Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
‘ఆ’ విషయాల్లో పవర్ ఫుల్ గా ఉండే రాశిచక్రాలేవో తెలుసా... ఈ లిస్టులో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!
‘ఆ’ విషయాల్లో పవర్ ఫుల్ గా ఉండే రాశిచక్రాలేవో తెలుసుకుందాం.
ప్రస్తుత సమాజంలో మనం ఏ పని చేయాలన్నా మెంటల్ గా మరియు ఫిజికల్ చాలా ఫిట్ గా ఉండాలి. ఈ రెండింటిలో మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి.

ఈ రెండూ బలంగా ఉంటే ప్రపంచాన్ని చాలా సులభంగా జయించొచ్చు. అయితే ఇలా మానసికంగా మరియు శారీరకంగా బలంగా ఉండటం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే కొందరికి ఊరికే కోపం వస్తుంటుంది. మరికొందరు చిన్న విషయాలకే కళ్ల వెంట కన్నీళ్లను కారుస్తూ ఉంటారు.

ఇలాంటి మన జీవితాలపై చాలా ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంటాయి. అయితే మనం మానసికంగా పవర్ ఫుల్ గా తయారు కావాలంటే.. ప్రతిదీ మన బ్రెయిన్ బాగా అధ్యయనం చేయాలి. లోతుగా విశ్లేషించాలి. సంక్షోభాలను సవాళ్లుగా తీసుకుని.. వాటి నుండే అవకాశాలుగా మలచుకోవాలి. అలా చేస్తేనే మన జీవితాల్లో సులభంగా సక్సెస్ సాధించగలం.

ఈ నేపథ్యంలో జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, రాశిచక్రాలను బట్టి ఎవరు మానసికంగా మరియు శారీరకంగా పవర్ ఫుల్ గా ఉంటారో తెలుసుకోవచ్చట. అయితే ఇక్కడున్న రాశిచక్రాల లిస్టులో మీ రాశి లేకపోతే మీరు మానసికంగా స్ట్రాంగ్ లేరని అర్థం కాదు. కష్టపడితే ఎవరైనా పవర్ ఫుల్ తయారు కావొచ్చని గుర్తుంచుకోండి. ఇక అసలు విషయానికొస్తే.. ఏ రాశుల వారు ఫిజికల్ గా మరియు మెంటల్ గా స్ట్రాంగో ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభరాశి..
ఈ రాశి వారు అన్ని రాశుల వారి కంటే మానసికంగా చాలా బలంగా ఉంటారు. వీళ్లు ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఏ మాత్రం తొత్తురుపాటు పడకుండా స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరు మూఢనమ్మకాల జోలికి వెళ్లకుండా, శాస్త్రీయతతో ఆలోచించి సరైన నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యంగా వీరు ఏదైనా గోల్ పెట్టుకున్నారంటే.. అది సాధించే వరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎంత కష్టమొచ్చినా అస్సలు వెనుకడుగు వేయరు. ఏదైనా పోటీలో వీరికే వీరే సాటి. వీళ్లను మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది అంత సులభమైన విషయం కాదు. అయితే వీరు ఒక్కసారి మానసికంగా డిస్టర్బ్ అయితే.. వారి పరిస్థితి దారుణంగానే ఉంటుందని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు.

