Latest Updates
-
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026
Meena Rasi Ugadi Rasi Phalalu 2022:'శుభకృత'ఏడాదిలో మీన రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!
2022లో ఉగాది పండుగ సందర్భంగా మీన రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని గంటల్లో వీడ్కోలు పలకబోతున్నాం. అదే సమయంలో తెలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం.

2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం.

ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, 'శుభకృతు' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా మీన రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-2, వ్యయం-8
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయం గోరంత ఉంటే.. ఖర్చులు మాత్రం కొండంత ఉంటాయి. కాబట్టి మీరు డబ్బు విషయంలో ఈ ఏడాది కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1,2,3,4 నాలుగు పాదాలు, రేవతి నక్షత్రం 1, 2,3,4 నాలుగు పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలుంటాయి.

రాజపూజ్యం-1, అవమానం-7
ఈ ‘శుభకృత్' నామ సంవత్సరంలో ఈ రాశి వారికి సమాజంలో గౌరవం కంటే అవమనాలే ఎక్కువగా ఎదురవుతాయి. అయితే గురు గ్రహం ప్రభావం వల్ల తెలుగు నూతన సంవత్సరంలో శుభప్రదమైన ఫలితాలొస్తాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు సువర్ణావకాశాలు వస్తాయి. మీరు కుటుంబ గౌరవాన్ని పొందుతారు.

శని ప్రభావంతో..
ఈ రాశి వారిలో శని గ్రహం ప్రభావం వల్ల ఆర్థిక పరంగా ఊహించిన ఫలితాలొస్తాయి. మీరు కోరుకున్నంత ధనం మీకు లభిస్తుంది. ఆరోగ్య పరంగా సానుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. మీరు భూ సంబంధిత ఆస్తులను సంపాదిస్తారు. ఇదిలా ఉండగా.. 18 జనవరి 2023 నుండి మీన రాశి వారికి ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఈ సమయం నుండి మీకు వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయి. మీ నిర్ణయాల వల్ల మీరు ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు.

రాహువు ప్రభావం వల్ల..
ఈ సంవత్సరం రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్ర గ్రహాలు తమ స్థానాలను మారడం వల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మాంసం, చేపల వ్యాపారం చేసే వారికి ఊహించిన లాభాలు రావొచ్చు. మరోవైపు కొత్తగా పెళ్లి చేసుకున్న వారు తమ వివాహ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత డబ్బు సంపాదించినా.. చాలా వేగంగా ఖర్చు చేస్తుంటారు. మీ ఆలోచనా విధానం వల్ల కూడా నష్టపోతారు.

కేతు ప్రభావం వల్ల..
ఈ రాశి వారికి ఈ ఏడాది కేతు ప్రభావం వల్ల శారీరక పరంగా కొంత ఇబ్బంది కలుగుతుంది. మీకు గురువులు, స్నేహితులు, సొంత మనుషుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులపై మీకు మోజు పెరుగుతుంది. ఈ రాశి గురువు ప్రభావం వల్ల, శని దశ ప్రారంభమయ్యేంత వరకు మంచి ఫలితాలను పొందుతారు. ఆ తర్వాత మీకు ప్రతికూల ఫలితాలు రావొచ్చు.

పరిహారాలివే..
మకర రాశి వారికి ఈ ఏడాది ఏలి నాటి శని దశ కొనసాగుతోంది కాబట్టి.. పరిహారం కోసం తమిళనాడులోని తిరునల్వార్ వెళ్లి శనీశ్వరుని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి లేదా మహారాష్ట్రలోని శనిసింగ్నాపురానికి వెళ్లి అభిషేకం నిర్వహించాలి. అదే విధంగా శ్రీకాళహస్తిలో రాహు, కేతు పూజలు జరిపించాలి. అలా వెళ్లడానికి కుదరని వారు నిత్యం గణపతిని ఆరాధన చేస్తూ.. కనకదుర్గ ఆలయానికి వెళ్లి మంగళవారం, శనివారం రోజున కుంకుమ పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభప్రదమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications