Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
అయోధ్యలో సైకిల్ మెకానిక్ చాచాకు సన్మానం.... ఎందుకంటే...
ఈ సంవత్సరం ఈ అవార్డు పొందిన వారిలో ఒక సామాన్య వ్యక్తి ఉండటం విశేషం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో అతనిని ‘షరీఫ్ చాచా‘ అని ప్రేమగా పిలుస్తుంటారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మన దేశంలోని కొందరు ప్రముఖులకు.. వారు చేసిన సేవలకు గుర్తుగా వారికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. అయితే ప్రతి సంవత్సరం ఎందరో ప్రముఖులు.. వారిలో కొందరికి అవార్డులు రావడం అనేది అత్యంత సహజం. కానీ ఈ సంవత్సరం ఈ అవార్డు పొందిన వారిలో ఒక సామాన్య వ్యక్తి ఉండటం విశేషం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో అతనిని 'షరీఫ్ చాచా' అని ప్రేమగా పిలుస్తుంటారు. ఇంతకీ ఈయనకు ఎందుకు పద్మశ్రీ అవార్డు వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

ఫేమస్ అయిన షరీఫ్ చాచా..
అయోధ్యలో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో తెలియని మృతదేహాలను దహనం చేసిన ఆయన అక్కడ బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈయన పేరు రావడంతో ఈయన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు.
ఇప్పటివరకు ఆయన 25 వేల మృతదేహాలను ఖననం/దహనం చేశారు. ఈ 25 వేల మృతదేహాలలో హిందూ మరియు ముస్లిం మృతదేహాలు రెండూ ఉన్నాయి.

షరీఫ్ చాచా వ్యక్తిగతంగా ఓ సైకిల్ మెకానిక్. ఈయన ప్రతిరోజూ స్మశానవాటికను సందర్శిస్తాడు. 1992లో ఈయన కుమారుడు సుల్తాన్ పురంలో చనిపోయాడు. దీని తర్వాతే అతనికి తెలిసింది. ఆ సమయంలో రామ జన్మ భూమి వివాదం కొనసాగుతోంది. అదే సమయంలో బాబ్రీ మసీదు కూల్చి వేయబడింది. ఆ తర్వాత తన కుమారుడి సంఘటన గురించి తెలుసుకున్న ఆయన అప్పటి మృతదేహాల అంత్యక్రియలకు బాధ్యత వహించడం మొదలుపెట్టాడు. ఏ శవం కూడా రోడ్డుపై కుళ్లిపోకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాడట. అప్పటి నుండి ఇంత గొప్ప పనిని నిరంతరం చేస్తున్నారు. దీని వల్ల ఆయన చాలా సార్లు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా కూడా ఆయన ఏ మాత్రం అధైర్యపడలేదు. విరాళాల ద్వారా నిధులు సేకరించడం మొదలు పెట్టారు. అలా తన పనిని నిరంతరాయంగా కొనసాగించినట్లు... కొనసాగిస్తున్నానని షరీఫ్ చెప్పారు.
ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టేసరికి.. ఇది వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఈ షరీఫ్ చాచాకు ప్రశంసలు అందుతున్నాయి. ఈరోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉంటారా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక నెటిజన్లు అయితే తమదైన శైలిలో స్పందిస్తున్నారు.



Click it and Unblock the Notifications