మిధున రాశి..
ఈ రాశి వారు అన్ని రాశుల కంటే భిన్నంగా ఉంటారు. వీరి రూటే సపరేటు. నలుగురిలో వీరు ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. అందుకే వీరి ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది. ఈ రాశి వారిలో రెండు రకాల వారు కూడా ఉంటారు. ఉదాహరణకు అందరూ గుడ్డిగా నమ్మే విషయాలను వీరు అస్సలు నమ్మరు. అసలు అది నిజమా కాదా అనే విషయాలను అధ్యయనం చేస్తారు. లోతుగా పరిశీలిస్తారు. మరో విశేషమేమిటంటే.. వీరికి చాలా విషయాల్లో నైపుణ్యత ఉంటుంది. అందుకే వీరు ఎలాంటి బలహీనతలకు లొంగరు. మానసికంగా చాలా బలంగా ఉంటారు. ముఖ్యంగా తమ అనుభవాలతో మంచి నిర్ణయాలను తీసుకుంటారు. అందుకే వీరు అంత సులభంగా నిగ్రహం కోల్పోరు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. ప్రతి విషయంలోనూ చాలా భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సెంటిమెంట్లకు ఎక్కువగా పడిపోతారు. అయితే, మెంటల్లీ కాన్ స్టంట్ గా ఉండేందుకు, వీరు ఎక్కువ సానుకూల నిర్ణయాలను తీసుకుంటారు. వీరికి ఏ విషయమైనా లోతుగా అధ్యయనం చేసే సామర్థ్యం ఉంటుంది. అయితే వీరు తమ ఫీలింగ్స్ ను ఎక్కువగా దాచుకోలేరు. తమ భావోద్వేగాలను చాలా వేగంగా బయటపెట్టేస్తారు. ఎందుకంటే ఆ ఫీలింగ్సే మనుషులను బలంగా నిలబెడతాయని గట్టిగా నమ్ముతారు. అయితే వీరు కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గుతారు. అయితే వెనక్కి తగ్గినా కూడా పరిస్థితులను బట్టి నిర్ణయాలను తీసుకుంటారు. అందుకే వీరు పరిస్థితులను చాలా సానుకూలంగా మార్చేయగలరు.

సింహ రాశి..
ఈ రాశి వారు తమను తాము హీరోగా ఫీలవుతారు. ఎందుకంటే వీరికి మానసికంగా బలంగా ఉంటామనే విశ్వాసం ఉంటుంది. అంతేకాదు వీరు ఏదైనా విషయాన్ని మొదలుపెట్టేటప్పుడు.. తమ మానసిక సామర్థ్యంతో పాటు ఇతర వ్యక్తులను కూడా తమవైపు తిప్పుకోగల నైపుణ్యాలను కలిగి ఉంటారు. అందుకే వీరు ఎల్లప్పుడూ టాప్ పొజిషన్ ను కలిగి ఉంటారు. అందువల్ల ఏ పరిస్థితుల్లోనైనా వీళ్లు ఆ దిశగా బలమైన ప్రయత్నాలు చేస్తారు. తమ సామర్థ్యం మొత్తం ఉపయోగిస్తారు. ఏదైనా సరే ది బెస్ట్ అన్నదే వీరి మైండ్ కోరుకుంటుంది.

తుల రాశి..
ఈ రాశి వారు ప్రతి సందర్భంలో.. ప్రతి విషయంలోనూ చాలా లోతుగా ఆలోచిస్తారు.అందుకే వీరు తమను తాము స్థిరంగా ఉంచుకుంటారు. వీరికి మానసిక సామర్థ్యం ఎంత గొప్పగా ఉంటుందంటే.. ప్రతి దాన్నీ వీరు సరైన ఆర్డర్ లో పెట్టుకోగలరు. తమ చుట్టూ ఉన్న పరిస్థితులను తమకు పూర్తిగా అనుకూలంగా లేదా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, పరిస్థితులకు తగ్గట్టు వెళ్తుంటారు. అయితే వీరు పనులు చేసే సమయంలో ఏది కరెక్టో.. ఏది తప్పో అనే విషయాలను కచ్చితంగా తేల్చుకుంటారు. దీని కోసం వీరు ఎక్కువ సహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మరో విషయేమిటంటే.. వీరు అందరితోనూ చాలా సులభంగా కలిసిపోతారు. అందుకే వీరు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సులభంగా బయటపడగలరు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు మెంటల్ గా మరియు ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వీరు ఏదైనా నిర్ణయాన్ని ఒక్కసారి తీసుకున్నారంటే.. దాన్ని అస్సలు మార్చుకోరు. వీరికి మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. వీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు మరియు ఏదైనా విషయం గురించి ఒప్పందం చేసుకునేటప్పుడు ఇతరుల మనసులో ఏముందో ఇట్టే పసిగట్టేస్తారు. అందుకే వీరు ప్రతికూల పరిస్థితులలోనూ చాలా సులభంగా డీల్ చేసుకుంటారు. మొత్తానికి వీరి రూట్ లోకే అందరినీ రప్పించుకుంటారు. అలా చివరికి వీరిని మెచ్చుకునేలా పరిస్థితులను తయారు చేసుకుంటారు.



Click it and Unblock the Notifications
