Latest Updates
-
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
Krishna Janmashtami 2023:మనకు ప్రేరణనిచ్చే కన్నయ్య సందేశాలు...
మనలో శ్రీక్రిష్ణుడి పేరు చెప్పగానే అందరికీ టక్కున భగవద్గీతనే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ గీతను బోధించి లోకానికి దారి చూపాడు శ్రీక్రిష్ణుడు. శ్రీ క్రిష్ణుడు చిన్నతనంలో ఉన్నప్పుడు అల్లరి బాలుడిగా ఉండేవాడు.

తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని సైతం మనందరికీ తెలియజేశాడు. చిన్నప్పుడే వెన్న దొంగగా మారి అందరి మనసులను దోచుకున్నాడు. గోకులంలో గోప బాలకునిగా.. యశోద పుత్రునిగా.. బలరాముని సోదరునిగా.. అసురసంహారిగా, ధర్మ సంరక్షకుడిగా, ఎన్నో రకాల పాత్రలు పోషించాడు. అలా శ్రీ క్రిష్ణుడు ఎన్ని పాత్రలు పోషించినా.. అదంతా లోక కళ్యాణం కోసమే. అసలు క్రిష్ణ పరమాత్ముడు లేని మహా భారతాన్ని మనం అస్సలు ఊహించలేం.

ఇక క్రిష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇంట్లో ఉండే చిన్న పిల్లలను చిన్ని క్రిష్ణుడితో పోలుస్తారు. వారికి క్రిష్ణుడి వేశం వేసి.. తనలోనే చిన్ని క్రిష్ణుడిని చూసుకుంటారు. పెళ్లైన వారు తమకు క్రిష్ణుడి లాంటి సంతానం కావాలని కోరుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు అల్లరి చేసే చిన్నారులను చిన్ని క్రిష్ణుడు లేదా అల్లరి క్రిష్ణుడు అని పిలుస్తారు. అందుకే క్రిష్ణుడి పుట్టినరోజు వస్తోందంటే చాలు దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున శ్రీ క్రిష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన ఈ పండుగ వచ్చింది. ఈ సందర్భంగా మనందరికీ స్ఫూర్తినిచ్చే శ్రీ క్రిష్ణుని సందేశాలను ఓసారి గుర్తు చేసుకుందాం...

జీవితం ఒక యుద్ధరంగం..
దాన్ని పోరాడి గెలవాలి..
నీ ప్రయత్నం ఆపనంత వరకూ..
నువ్వు ఓడినట్టే లెక్క..
భగవద్గీత

నిజాయితీతో చేయండి..
మీరు ఏ పని చేసినా నిజాయితీతో చేయండి..
అందులో అత్యాశ, కోరిక, అహం ఉండకూడదు..
దాంట్లో ప్రేమ, కరుణ, భక్తి మాత్రమే ఉండాలి..
హ్యాపీ క్రిష్ణాష్టమి

ఏం జరుగుతుందో తెలియదు..
ప్రారంభమెక్కడో తెలియదు..
ముగింపు ఎప్పుడో తెలియదు..
మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు..
అందుకోసం చింతించాల్సిన పని లేదు..
భగవద్గీతలో క్రిష్ణుడి బోధన

ఆత్మను ఏ ఖడ్గం చీల్చలేదు..
ఆత్మను ఏ ఖడ్గం చీల్చలేదు..
ఏ మంటలు దాన్ని దహించలేవు..
ఎంత నీరైనా దాన్ని కరిగించలేదు..
ఎంత గాలి వీచినా దాన్ని కదిలించలేదు..
అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు

అర్జునుడికి దారి..
మహాభారత యుద్ధంలో అర్జునుడికి దారి చూపినట్టుగా..
మీ జీవితంలో క్రిష్ణుడు దారి చూపించాలి..
ఆ పరమాత్ముని ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి..
క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు

ధర్మాన్ని నిలబెట్టేందుకు..
అసురత్వాన్ని అంతం చేసేందుకు..
ధర్మాన్ని నిలబెట్టేందుకు..
వాసుదేవుడు పుట్టిన క్రిష్ణాష్టమి పర్వదినం..
మీ జీవితంలో సుఖసంతోషాలను నింపాలి..
ఆ క్రిష్ణ పరమాత్ముని ఆశీస్సులు మీకు దక్కాలి.

ఆత్మ ఒకటే..
అందరిలో ఉండే ఆత్మ ఒకటే..
కనుక ఒకరిని ద్వేషించడం అనేది..
తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది..
శ్రీ క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు

జీవితంలో ఏం సాధించాలన్నా..
జీవితంలో ఏం సాధించాలన్నా కష్టపడాల్సిందే..
కష్టపడనిదే ఏది మీకు కలసి రాదు..
మీరు చేసే పనికి అదృష్టం కావాలని కోరుకుంటూ..
శ్రీ క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు

బుద్ధి పరి పరి విధాలుగా
మనసు మంచిగా ఉన్న వారి బుద్ధి నిశ్చలంగా ఉంటుంది..
అలా లేని వారి బుద్ధి పరి పరి విధాలుగా మారిపోతుంది..
భగవద్డీతలో శ్రీక్రిష్ణుని మాటలు

అనివార్యమగు ఈ విషయం
పుట్టిన వారికి మరణం తప్పదు..
మరణించిన వారికి జననం తప్పదు..
అనివార్యమగు ఈ విషయం గురించి శోకించక తప్పదు.
భగవద్గీత



Click it and Unblock the Notifications