Latest Updates
-
రొటీన్ టిఫిన్స్‌కి బదులుగా సొరకాయతో ఇలా కొత్త రకం బ్రేక్‌ఫాస్ట్.. తింటే రుచి జన్మలో మరిచిపోలేరు.! -
రేపే ఆషాఢ పౌర్ణమి.. ఈ చెట్టును పూజించినట్లయితే కష్టాలు తొలగి లక్ష్మీదేవి కటాక్షం.! -
ఎప్పుడూ ఒకేలా కాకుండా..బ్యాచిలర్స్ కూడా మెచ్చే స్పైసీ టమాటో ఎగ్ కర్రీ! -
మీ లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఈజీగా తెలుసుకోండిలా! -
ఈ ఐదు రాశుల వారిపై శని వక్ర గమనం తీవ్ర ప్రభావం.. డిసెంబర్లో ఈ తేదీ వరకు కష్టాలు తప్పవు.! -
మ్యాగీ ఎప్పుడూ వేడివేడిగానేనా? ఒకసారి ఈ చల్లని మ్యాగీ రైతా ట్రై చేయండి! -
చంకభాగాల్లో నలుపుతో స్లీవ్‌లెస్ వేసుకోలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్‌తో ఇక ఆ సమస్యే ఉండదు.! -
మీ భార్యతో ఆ సమయంలోనే ప్రేమగా ఉంటున్నారా.. అది ఎంత పెద్ద తప్పో తెలుసా.? -
కత్రినా కైఫ్ నాజూకైన అందం వెనుక ఉన్న స్పెషల్ డ్రింక్ ఇదే..ఎలా చేసుకోవాలంటే.. -
కిడ్నీల పనితీరు బాగాలేదని తెలిపే ఐదు హెచ్చరిక సంకేతాలు.. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంతే.!
Mars Transit in Cancer on 02 June 2021:కర్కాటకంలో కుజుడి ఎంట్రీ.. 12 రాశులపై ఆర్థికంగా ప్రభావం...!
కుజుడు కర్కాటకంలోకి సంచారం చేసే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నవగ్రహాలలో అంగారకుడు(కుజుడు)ని దేవతల సేనాధిపతిగా పిలుస్తారు. కుజుడిని శక్తి, ధైర్యం, శౌర్యానికి కారకంగా భావిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఎంతో విశిష్టత కలిగిన అంగారకుడు 2021 సంవత్సరంలో జూన్ 2వ తేదీన ఉదయం 6:39 గంటలకు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఇదే రాశిలో జులైన్ 20వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఆ తర్వాత సింహ రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇలా కుజుడు ఒక స్థానం నుండి మరో స్థానంలోకి మారే సమయంలో రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది..

ఈ సమయంలో ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి కుజుడి రవాణా వల్ల సానుకూల ప్రయోజనాలు ఉండొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి అవకాశాలు ఉండొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులను మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో వివాదం ఉండొచ్చు.

వృషభ రాశి..
కుజుడు కర్కాటకంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మానసికంగా ఒత్తిడి ఎదురవుతుంది. ఈ కాలంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. అప్పుడే మీకు విజయం లభిస్తుంది. మీకు సంపద మరియు లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ సభ్యులతో సమయం గడిపేందుకు ప్రయత్నించాలి.

మిధున రాశి..
కుజుడు కర్కాటకంలోని రవాణా చేసే సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆర్థిక పరంగా నష్టం కావొచ్చు. మీరు డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయాలి. లావాదేవీలకు ఇది సమయం కాదు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి..
మిధున రాశి నుండి ఈ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి కొంత ఒత్తిడి ఎదురవుతుంది. మీకు ఆగ్రహం రావొచ్చు. ఆర్థిక పరంగా ఈ సమయం బలంగా ఉంటుంది. అయితే ఎక్కువగా ఖర్చు చేయడం మానుకోవాలి. ఆరోగ్య పరంగా ఈ సమయంలో శ్రద్ధ వహించాలి.

సింహ రాశి..
ఈ రాశి వారికి కుజుడి రవాణా వల్ల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీకు ఆర్థిక పరంగా నష్టం ఉండొచ్చు. ఎలాంటి సమయంలో లావాదేవీలు చేయకండి. ఈ సమయంలో పెద్ద పెట్టుబడి వల్ల నష్టాలు సంభవిస్తాయి. మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపండి. మీరు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కన్య రాశి..
కుజుడి సంచారం వల్ల ఈ రాశి వారు ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ ఖర్చు చేయొద్దు. మీరు ఏదైనా తెలివిగా పెట్టుబడి పెట్టాలి. మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి..
కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి పని ప్రదేశంలో ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ కాలంలో సమస్యలు పెరగొచ్చు. మీ వైవాహిక జీవితంలో కొన్ని తేడాలు ఉంటాయి. సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మీ జీవిత భాగస్వామితో సమయం గడపండి.

వృశ్చిక రాశి..
కుజుడు కర్కాటక రాశిలోకి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారు శారీరక మరియు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అయితే మీరు కష్టపడాల్సి ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి కుజుడు సంచారం చేసే సమయంలో చాలా కష్టాలు ఎదురవుతాయి. అదనపు ఖర్చులను నివారించడానికి ప్రయత్నించాలి. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అంతా మంచిగా ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారికి కుజుడి రవాణా వల్ల వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీరు ఆహారం మరియు పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కుంభ రాశి..
కుజుడు సంచారం చేసే సమయంలో ఈ రాశి వారు కోపాన్ని నియంత్రించుకోవాలి. మీరు అధికంగా ఖర్చులు చేయడం మానుకోవాలి. మీ జీవిత భాగస్వామితో మధురమైన సంబంధాన్ని కొనసాగించడానికి, మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.

మీన రాశి..
ఈ రాశి వారికి కుజుడి రవాణా వల్ల పిల్లల వైపు నుండి కొన్ని సమస్యలు ఉండొచ్చు. మీరు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications