Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
మావోయిస్టు ప్రాంతం నుంచి తొలి మహిళా పైలట్..
ఏడు సంవత్సరాల పాటు కష్టపడి ఇటీవలే ఓ ప్రయివేట్ విమానయాన సంస్థలో కో పైలట్ గా అనుప్రియ ఛాన్స్ కొట్టేసింది.
ఇండియన్ ఏవియేషన్ లో పైలట్ గా కొలువు సాధించడం అంత సులభమైన విషయం కాదు. ఎన్నో కఠిన సవాళ్లను, అనేక పరీక్షలను ఎదుర్కోవాలి. అన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే పైలట్ గా మనకు కొలువు ఖాయమవుతుంది. అంత కఠినమైన సవాళ్లను, అనేక టెస్టులను అవలీలగా అధిగమించింది ఆదివాసి మహిళ. కేవలం 23 ఏళ్లకే కమర్షియల్ పైలట్ గా కొలువు కొట్టేసింది. ఇంతకీ ఆ మహిళ ఎవరో తెలుసా ఆమె పేరేంటో తెలుసా.. ఆమెనే ఆదివాసి అనుప్రియ లక్రా.
ఒడిశా రాష్ట్రంలోని మావోయిస్టు ప్రాంతమైన మల్కాన్ గిరి జిల్లాకు చెందిన అనుప్రియ చిన్ననాటి నుండి కన్న కలలను అత్యంత వేగంగా నిజం చేసుకుంది. కమర్షియల్ విమానాన్ని నడిపే తొలి గిరిపుత్రికగా రికార్డు సృష్టించింది. ఆమె తండ్రి మరినియాస్ లక్రా పోలీస్ డిపార్ట్ మెంటులో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మల్కాన్ గిరిలో ని దీప్తి కాన్వెంట్ స్కూల్లో ఏడో తరగతి వరకు చదివించాడు. తర్వాత జీవన్ జ్యోతి స్కూల్ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేసేందుకు సెమిలిగుడకు వెళ్లారు. అక్కడ నుండి సుందర్ ఘర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. చిన్నప్పటి నుండే పైలట్ కావాలన్న ఆమె కోరికను నెరవేర్చుకునేందుకు 2012 సంవత్సరంలో తన ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసింది.
అంతే అప్పటి నుండి సీరియస్ గా పైలట్ ప్రవేశపరీక్ష కోసం సన్నద్ధమైంది. అందులో ఉత్తీర్ణత సాధించి భువనేశ్వర్ పైలట్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో చేరింది. ఏడు సంవత్సరాల పాటు కష్టపడి ఇటీవలే ఓ ప్రయివేట్ విమానయాన సంస్థలో కో పైలట్ గా ఛాన్స్ కొట్టేసింది. ఒడిశా రాష్ట్రం నుండి తొలి మహిళా పైలట్ గా ఎంపికై రికార్డు సృష్టించింది.
ఈ సందర్భంగా అనుప్రియ తల్లి జిమాజ్ జాస్మిన్ మాట్లాడుతూ ''కుటుంబం బంధువుల సహకారంతో, ఆమె ఉన్నత చదువుల కోసం భువనేశ్వర్ కు మకాం మార్చాం. విమానయన రంగంలో చేరేందుకు నన్ను అనుమతి కోరింది. నా సోదరులు (ఆమె మేనమామలు) ఇందుకు చాలా సహాయం చేశారు. వారు మాకు మద్దతు ఇచ్చారు. చివరికి నా కూతురు తానెంటో నిరూపించుకుంది. దీంతో నాకు ఎంతో సంతోషంగా ఉంది'' అని ఆమె అన్నారు.
అనంతరం అనుప్రియ తండ్రి మరినియాస్ లక్రా మాట్లాడుతూ '' ఈ క్రెడిట్ అంతా నా భార్యకే దక్కుతుంది. అనుప్రియకు పైలట్ గా శిక్షణ ఇవ్వడాన్ని ఆమె ఒక సవాలుగా తీసుకుంది. ఈ విషయంలో నేను ఎప్పుడూ పెద్దగా బాధపడలేదు. నేను నా జీతం నా భార్యకు అప్పగించేవాడిని. ఆమెనే మొత్తం చూసుకునేది'' అని ఆయన అన్నారు.



Click it and Unblock the Notifications

