Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
Budh Uday 2023: ధనుస్సు రాశిలో బుధుడు ఉదయించడం వల్ల ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు
జనవరి 2వ తేదీన ధనుస్సు రాశిలో అస్తమించిన బుధుడు తిరిగి.. జనవరి 13వ తేదీన ధనుస్సు రాశిలో ఉదయించనున్నాడు.
తెలివితేటలకు, విద్యకు, వ్యాపారానికి, సమాచార మార్పిడికి బుధుడు కారకుడు. బుధ గ్రహాన్ని నవగ్రహాలకు యువరాజులా పరిగణిస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో బుధుడు మిథునరాశి, కన్యరాశికి అధిపతి. జనవరి 2వ తేదీన ధనుస్సు రాశిలో అస్తమించిన బుధుడు తిరిగి.. జనవరి 13వ తేదీన ధనుస్సు రాశిలో ఉదయించనున్నాడు.

ధనుస్సు రాశిలో బుధుడు ఉదయించే సమయం:
జనవరి 13, 2023 ఉదయం 5.15 గంటలకు ధనుస్సు రాశిలో బుధుడు ఉదయిస్తాడు. దీని వల్ల ఏయే రాశుల వారికి కలిసి రానుంది, ఏయే రాశుల వారికి కష్టాలు మొదలు కానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
మేషరాశి యొక్క 3, 6వ ఇళ్లను బుధుడు పాలిస్తాడు. 9వ ఇంట్లో ఉదయించనున్నాడు. బుధుడి ఉదయం వల్ల రాజకీయ నాయకులు, రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు వారి మాటల ద్వారా వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. ధనుస్సులో బుధుడు ఉదయించే సమయంలో ఆ వివాదం నుండి బయటపడతారు.

వృషభరాశి:
బుధుడు వృషభరాశి వారి 2, 5వ ఇళ్లను పాలిస్తాడు. 8వ ఇంట్లో బుధుడు ఉదయించనున్నాడు. ధనుస్సులో బుధుడు ఉదయించడం వల్ల వృషభ రాశి వారికి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సేవింగ్స్‌తో రిస్క్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. అత్తమామలతో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

మిథునరాశి:
బుధుడు మిథునరాశి వారి 4వ ఇంటికి అధిపతి. 7వ ఇంట్లో బుధుడు ఉదయించనున్నాడు. ధనుస్సు రాశిలో బుధుడు ఉదయించడం మిథున రాశి వారికి కలిసిరానుంది. కుటుంబ సమస్యలు, వైవాహిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపార భాగస్వామితో నెలకొన్న సమస్యలూ పోతాయి. ఈ సమయంలో మిథునరాశి వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది.

కర్కాటకరాశి:
బుధుడు 12వ, 13వ ఇళ్లకు అధిపతి. 6వ ఇంట్లో బుధుడు ఉదయించనున్నాడు. ధనుస్సు రాశిలో బుధుడు ఉదయమించడం వల్ల కర్కాటక రాశి వారు సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. అనారోగ్యానికి ఆకస్మిక ఖర్చు చేయవచ్చు.

సింహరాశి:
సింహరాశి వారికి ఆర్థిక గృహం 2వ, 11వ స్థానంలో బుధుడు పాలిస్తాడు. బుధుడు ఉదయం సింహ రాశి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. సింహరాశి వారి 5వ ఇంట్లో ధనుస్సు రాశిలో బుధుడు ఉదయించనున్నాడు. జూదం, షేర్ మార్కెట్ లాంటి వాటి నుండి డబ్బు సంపాదించవచ్చు. 5వ ఇంట్లో ధనుస్సు రాశిలో బుధుడు ఉదయించడం సింహరాశి విద్యార్థులకు కలిసిరానుంది.

కన్యరాశి:
కన్యరాశి 4వ ఇంట్లో బుధుడు ఉదయించనున్నాడు. బుధుడు ఉదయించడం వల్ల కన్యరాశి వారి ఆరోగ్యం మెరుగుపడనుంది. వృత్తి జీవితంలో ఎదురైనా సమస్యలు తొలగిపోతాయి. కుటుంబసభ్యులతో గడపడానికి సమయం దొరుకుతుంది. 10వ ఇంట్లో బుధుడు వృత్తి జీవితంలో కూడా మంచి అవకాశాలను అందిస్తాడు.

