Latest Updates
-
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.? -
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది.. -
విజయవాడ కనక దుర్గమ్మ తల్లి ఆ కొండపై ఎందుకు కూర్చుంది? అసలు కథ -
ధాబా స్టైల్ టీ ఇంట్లోనే కావాలా? అయితే ఈ 3 సీక్రెట్ మసాలాలు వాడాల్సిందే! -
జూన్ 18, 2026: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధన లాభం, కెరీర్లో సంచలనం! -
కర్కాటక, సింహ, ధనస్సు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. మీ అదృష్టం ఎలా ఉంది? - గురువారం, 18 జూన్ 2026 -
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ
Mars Transit in Virgo 6 Septemeber 2021: 6న అంగారకుడు కన్య రాశిలోకి సంచారం.. ఈ 5 రాశులకు ప్రయోజనం...!
2021లో సెప్టెంబర్ 6వ తేదీన కన్యరాశిలో అంగారకుడి ప్రవేశంతో ఈ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాలలో అంగారకుడి(కుజుడు)కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రహాన్నే అరుణ గ్రహం అని కూడా పిలుస్తారు.

ఈ గ్రహం యొక్క ప్రభావం వల్ల జాతకరీత్యా ధైర్యం, శక్తి కారకుడిగా పరిగణిస్తారు. ఎంతో గొప్ప విశిష్టత కలిగిన అంగారకుడు సెప్టెంబర్ తొలి వారంలో అంటే 2021 సంవత్సరంలో సెప్టెంబర్ ఆరో తేదీన తన స్థానాన్ని మారనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది.

శని గ్రహం తర్వాత అత్యంత క్రూరమైన గ్రహంగా కుజుడిని పరిగణిస్తారు. అలాంటి అంగారకుడు సింహ రాశి నుండి కన్యా రాశిలోకి రవాణా చేయనున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...
ఈ రాశుల వారు సంపాదనలో ముందుంటారట... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి

మేష రాశి..
ఈ రాశి నుండి అంగారకుడు ఆరో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మేష రాశి వారికి ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీరు మీ శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలో సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే మీరు ఈ కాలంలో మీ ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు ఈ కాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

వృషభ రాశి..
ఈ రాశి నుండి అంగారకుడు ఐదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో వృషభ రాశి వారు క్రీడా రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ కాలంలో క్రీడా పోటీల్లో పాల్గొనే వారు కచ్చితంగా విజయం సాధిస్తారు. మరోవైపు విద్యార్థులు తమ ప్రతిభను చాటే అవకాశాన్ని పొందుతారు. మీరు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే మంచి ఫలితాలను సాధిస్తారు. మరోవైపు ఉద్యోగులు ఈ కాలంలో ఏదైనా ముఖ్యమైన పనులు చేపట్టినప్పుడు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అయితే వాటన్నింటినీ అధిగమించి, సమయానికి మీ పనులన్నీ పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి అంగారకుడు మూడో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో కర్కాటక రాశి వారికి ధైర్యం, శ్రమ కచ్చితంగా పెరుగుతాయి. అంతే కాకుండా గొప్ప వ్యక్తుల ప్రోత్సాహంతో మీరు తప్పకుండా విజయం సాధించగలరు. ఈ సమయంలో వ్యాపారులకు ఆదాయ పరంగా మెరుగ్గా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలంటే.. మీరు మంచి ప్లాన్ ను రూపొందించుకోవాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి అంగారకుడు పదకొండో స్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. ఈ సమయంలో అంగారకుడి సంచారం వల్ల మీకు అనేక చోట్ల నుండి మంచి ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులు తమ కెరీర్లో మంచి పురోగతిని సాధిస్తారు. కొందరు విదేశీ వనరుల నుండి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీరు ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవుతుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి అంగారకుడు పదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీరు పని ప్రదేశంలో మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాదు.. మీ కలలన్నీ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగులు ఉద్యోగం మార్పు కోసం చూస్తుంటే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేపట్టిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు.



Click it and Unblock the Notifications