Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
ఈ 5 రాశుల వారికి సెంటిమెంట్ చాలా ఎక్కువ.. చిన్న విషయానికే ఏడ్చేస్తారట...!
ఈ రాశుల వారికి అత్యంత ఎక్కువగా భావోద్వేగం ఉంటుందట. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.
మనలో కొందరు వ్యక్తులు కొన్ని విషయాలను చాలా లైట్ గా తీసుకుంటారు. మరికొంతమది ప్రతి ఒక్క చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు.

అంతేకాదు అన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తారు. ఇలాంటి వ్యక్తులు వారి భావోద్వేగాలపై ఆధారపడి ఉంటారు. వీరు ఇతరుల నుండి కూడా అదే రకమైన భావాలను ఆశిస్తారు. ఎందుకంటే వీరు చాలా విషయాల్లో సున్నితంగా ఉంటారు.

ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులపై కోప్పడాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే వీరు అత్యంత సున్నితంగా ఉంటారు. అంతేకాదు వీరికి భావోద్వేగం కూడా చాలా ఎక్కువే.

అయితే ఇలాంటి వ్యక్తులను గుర్తించడం కొంత కష్టమే. అయితే జ్యోతిష్యశాస్త్రం సహాయంతో ఇలాంటి వ్యక్తులను మనం గుర్తు పట్టొచ్చు. ముఖ్యంగా ద్వాదశ రాశులలోని ఈ రాశుల వ్యక్తులు అత్యంత ఎక్కువ భావోద్వేగాన్ని కలిగి ఉంటారు. ఈ సందర్భంగా ఈ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
ఈ రాశి వారు బయటకు కఠినంగా కనిపించినప్పటికీ.. వీరు చాలా సున్నితమైన మరియు భావోద్వేగాన్ని కలిగి ఉంటారు. వీరు ఏదైనా తీవ్రమైన వాదనలకు త్వరగా స్పందిస్తారు. కొన్ని సందర్భాల్లో వీరు మొండిగా ప్రవర్తిస్తారు. వీరు తమ భావోద్వేగాలను వ్యక్తం చేసేందుకు లేదా ఏడుపు వచ్చినప్పుడు ఎవ్వరూ లేని ఉండే ప్రదేశానికి వెళ్తారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వ్యక్తులకు సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు తమ కంటే ఇతరుల పట్ల శ్రద్ధ వహించడానికి ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఎలాంటి విషయాలకైనా సులభంగా కరిగిపోయే లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ప్రేమ వంటి విషయాల్లో కూడా చాలా త్వరగా పడిపోతారు. తాము ప్రేమించే వ్యక్తితో అత్యంత తక్కువ సమయంలోనే బాగా కలిసిపోతారు. అయితే ఈ రాశి వారికి తమ భాగస్వామితో ఏదైనా గొడవలు వస్తే మాత్రం వెంటనే విడిపోతారు.

సింహ రాశి..
ఈ రాశి వారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, వీరు లోపల చాలా సున్నితంగా ఉంటారు. వీరు ప్రేమ విషయంలో ఏదైనా ప్రతికూల విషయం తెలిస్తే అస్సలు భరించలేరు. అలాగే అబద్ధాలు చెప్పినా అస్సలు తట్టుకోలేరు. వీరు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉండాలని భావిస్తారు. వీరు పెంపుడు జంతువులను చాలా ఎక్కువగా ఇష్టపడతారు. వీరిని ఎవరైనా కేరింగ్ గా చూసుకుంటున్నారని భావిస్తే చాలు, వారితో వెంటనే ప్రేమలో పడిపోతారు. అయితే వీరు తమ ప్రేమను కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి వారు ఎల్లప్పుడూ ఎక్కువ సానుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. అందుకే వీరు ఎక్కువ కాలం సంతోషంగా, శక్తివంతంగా ఉంటారు. అయితే వీరు కూడా చాలా త్వరగా ప్రేమలో పడిపోతారు. తమ భాగస్వామిని కనుగొన్నప్పుడు తమ భావాలను నిజాయితీగా మరియు ఓపెన్ గా వ్యక్తం చెప్పేస్తారు. ఈ రాశి వారికి ప్రేమలో దెబ్బ తగిలితే.. ఆ గాయం నుండి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.

మీన రాశి..
ఈ రాశి వారు భూమి మీదే అత్యంత సున్నితమైన వ్యక్తులు. వీరు భావోద్వేగాలకు చాలా ఎక్కువ విలువ ఇస్తారు. వీరిని అవమానించడం లేదా బాధపెట్టడాన్ని భరించలేరు. చిన్నపాటి విషయాలకే కన్నీళ్లు పెట్టుకుంటారు. వీరు ఏడుపు మొదలు పెడితే ఆపడం చాలా కష్టమే.



Click it and Unblock the Notifications
