Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
Budh Margi 2022:వృషభంలోకి బుధుడి సంచారం..12 రాశులపై ఎలాంటి ప్రభావం..!
2022లో జూన్ 3వ తేదీన బుధుడు నేరుగా వృషభంలోకి సంచారం చేయడం వల్ల రాశిచక్రాలపై పడే ప్రభావం, పాటించాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలలో బుధ గ్రహానికి ఎంతో విశిష్టత ఉంది. బుధుడిని గ్రహాలలో యువరాజుగా పరిగణిస్తారు. బుధుని అనుగ్రహం ఉంటే, ప్రతి ఒక్కరి తెలివితేటలు, వ్యాపారంతో పాటు మరిన్ని బాగా మెరుగవుతాయని పండితులు చెబుతుంటారు.

అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్న బుధుడు 2022లో జూన్ 3వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:29 నేరుగా వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం 2 జులై 2022న ఉదయం 9:42 గంటల వరకు మిధునరాశిలోకి రవాణా చేయనున్నాడు.

ఈ సందర్భంగా ద్వాదశ రాశిచక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది.. ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది.. ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి నుండి బుధుడు వృషభంలోకి రెండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మేష రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ఈ కాలంలో మీ ప్రసంగ నైపుణ్యాలతో ప్రతికూల పరిస్థితులను నియంత్రిస్తారు. కోర్టుకు సంబంధించిన కేసులలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏవైనా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటున్నప్పుడు నిబంధనలు మరియు షరతులను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. మరోవైపు కొందరు వ్యక్తులు మీ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే మీరు వాటిని అవగాహనతో నియంత్రిస్తారు.

వృషభ రాశి..
ఇదే రాశిలోకి బుధుడు నేరుగా ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. వ్యాపారుల విస్తరణ వేగంగా పెరుగుతుంది. మీరు ఈ కాలంలో కొన్ని కొత్త ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలొస్తాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి గ్రహాలు సానుకూలంగా ఉంటాయి. కొత్త దంపతులకు సంతానం గురించి శుభవార్త వినిపిస్తుంది.

మిధున రాశి..
ఈ రాశి నుండి బుధుడు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మిధున రాశి వారు ఎక్కువ ఖర్చులు చేయాల్సి రావొచ్చు. ఈ సమయంలో మీరు చేసే ప్రయాణం వల్ల ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు విదేశీ కంపెనీలలో పని చేసేందుకు లేదా పౌరసత్వం కోసం ప్రయత్నాలు చేయాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి బుధుడు 11వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. సీనియర్ కుటుంబ సభ్యులు మరియు సోదరుల నుండి మద్దతు లభిస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందులోనూ విజయం సాధిస్తారు. మీరు అన్ని విధాలుగా విజయం సాధిస్తారు.

సింహ రాశి..
ఈ రాశి నుండి బుధుడు 10వ స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో సింహ రాశి వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. మీరు చేసే పనిలో పురోగతి ఉంటుంది. మీ వ్యాపారం మరియు సామాజిక స్థితి కూడా పెరుగుతుంది. మీ పనులన్నీ చక్కని బాధ్యతతో నెరవేరుస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి నుండి బుధుడు 9వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు క్లిష్ట పరిస్థితులను సులభంగా కంట్రోల్ చేస్తారు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజా సంఘాల్లో ప్రశంసనీయంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తమ్ముళ్లతో విభేదాలు పెరగనివ్వొద్దు.

తుల రాశి..
ఈ రాశి నుండి బుధుడు 8వ పాదం గుండా ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ పనిలో అడ్డంకులు ఉండొచ్చు. అయితే మీరు ఒత్తిడి పెంచుకోవద్దు. మీరు వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలుంటే, జాగ్రత్తగా ఉండాలి. చర్మ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి బుధుడు 7వ పాదం గుండా ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో వ్యాపారులకు పురోగతి లభిస్తుంది. మీరు కొత్త ఒప్పందంపై సంతకం చేయాలనుకుంటే, సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఎదురుచూసిన పని పూర్తవుతుంది. మీరు ఏదైనా టెండర్ కోసం దరఖాస్తు చేసుకుంటే, విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోటీలో పాల్గొనే విద్యార్థులకు సమయం కూడా అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి బుధుడు 6వ స్థానం గుండా ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో మీకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. మీకు రహస్య శత్రువులు అధికంగా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఒక్క అవకాశాన్ని కూడా వదలిపెట్టరు. మీరు వివాదాలు మరియు కోర్టు కేసులకు సంబంధించిన విషయాలను తమలో తాము పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మంచిగా ఉండాలి.

మకర రాశి..
ఈ రాశి నుండి బుధుడు 5వ స్థానం గుండా రవాణా చేయనున్నాడు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే మంచి ఫలితాలు రావొచ్చు. మరోవైపు వ్యాపారులు ఈ సమయంలో ఏదైనా ఒప్పందంపై సంతకం చేయాల్సి వస్తే, అనుకూలంగా ఉంటుంది. ప్రేమకు సంబంధించి విషయాల్లో మంచిగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి సానుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి..
ఈ రాశి నుండి బుధుడు 4వ పాదం గుండా సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు ఊహించని ఫలితాలను పొందుతారు. మీరు ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, గ్రహ రవాణా అనుకూలంగా ఉంటుంది. మిత్రులు, బంధువుల నుండి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎదురుచూస్తున్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు విజయవంతమవుతారు.

మీన రాశి..
ఈ రాశి నుండి బుధుడు మూడో పాదం గుండా ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో మీకు కొత్త శక్తిని పొందొచ్చు. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ధార్మిక పనుల్లో చాలా చరుగ్గా ఉంటారు. మీరు దానధర్మాలు కూడా చేయొచ్చు. మీరు విదేశీ కంపెనీలలో సేవా మరియు పౌరసత్వం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, గ్రహ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
బుధుని అనుగ్రహం ఉంటే, ప్రతి ఒక్కరి తెలివితేటలు, వ్యాపారంతో పాటు మరిన్ని బాగా మెరుగవుతాయని పండితులు చెబుతుంటారు. అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్న బుధుడు 2022లో జూన్ 3వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:29 నేరుగా వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం 2 జులై 2022న ఉదయం 9:42 గంటల వరకు మిధునరాశిలోకి రవాణా చేయనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశిచక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.



Click it and Unblock the Notifications