తులారాశి:
బుధుడు 12వ, 9వ ఇళ్లకు అధిపతి. 3వ ఇంట్లో ఉదయించనున్నాడు. 3వ ఇల్లు తోబుట్టువులు, అభిరుచులు, తక్కువ దూర ప్రయాణాలు, తులా రాశి వారికి కమ్యూనికేషన్ నైపుణ్యాలను సూచిస్తుంది. తోబుట్టువులతో విభేదాలు, ఆర్థిక వ్యయం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి జీవితంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఇది మంచి సమయం.

వృశ్చిక రాశి:
బుధుడు 11వ, 8వ ఇంటిని పాలిస్తాడు. 2వ ఇంట్లో బుధుడు ఉదయించనున్నాడు. ధనుస్సు రాశిలో బుధుడు ఉదయించడం వల్ల వృశ్చిక రాశి వారు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. డబ్బు సంపాదిస్తారు. పొదుపు పెరుగుతుంది. భాగస్వామితో ఉమ్మడి ఆస్తులు కూడా పెరుగుతాయి. జీవిత భాగస్వామితో బంధంలో బలోపేతం అవుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. చెడు ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండడం ముఖ్యం.

ధనుస్సు రాశి:
7వ, 10వ గృహాలకు బుధుడు అధిపతి. బుధుడు ఉదయించడం వల్ల ధనుస్సు రాశి వారికి కలిసి రానుంది. బుధుడు ఉదయించడం, పయనం వల్ల ధనుస్సు రాశి వారికి మంచి జరుగుతుంది. ధనుస్సు రాశి యొక్క 1వ ఇంట్లో బుధుడు ఉండటం వారి వ్యక్తిత్వం, వృత్తి జీవితంలో సానుకూల ఫలితాలను తెస్తుంది. డేటా సైంటిస్టులు, బ్యాంకింగ్, మెడికల్ ఫీల్డ్, వ్యాపారులకు ఈ సమయం కలిసిరానుంది. భార్యభర్తల మధ్య బంధం బలోపేతం అవుతుంది.

మకరరాశి:
బుధుడు 6వ, 9వ గృహాలకు అధిపతి, ఇప్పుడు 12వ ఇంట్లో ఉదయించనున్నాడు. బుధుడు ఉదయించడం వల్ల మకర రాశికి అదృష్టం కలిసిరానుంది. మకర రాశి వారు ఎదుర్కొంటున్న పలు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. 12వ ఇంట బుధుడు 9వ స్థానానికి అధిపతిగా ఉండటం వల్ల విదేశీ విద్యను కోరుకునే విద్యార్థులు తాము కోరుకున్న కళాశాలలో చేరే అవకాశం ఉంది.

కుంభరాశి:
బుధగ్రహం 5వ, 8వ గృహాలకు అధిపతి. కుంభ రాశి వారికి 11వ ఇంట్లో బుధుడు ఉదయించనున్నాడు. 11వ ఇల్లు ఆర్థిక లాభాలు, కోరిక, పెద్ద తోబుట్టువులు, మామలకు సూచన. బుధుడు ఉదయించడం వల్ల కుంభరాశి వారికి కలిసి రానుంది. ఆర్థిక లాభాలు చేకూరనున్నాయి. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ ప్రారంభించనున్న ప్రెషర్లకు ఇది మంచి సమయం.

మీనరాశి:
బుధుడు 4వ, 7వ గృహాలకు అధిపతి. 10వ ఇంట్లో బుధుడు ఉదయించనున్నాడు. ఇది బుధుడికి చాలా సౌకర్యవంతమైన స్థానం. ఈ సమయంలో వృత్తిపరమైన జీవితానికి చాలా ఫలవంతంగా ఉంటుంది. మీనరాశి వారికి కీర్తి, హోదా దక్కనున్నాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో వారి బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
(Disclaimer: పైన ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది మరియు విశ్వసనీయతకు హామీ లేదు. తెలుగు బోల్డ్ స్కై కథనానికి సంబంధించిన సమాచారాన్ని ధృవీకరించలేదు. మా ఏకైక ఉద్దేశం సమాచారాన్ని అందించడమే. ఏదైనా సమాచారం లేదా ఊహను సాధన చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు, దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.)



Click it and Unblock the Notifications