Mercury Transit in Pisces 2021 : మీనంలోకి బుధుడి ఎంట్రీ.. ఈ రాశుల వారిపై శత్రువుల ఆధిపత్యం...!

బుధుడు మీన రాశిలోకి ప్రవేశిస్తే.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రహం మార్చి 11న మహాశివరాత్రి నాడు కుంభరాశిలోకి ప్రవేశించిన సంగతి మనందరికీ తెలిసిందే.

Mercury Transit in Pisces on 01 April 2021 Effects on Zodiac Signs in Telugu

అయితే ఈ రాశి నుండి నిష్క్రమించి.. 2021 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 12 గంటలకు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక్కడే సుమారు 15 రోజుల పాటు సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై కొంత ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది...

Mercury Transit in Pisces on 01 April 2021 Effects on Zodiac Signs in Telugu
ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది. అన్ని రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
మేషరాశి..

మేషరాశి..

బుధుడు కుంభ రాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి కొన్ని హెచ్చుతగ్గుల పరిస్థితులు ఎదురవుతాయి. ఈ కాలంలో మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తారు. ఈ సమయం ప్రయాణానికి ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. మరోవైపు విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : ఈ కాలంలో మీ ఇంట్లో కర్పూరం వెలిగిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి బుధుడి రవాణా శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో మీ ఇంట్లో ఒక శుభకార్యాన్ని నిర్వహించొచ్చు. ఒంటరిగా ఉండే వారికి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. ఈ సమయం వివాహితులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులు కూడా సానుకూల ఫలితాలను పొందుతారు.

పరిహారం : శుభ ఫలితాల కోసం బుధవారం రోజున గణేశుడిని ఆరాధించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

బుధుడు కుంభం నుండి మీనంలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ పనిలో మీరు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆస్తి కొనుగోలు వంటివి చేయడంలో జాగ్రత్త వహించాలి. ఈ సమయంలో మీరు కుటుంబంతో మంచి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది.

పరిహారం : ఉత్తమ ఫలితాల కోసం బుధవారం రోజున సరస్వతీ దేవిని ఆరాధించాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి బుధుడి రవాణా వల్ల హెచ్చుతగ్గుల పరిస్థితి ఉంటుంది. ఈ కాలంలో మీరు ఎక్కువగా ప్రయాణించకూడదు. ఈ సమయంలో మీ డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. ఉన్నతాధికారులు మీ పనిలో తప్పులు చేయొచ్చు. మీరు విజయం సాధించడానికి ఎక్కువగా కష్టపడాలి. మీరు మీ లక్ష్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

పరిహారం : ప్రతి బుధవారం ఆవులకు పచ్చని గడ్డిని పశుగ్రాసంగా వేయాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు బుధుడి రవాణా సమయంలో మిశ్రమ ఫలితాలను పొందొచ్చు. వ్యాపారులు పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండే అవకాశం ఉంది. వివాహితులు ఈ కాలంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు. మరోవైపు మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

పరిహారం : నిరుపేదలకు స్టేషనరీని దానం చేయాలి.

కన్య రాశి..

కన్య రాశి..

బుధుడు మీనరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారిపై సానుకూల ప్రభావం పడుతుంది. మీరు పని రంగంలో మంచి ఫలితాలను పొందుతారు. మీ కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు. ఉన్నతాధికారుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలలో కొంత దూరం పెరగొచ్చు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : బుధవారం రోజున మీ కుడి చేతి చిటికిన వేలికి వెండి లేదా బంగారంతో రూపొందించిన నాణ్యమైన ఉంగరాన్ని ధరించండి.

తుల రాశి..

తుల రాశి..

బుధుడు మీన రాశిలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు పని చేసే చోట మరింత కష్టపడాల్సి ఉంటుంది. దీని వల్ల మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ వ్యక్తిగత విషయాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోకండి. శత్రువులు మీపై ఆధిపత్యం చేసే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఈ సమయంలో మీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి.

పరిహారం : ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లడానికి ముందు యాలకులను వేసుకోండి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

మీనంలోకి బుధుడి రవాణా సమయంలో ఈ రాశి వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఉన్నత విద్య గురించి శుభవార్తలు వినిపిస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. మీరు మీ పాత స్నేహితుడిని కలుస్తారు.

పరిహారం : బుధుడి రవాణా సమయంలో తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీటిని అర్పించి, ఆరాధించండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

బుధుడు మీన రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారిలో పని రంగంలో మంచి ఫలితాలను పొందుతారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. తేలికపాటి వ్యాయామం చేయాలి.

పరిహారం : మీ కుడి చేతి ఉంగరపు వేలికి వెండితో చేసిన నాణ్యమైన ఉంగరాన్ని ధరించండి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు పెద్దల సలహాలను పాటించాలి. సహోద్యోగుల మద్దతు తీసుకోవడం కూడా మంచిది. దీని వల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ తోబుట్టువులతో తగినంత సమయం గడపండి.

పరిహారం : బుధుడి రవాణా సమయంలో ప్రతిరోజూ బుధ మంత్రాన్ని జపించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

బుధుడి మీనంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు డబ్బును ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. మీ పూర్వీకుల ఆస్తి కూడా మీకు వస్తుంది. స్టాక్ మార్కెట్ ప్రజలు కూడా లాభం పొందుతారు. కళా రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి ఫలితాలను పొందుతారు. మీ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కారణంగా మీరు ఆందోళన చెందుతారు. ఈ సమయం విద్యార్థులకు మంచిగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' మంత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు వస్తాయి.

మీన రాశి..

మీన రాశి..

బుధుడు కుంభ రాశి నుండి ఇదే రాశిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి.. ఈ రాశిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ సమయం ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయం వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కూడా కెరీర్లో మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో కొంత ఉద్రిక్తత ఉండొచ్చు. అయితే మీరు మీ సమస్యకు పరిష్కారం కనుగొంటారు.

పరిహారం : బుధవారం రోజున ‘విష్ణు సహస్రానం' వింటే మంచి ఫలితాలొస్తాయి.

Desktop Bottom Promotion