Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Karkataka Rasi Ugadi Rasi Phalalu 2022:'శుభకృత'ఏడాదిలో కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...
2022 సంవత్సరంలో ఉగాది పండుగ సందర్భంగా కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలసుకుందాం.
మన దేశంలో ఇటీవలే హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నాం.. అదే సమయంలో మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం.

2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృత' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం.

ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, 'శుభకృతు' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-05, వ్యయం-05
‘శుభకృత' నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. ఈ రాశి వారికి గురు గ్రహం అనుగ్రహం వల్ల కొత్త ఏడాదిలో ఆశించిన ఫలితాలొస్తాయి. రాజకీయాల్లో ఉండే వారికి మంచి పదవులు రావొచ్చు. మీకు ఆర్థిక రుణాల నుండి విముక్తి లభిస్తుంది. పునర్వసు నక్షత్రం 4వ పాదం లేదా పుష్యమీ నక్షత్రం 1,2,3,4 లేదా అశ్లేషా నక్షత్రం 1, 2,3,4 పాదాలలో ఉంటుంది. విద్యారంగంలో ఉండే వారి శుభ ఫలితాలొస్తాయి.

రాజపూజ్యం-09, అవమానం-02
కర్కాటక రాశి వారికి కొత్త ఏడాదిలో శని గ్రహం వల్ల ప్రతికూల ఫలితాలు రావొచ్చు. అనుకున్న సమయానికి పనులు జరగకపోవచ్చు. చాలా పనులు పెండింగులో పడిపోవచ్చు. మీరు కొంత సొమ్ము నష్టపోయే అవకాశం ఉంది.

రాహు ప్రభావం వల్ల..
రాహువు దశమ భాగంలో సంచారం చేయడం వల్ల విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి, అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. రవి, కుజ, గురు, బుధ, శుక్ర సంచారాల వల్ల మంచి ఫలితాలొస్తాయి. భూ సంబంధిత, వ్యాపారంలో మంచి లాభాలు రావొచ్చు.

కేతు ప్రభావంతో..
తెలుగు నూతన సంవత్సరంలో కేతువు ప్రభావం కారణంగా, మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. దీని వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

నిరుద్యోగులకు అనుకూలం..
తెలుగు సంవత్సరం కొత్త ఏడాది ప్రారంభంలో కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగాన్వేషణ చేయుటకు అనుకూలంగా ఉంటుంది. తొలి మూడు నెలలు ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అయితే ఆ తర్వాత ఆర్థిక పరంగా కొన్ని ఖర్చులు పెరుగుతాయి.

'శుభకృత' ఏడాదిలో కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...
కర్కాటక రాశి వారు శని ప్రతికూల ఫలితాలు తొలగిపోయి, శని అనుగ్రహాన్ని అనుకూలంగా మలచుకోవడానికి మహారాష్ట్రలోని శని సింగ్నాపూరానికి లేదా తమిళనాడులోని తిరునల్లార్ లోని పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజాలు చేయాలి. అప్పుడు మీకు కొంత మనశ్శాంతి కలుగుతుంది. కేతు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి నిత్యం వినాయకుడిని పూజించాలి. ధూప, దీప నైవేద్యాలతో ఆరాధించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications











