For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మే డే 2020 : కార్మిక దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు...

|

యావత్ ప్రపంచం మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఈ కార్మికుల పండుగను ఏ ఒక్క దేశానికో.. లేదా ఏ ఒక్క సంఘటనకో పరిమితం చేసే పరిస్థితి లేదు.

పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేక కార్మిక వర్గం నినదించిన రోజు మే డే. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మహాకవి శ్రీశ్రీ అన్నాడు. మన సమాజ గతిని... పురోగతిని శాసించేది.. నిర్దేశించేది శ్రామిక వర్గం. ఆ శ్రమే వెట్టిచాకిరికి గురైనప్పుడు ఏమౌతుంది. శ్రామికుడు దోపిడీకి గురైనప్పుడు ఏం జరుగుతుంది. కష్టించి పని చేసే చేతులు పిడికిళ్లు బిగిస్తాయి.. భూకంపాలను తీసుకొస్తాయి..ఉద్యమాలు పుట్టుకొస్తాయి.

ఈ మే డే కార్మికులు సాధించిన విజయానికి నిలువెత్తు నిదర్శనం. అయితే ఈ ఉద్యమం మొట్టమొదటి అగ్రరాజ్యం అయిన అమెరికాలోని షికాగోలోని హే మార్కెట్ లో 1886వ సంవత్సరంలో కార్మికుల హక్కుల కోసం మొదలై అంచెలంచెలుగా అన్ని దేశాలకు వ్యాపించింది.

అలా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఉద్యమ ఫలితంగానే ప్రతి సంవత్సరం మే 1వ తేదీన కార్మిక దినోత్సవం పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా మే డే ప్రాముఖ్యతతో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

8 గంటల పని...

8 గంటల పని...

అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా కార్మికులందరూ రోజుకు 12 నుండి 15 గంటల వరకు పని చేయాల్సి ఉండేది. అయితే తొలిసారి 1886లో అమెరికాలోని షికాగోలో కార్మికులు దీన్ని వ్యతిరేకిస్తూ 8 గంటల పని విధానం కోసం భారీ ప్రదర్శన చేపట్టారు. అప్పుడే ఈ మే డే ఉద్యమానికి పునాది పడిందని చెప్పొచ్చు.

పోలీసుల కాల్పుల్లో..

పోలీసుల కాల్పుల్లో..

నెత్తుటి ధారలు కారుతున్నా.. ఫిరంగులు మోగుతున్నా.. గుండెల్లోకి తూటాలు దూసుకెళ్తున్నా.. ఎత్తిన జెండా దించకుండా పోరాడిన రోజే మే డే. అప్పుడే అమెరికాలోని హే మార్కెట్ లో కార్మికులు ఎనిమిది గంటల పని విధానం కోసం జరుపుతున్న పోరాటం కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్కడ పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత 1889-90 మధ్య అనేక దేశాల్లో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

యూరోపియన్ దేశాల్లోనూ...

యూరోపియన్ దేశాల్లోనూ...

ఈ క్రమంలోనే యూరోపియన్ దేశాలతో పాటు యుకెలో భారీ కార్మిక ప్రదర్శనలు జరిగాయి. వారంతా ముక్త కంఠంతో తమకు ఎనిమిది గంటల పని విధానాన్ని కల్పించాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే షికాగోలో చనిపోయిన కార్మికులకు గుర్తుగా మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా మరియు 8 గంటల పని విధానానికి అన్ని ప్రభుత్వాలు అంగీకరించాయి.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో..

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో..

అయితే అప్పటికీ యూరపోయిన్ దేశాల్లో కొన్ని ప్రభుత్వాలు 8 గంటల పని విధానం ఒప్పందానికి తూట్లు పొడుస్తుండటంతో సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలు, ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. అలా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కూడా మే డే రోజు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు కూడా చేపట్టేవారు. ఆ తర్వాత నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు.

మార్క్స్ మ్యానిఫెస్టో ప్రభావం..

మార్క్స్ మ్యానిఫెస్టో ప్రభావం..

కార్ల్ మార్క్స్ (జర్మన్ తత్వవేత్త, జర్నలిస్ట్, సంస్కరణవాది మరియు ఆర్థికవేత్త) రాసిన కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో పారిశ్రామిక కార్మికులపై మరియు దానికి అంకితమైన సంస్థలపై గొప్ప ప్రభావాన్ని చూపిందని చెబుతారు. 1848 వ సంవత్సరంలో పారిశ్రామిక కార్మికులు తీవ్ర దోపిడీని ఎదుర్కొంటున్నప్పుడు ఈ మ్యానిఫెస్టో రాశారు. అయినప్పటికీ, కార్మికుల డిమాండ్లు కేవలం ఒక రోజులో నెరవేరలేదు. వాస్తవానికి, దీనికి కొన్ని సంవత్సరాలు పట్టింది. నిరసన రక్తపాతం కూడా చూసింది.

సంక్షేమ పథకాలు..

సంక్షేమ పథకాలు..

ఇక కార్మిక దినోత్సవం సందర్భంగా చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు పుట్టుకొచ్చాయి. అలాగే సంక్షేమ పథకాల అమలుకు మరియు నిరసన ప్రదర్శనలకు మే 1వ తేదీ వేదికగా మారింది. చాలా దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థపై వ్యతిరేక ఉద్యమాలు కూడా ప్రారంభమయ్యాయి.

మన దేశంలో ఎప్పుడంటే..

మన దేశంలో ఎప్పుడంటే..

అయితే భారతదేశంలో చాలా ఆలస్యంగా కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నాడు. 1923 సంవత్సరంలో మే 1వ తేదీ మద్రాసులో లేబర్ కిసాన్ పార్టీ ఆధ్వర్యంలో తొలిసారి ఈ వేడుకలను జరుపుకున్నారు. అనేక ట్రేడ్ యూనియన్లు ఇదే రోజున నిరసనలు, ప్రదర్శనలు చేపడతాయి.

English summary

May Day 2020: history and why do we celebrate

May Day is observed on 1 May every year across the world. The day is also known as International Labour Day or International Workers Day. This year we are here with the history and significance of the day. Read the article to know more.
Story first published: Thursday, April 30, 2020, 16:27 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more