాటు టాప్ ఇన్ఫ్లుయెన్సర్లతో జోష్ యాప్ తొలి వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఏక్ నంబర్ ఛాలెంజ్ ను ప్రారంభించారు.
'Josh'యాప్ భారతదేశంలో వచ్చిన ఏడాదిలోనే ఎన్నో అద్భుతాలు చేసింది. మన దేశంలో ఉత్తమ షార్ట్ వీడియోగా ట్రెండ్ ని సెట్ చేసేసింది. గత సంవత్సరంలో రిచ్ కంటెంట్ మరియు లేటెస్ట్ ట్రెండ్స్ తో ప్రేక్షకులను అలరించడానికి యాప్ ఎంతగానో శ్రమించింది.

ఈ నేపథ్యంలోనే జోష్ యాప్ తొలి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమ యూజర్లకు అనేక ఛాలెంజ్ లు నిర్వహిస్తూ.. అందులో విజేతలుగా నిలిచిన వారికి అనేక బహుమతులను అందజేస్తూ వస్తోంది. అందుకే ప్రస్తుతం షార్ట్ వీడియో మేకింగ్ యాప్ మార్కెట్లో జోష్ యాప్ ఉత్తమమైనదిగా పరిగణించబడుతోంది. అందుకే ఈ యాప్ వచ్చిన తొలి ఏడాదిలోనే నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం జోష్ యూజర్లలో దేశంలోని టాప్ స్టార్స్ మరియు ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మందే ఉన్నారు.
#BlueWarrior పేరిట
వీరంతా వివిధ రకాల.. విభిన్నమైన కంటెంట్ ను అందిస్తుంటే.. వాటిని అందరికీ చేరవేసేందుకు జోష్ యాప్ ముందంజలో ఉంది. ఇలా ప్రతిరోజూ దాదాపు 2 బిలియన్ వీడియోలను తన ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ యాప్ లో 20 వేలకు పైగా కంటెంట్ క్రియేటర్లను మేనేజ్ చేయడానికి గొప్ప టీమ్ అందుబాటులో ఉంది. తాజా మరియు విభిన్న కంటెంట్ కారణంగా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకుంటోంది. ఒక్క ఏడాదిలోనే ఈ యాప్ చాలా కీలక పనులు కూడా చేసింది. #BlueWarrior పేరిట దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయాల్లో జోష్ యాప్ అతి పెద్ద ప్రముఖులు మరియు బ్రాండ్లను కలుపుతూ వినూత్న ఆలోచనలు చేసింది. కోట్ల రూపాయల విరాళాలను సేకరించి ప్రధానమంత్రి సహాయనిధికి పంపింది. ఎప్పటికప్పుడు స్రుజనాత్మక పనులతో జోష్ యాప్ ఎల్లప్పుడూ ముందుకు దూసుకెళ్లింది.

#EkNumber ఛాలెంజ్..
జోష్ యాప్ 2021 ఆగస్టు నెలలో తొలి సంవత్సరాన్ని పూర్తి చేసుకోబోతోంది. ఇంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ఘన విజయం సాధించిన సందర్భంగా గొప్ప వేడుకలకు సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా జోష్ యాప్ EkNumber అనేక ఛాలెంజ్ ను తీసుకొచ్చింది. భారతదేశంలోని అగ్రశ్రేణి ప్రభావశీలురు మరియు దేశంలోని ఇద్దరు ప్రముఖ నటులు సోనూసుద్, మౌనిరాయ్ ఈ ఛాలెంజ్ ను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో జోష్ ప్రచారం ఆగస్టు 17వ తేదీ నుండి ప్రారంభమైంది. అయితే #EkNumber ఛాలెంజ్ ఆగస్టు 20వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఇందులో డ్యాన్స్, ఫ్యాషన్, ఫుడ్, కామెడీ మరియు ఫిట్ నెస్ అన్ని కేటగీరీలు ఉన్నాయి.
సోనుసూద్, మౌనిరాయ్ ఈ ఐదు విభాగాల ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్తారు. ఈ యాప్ లో ఎనిమిది భాషల నుండి అనేక మంది అగ్రశ్రేణి ప్రభావశీలురు చేరతారు. ఈ ప్రభావం చూపేవారిలో ఫైజు, సమీక్ష, ఇషాన్, మధుర, మరియు షాదన్, రణ్ వీర్ బ్రార్, రూహిసింగ్, కెవిపై బాల, కింగ్స్ యునైటెడ్ సురేష్ వంటి తారలు ఉన్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లందరూ కలిసి జోష్ యాప్ లో 120 మంది ప్రతిభావంతులైన వ్యక్తులను సెలెక్ట్ చేస్తారు. వీరు తమ ప్రత్యేకమైన కంటెంట్ ను బట్టి 10 రోజల్లో #EkNumber ఛాలెంజ్ ను గెలుచుకుంటారు.
#EkNumber ఛాలెంజ్ లో పాల్గొనే వారు ఈ 6 హ్యాష్ ట్యాగ్లను వాడాలి..
జోష్ యాప్ పోటీలో పాల్గొనే వారు ఈ హ్యాష్ ట్యాగ్లను ఉపయోగించాలి.
#EkNumber
#EkNumberDanceStar
#EkNumberFashionStar
#EkNumberFoodStar
#EkNumberComedyStar
#EkNumberFitnessStar
అద్భుతమైన ప్రైజ్ మనీ..
ఈ ఛాలెంజ్ లో గెలిచిన వారికి అద్భుతమైన ప్రైజ్ మనీ లభిస్తుంది. అంతేకాదు జోష్ ఆల్ స్టార్స్ లో భాగమయ్యే అద్భుతమైన అవకాశం కూడా లభిస్తుంది. దీంతో పాటు భారతదేశంలో నెంబర్ వన్ కంటెంట్ క్రియేటర్ గా మారడానికి ఇది ఒక సువర్ణావకాశం. అంతేకాదు మిగిలిన విజేతలకు రూ. 50 వేల వరకు ప్రైజ్ మనీ, టాప్ స్టార్స్, వారి రోల్ మోడళ్లను కలిసే అవకాశం కూడా లభిస్తుంది. జోష్ యాప్ తొలి ఏడాది వార్షికోత్సవాన్ని మరింత ఉత్తేజపరిచేందుకు ఈ వీడియో యాప్ 'Ek Number' మ్యూజిక్ వీడియోతో వచ్చింది. ఇందులో యాప్ యూజర్లు క్లింటన్ సెరెజో మరియు బియాంకా గోమెజ్ 'జోష్ మే ఆజా'పై ర్యాప్ చేశారు. వీటితో పాటు జోష్ మీ అనుభవాన్ని మరింత సరదాగా మార్చేందుకు IG ఫిల్టర్ ని ప్రారంభించింది.



Click it and Unblock the Notifications