Latest Updates
-
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.? -
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా..
Mercury Transit in Libra on 22 September 2021:తులరాశిలో బుధుడి సంచారం.. ఈ రాశులకు ప్రయోజనం...!
2021 సంవత్సరంలో సెప్టెంబర్ 22న తులరాశిలోకి బుధుడు సంచారం చేసే సమయంలో ఈ రాశుల వారికి అనుకూలం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో బుధ గ్రహానికి ప్రత్యేక స్థానముంది. ఈ గ్రహాన్ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

బుధుడి అనుగ్రహం ఉన్న వారికి మేధస్సు, శక్తి సామర్థ్యాలు ఎక్కువగా లభిస్తాయని పండితులు చెబుతారు. అలాంటి బుధుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ప్రభావం రాశిచక్రాల వారి తెలివితేటలు, జ్ణానంపై కచ్చితంగా ప్రభావం పడుతుందట.

ఈ నేపథ్యంలో 2021 సంవత్సరంలో సెప్టెంబర్ 22వ తేదీన బుధుడు కన్య రాశి నుండి తులరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ రాశిలో ఇది వరకే శుక్రుడు నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు బుధుడు కూడా ఇక్కడకు చేరుకోవడం వల్ల శుక్రుడు, బుధుడి కలయిక ఈ రాశిలో జరగనుంది. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారిలో కొన్ని రాశుల వారిపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రాశుల వారికి తమ వ్యక్తిగత జీవితంలో సానుకూల ప్రభావాలు కలగనున్నాయట. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసేయ్యండి...

మేష రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఏడో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా వ్యాపారులకు అద్భుతమైన ప్రయోజనాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగులకు కూడా వారి కెరీర్లో ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ కాలంలో మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీరు కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంటుంది. మీకు కొత్త బాధ్యతలు రావొచ్చు. మీరు కొత్త స్కిల్స్ ను సైతం నేర్చుకుంటారు.

మిధున రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఐదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మిధున రాశి వారికి ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు ఈ కాలంలో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తారు. అంతేకాదు వాటిని ఆచరణలో పెట్టి సక్సెస్ కూడా సాధిస్తారు. ఉద్యోగులు ఆఫీసులో తమ సీనియర్ ఆఫీసర్ల నుండి పనికి సంబంధించి ప్రశంసలను అందుకుంటారు. ఈ కాలంలో మీకు గౌరవం, మర్యాదలు లభిస్తాయి.

కన్య రాశి..
ఈ రాశి నుండి బుధుడు రెండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మరోవైపు కుటుంబ సభ్యులతో వ్యాపారం చేస్తున్న వారికి లాభాలొచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాజకీయ, మీడియా సంబంధిత రంగాల్లో ఉండే వారికి ఈ కాలంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఊహించిన విధంగా లాభాలను పొందుతారు.

తుల రాశి..
ఈ రాశిలోకే బుధుడు ఆగమనం చేయడం వల్ల ఈ రాశి వారికి శుభ ప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగులు ఊహించిన విధంగా ఫలితాలొస్తాయి. మీరు పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు. మరోవైపు వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఇంకోవైపు ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఈ రాశి వారికి శుభవార్తలు వినిపిస్తాయి. మీ నైపుణ్యం, జ్ణాపకశక్తిని చూసి చాలా మంది మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఈ సమయంలో మీరు ఏ వ్యాపారం చేసినా అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి బుధుడు పదకొండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి అన్నింటా విజయం దక్కుతుంది. మీరు అకస్మాత్తుగా మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగులకు ఆఫీసులో ఊహించిన ప్రమోషన్లు రావొచ్చు. లేదా మీ జీతం భారీగా పెరగొచ్చు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ కు కూడా ముందడుగు పడుతుంది. మీ వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.

మకర రాశి..
ఈ రాశి నుండి బుధుడు పన్నెండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ఉద్యోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఆఫీసులో కొలీగ్స్ మరియు సీనియర్ అధికారుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఈ కాలంలో మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరంగా వారి సహాయం మీకు లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు చాలా మంచిగా ఉంటుంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.



Click it and Unblock the Notifications