Latest Updates
-
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా?
మకర సంక్రాంతి 2023 : అదిరిపోయే పొంగల్ విషెస్.. కోట్స్, మెసెజెస్, స్టేటస్ లను షేర్ చేసుకోండి...
ఈ సంక్రాంతి పండుగ అర్థం ఏమిటంటే ‘సం‘ అంటే మంచి అని.. ‘క్రాంతి‘ అంటే అభ్యుదయం అని అర్థం. మనందరికీ మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కాబట్టే ‘సంక్రాంతి‘గా పండితులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు చేసుకునేందుకు అందరూ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ముచ్చటగా మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ సందర్భంగా తెలుగు లోగిళ్లలో భోగి మంటలు.. కలర్ ఫుల్ ముగ్గులు.. వాటి మధ్యన గొబ్బెమ్మలు... హరిదాసు కీర్తనలు.. కుర్రకారు కేరింతలు.. పల్లెటూరి పడుచుల అందాలు.. కోళ్ల పందాలు.. ఎడ్ల పందాలతో ఎంతో సరాదాగా జరుపుకునే ఈ పండుగకు ప్రతి ఒక్కరూ తమ సొంత ఊరికి చేరుకుంటారు.

అంతే కాదండోయ్ ఈ పండుగ సందర్భంగా కొత్త కోడళ్లు.. కొత్త అల్లుళ్ల రాకతో ప్రతి ఇల్లు సందడిగా మారిపోతూ ఉంటుంది. ఈ పండుగ సందడి మాత్రం పట్టణంలో కంటే పల్లెటూళ్లలోనే ఎక్కువగా ఉంటుంది. రైతులందరికీ ఈ సమయంలో పంట చేతికొస్తుంది. ఈ సందర్భంగా చాలా మంది పాడి పశువులను పూజించి, తమ దైవ సమానులైన తల్లిదండ్రులను ప్రార్థించి బంధు మిత్రులతో కలిసి చేసుకునే అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ అర్థం ఏమిటంటే 'సం' అంటే మంచి అని.. 'క్రాంతి' అంటే అభ్యుదయం అని అర్థం.
మనందరికీ మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కాబట్టే 'సంక్రాంతి'గా పండితులు చెబుతున్నారు. ఈ సంక్రాంతి పండుగ సంతోషాన్ని, సరదాలను, సంబరాలను మీరు మీ బంధు మిత్రులు, శ్రేయోభిలాషులతో పంచుకుందాం. అందుకోసం సంక్రాంతి సందేశాలు, వాట్సాప్ కొటేషన్స్, ఫేసుబుక్ లో విషెస్ వంటివి చేద్దాం. ఈ సందర్భంగా మీ కోసం కొన్ని సందేశాలను, కోట్స్ ను, పొంగల్ ఇమేజ్ లను బోల్డ్ స్కై తెలుగు తీసుకొచ్చింది. వీటిలో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోండి. మీ బంధు మిత్రులందరికీ శుభాకాంక్షలు చెప్పండి.. సంక్రాంతి సంబరాలను అంబరాన్నంటేలా జరుపుకోండి....

టాప్ - 10
మీ ఇంట్లో వారందరికీ భోగ భాగ్యాలు కలగాలని..
సంక్రాంతి సరదాలు సంవత్సరమంతా కొనసాగాలని..
కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నిండాలని..
కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..

టాప్ -9
ఇంటి లోగిలి వద్ద రంగు రంగు ముగ్గులతో..
వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో..
మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో..
మీ ఇంటి గుమ్మం పసుపు కుంకుమలతో..
ఆనంద నిలయంగా మారి.. మీ ఇంటిల్లి పాది
అందరూ నిత్యం సుఖ సంతోషాలతో కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

టాప్ - 8
తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ..
మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ..
పల్లెటూరి పవర్ ఏంటో చూపుతూ..
సంక్రాంతి పండుగను జరుపుకోండి...
తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి..
అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

టాప్ -7
మీకు, మీ కుటుంబసభ్యులకు, మీ బంధుమిత్రులకు మనస్పూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు..

టాప్ -6
అందరికీ భోగభాగ్యాలనిచ్చే భోగి..
సరదాలు తెచ్చే సంక్రాంతి..
ఇప్పటి నుండి కొత్తగా.. సరికొత్తగా..
మరింత ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

టాప్ -5
భోగిపళ్లుగా మారే రేగిపళ్లు..
చిన్నారుల ముసి ముసి నవ్వులు..
కలర్ ఫుల్ ముగ్గులు.. వాటి మధ్య గొబ్బెమ్మలు..
ఎక్కడ చూసినా హరిదాసుల కీర్తనలు..
కోడిపందాలు.. ఎడ్ల పందాలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

టాప్-4
భోగి మంటలతో వస్తుంది వెచ్చదనం..
కోడి పందాలతో పెరుగుతుంది పౌరుషం..
పల్లెటూళ్లో పెరుగుతుంది జన సందోహం..
సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

టాప్-3
కష్టాలను కాల్చివేసే భోగి మంటలు..
భోగాలను అందించే భోగి పళ్లు..
కొత్త అల్లుళ్లకి స్వాగతం పలికే తోరణాలు..
బరిలో పోరుకు సిద్ధమైన కోళ్లు..
తెలుగు లోగిళ్ల వద్ద రంగు రంగుల ముగ్గులు..
వాటిని వేసే మెరుగుదిద్దే అందమైన రంగవల్లులు..
హరిదాసుల కీర్తనలు.. పిండివంటలు.. కొత్తబట్టలు..
ఇంకా ఎన్నెన్నో సంబరాలను జరుపుకోవాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

టాప్-2
ఆకాశంలోకి దూసుకెళ్లే పతంగులు..
పల్లెటూళ్లో పందెం రాయుళ్ల కోడిపందాలు..
ధాన్యపు రాశులతో నిండిపోయే గదులు..
చిందులు వేసేందుకు ముస్తాబయ్యే బసవన్నలు..
కీర్తనలు పాడే హరిదాసులు..
సంక్రాంతి అంటేనే మూడు రోజులు..
చూడగలమా పల్లెటూరి పడుచుల సోయగాలు..
ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

టాప్-1
సూర్యుడి మకర సంక్రమణం..
భోగి మంటలతో వెచ్చదనం..
అంబరాన్ని తాకే పతంగుల విహారం..
అవధుల్లేని కోడి పందేల సమరం..
తెలుగు లోగిళ్లలో రంగవల్లుల హారం..
అన్ని గుమ్మాలలో మామిడి తోరణం..
హరిదాసుల మధుర సంగీతం..
బసవన్నల సుందర నాట్యం..
పల్లెటూరిలోని పైరుల అందం..
కొత్త అల్లుళ్లు.. కోడళ్ల సరదాల వినోదం..
గుర్తుండి పోయే ప్రతి క్షణం..
నెమరు వేసుకో మిత్రమా మరో సంవత్సర కాలం...
అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..



Click it and Unblock the Notifications

