Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
Kanya Rasi Ugadi Rasi Phalalu 2022 'శుభకృత'ఏడాదిలో కన్య రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే..!
2022 'శుభకృత'నామ సంవత్సరంలో కన్య రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుదాం.
మన దేశంలో ఇటీవలే హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నాం.. అదే సమయంలో మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం.

2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం.

ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, 'శుభకృతు' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా కన్య రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-11, వ్యయం-05
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ కాలంలో మీరు చాలా డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. ఉత్తర నక్షత్రం 2,3,4 నాలుగు పాదాలు లేదా హస్త నక్షత్రం 1,2,3,4 నాలుగు పాదాలు, లేదా చిత్త నక్షత్రం 1, 2 పాదాల్లో అంటే మొత్తం తొమ్మిది స్థానాలు ఉంటాయి.

రాజపూజ్యం-4, అవమానం-09
ఈ ‘శుభకృత' నామ సంవత్సరంలో కీర్తి, ప్రతిష్టలు, గౌరవం కన్నా అవమానాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీనరాశిలో గురు సంచారం చేయడం వల్ల తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం రవి, కుజుడు, శుక్రుడు, చంద్ర గ్రహాల సంచారం వల్ల విశేష ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు ఈ కాలంలో శుభకార్యాల్లో పాల్గొంటారు.

శని గ్రహ ప్రభావంతో..
ఈ రాశి వారికి శని గ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే 2023 సంవత్సరంలో జనవరి 17 తర్వాత ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో ఆరోగ్య సమస్యల నుండి ఉపశమం లభిస్తుంది. మీరు శత్రువులపై కూడా విజయం సాధిస్తారు.

రాహు ప్రభావంతో..
రాహువు అష్టమ భాగంలో సంచారం చేయడం వల్ల
తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి కొన్ని ఆసక్తికర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే అత్యాశ కారణంగా మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది.మరోవైపు ఈ సంవత్సరంలో పాము, తేలు వంటి వాటి వల్ల కొన్ని ప్రమాదాలు జరగొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు జూదం ఆడే అలవాటు ఉంటే, చాలా నష్టపోవాల్సి ఉంటుంది.

కేతు ప్రభావం వల్ల..
ఈ కాలంలో తులరాశిలో కేతువు సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడొచ్చు. మీ బంధుమిత్రులతో ఆర్థిక పరమైన విషయాల్లో విభేదాలు రావొచ్చు. వ్యాపారులు తరచుగా నష్టపోయే అవకాశం వస్తుంది. ఇదంతా ఇతరులపై ఆధారపడటం వల్లే జరగొచ్చు.

పరిహారాలివే..
ఈ సంవత్సరంలో గ్రహాల అనుగ్రహం పొందేందుకు నిరంతరం వినాయకుని ఆరాధన చేయాలి. మరకత గణపతికి లేదా శ్వేతార్చన గణపతికి లేదా చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన స్వయంభు వినాయక దేవాలయానికి వెళ్లి దర్శించుకోవడం వల్ల మీరు కేతు ప్రభావాల నుండి బయటపడొచ్చు. రాహువు అనుగ్రహం పొందడానికి విజయవాడలోని కనకదుర్గమ్మ వారి ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేయాలి. అలా కుదరని వారు దగ్గర్లోని అమ్మవారి ఆలయానికి వెళ్లి నిత్యం కుంకుమ పూజలు చేయాలి.ఈ పరిహారాలు పాటించడం వల్ల మీకు తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications