For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మే నెలలో పుట్టిన వారికి ఈ పనులన్నీ సులభంగా పూర్తవుతాయట...!

ఈ నెలలో పుట్టిన వారికి మరికొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మే నెలలో పుట్టిన వారు ఆడంబరాలను ఎక్కువగా కలిగి ఉంటారు.

|

2022 సంవత్సరం చాలా వేగంగా వెళ్తున్నట్టు అనిపిస్తోంది. చూస్తుండగానే ఈ ఏడాది మనం ఐదో నెలలోకి అడుగుపెట్టేశాం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఐదో నెల అయిన మే మాసం నిస్సందేహంగా అద్భుతమైనది. Numerologay (సంఖ్యాశాస్త్రం) ప్రకారం ఈ నెలలో జన్మించిన వారు చాలా చురుకుగా ఉంటారు.

Personality Traits Of May Born People

అంతేకాదు కష్టపడి పని చేస్తారు. వీరు మంచి స్నేహితులను కూడా కలిగి ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారు ఆశావాదులుగా ఉంటారు. వీరిని చాలా మంది ప్రేమిస్తారు. వీరు అనేక మందితో స్నేహపూర్వకంగా ఉంటారు. ఈ నెలలో జన్మించిన వారు చాలా దయతో ఉంటారు. వీరు సహజంగానే కరుణ మరియు వారి చుట్టూ మంచిని వ్యాప్తి చేయడానికి ఇష్టపడతారు. వీటితో పాటు మే నెలలో పుట్టిన వారిలో ఇంకా ఏయే లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం...

వినోదాలంటే బాగా ఇష్టం.

వినోదాలంటే బాగా ఇష్టం.

Numerology (సంఖ్యా శాస్త్రం) ప్రకారం మే నెలలో పుట్టిన వారంతా ఎక్కువగా ఎదుటివారిపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారట. దీంతో పాటు ఈ నెలలో పుట్టిన వారు మంచి భోజన ప్రియులు. వీరికి విందులు, వినోదాలంటే కూడా బాగా ఇష్టం.

ఎంత ఖర్చయినా..

ఎంత ఖర్చయినా..

అందుకే వీరు ఎల్లప్పుడూ స్నేహితులతో లేదా ఇతరులతో కలిసి పార్టీలు వంటివి చేసుకుంటూ ఉంటారు. ఇందుకోసం వీరే సొంతంగా ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు.

త్వరగా పురోగతి

త్వరగా పురోగతి

అయితే ఇలాంటి వాటిలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలంటున్నారు పండితులు. సాధ్యమైనంత వరకు విందులు, వినోదాలు కూడా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే మీరు త్వరగా పురోగతి చెందే అవకాశం ఉంటుందట.

ఊహా లోకంలో.

ఊహా లోకంలో.

అలాగే మే నెలలో పుట్టిన వారు ఎక్కువగా ఊహాల ప్రపంచంలో విహరిస్తూ ఉంటారట. నిజ జీవితంలో తక్కువగా బతుకుతుంటారట. అందుకే ఊహాలోకంలో విహరించడం తగ్గించుకుని, నిజ జీవితంపై శ్రద్ధ పెట్టాలంటున్నారు పండితులు. ఇలా చేస్తే మీ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చట.

మే నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...మే నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

ఎక్కువ ఆడంబరాలను...

ఎక్కువ ఆడంబరాలను...

ఈ నెలలో పుట్టిన వారికి మరికొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మే నెలలో పుట్టిన వారు ఆడంబరాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు నలుగురిలో తామే ప్రత్యేకంగా కనబడాలని తహతహలాడుతూ ఉంటారు.

సలహాల విషయంలో..

సలహాల విషయంలో..

ఈ నెలలో పుట్టిన వారు ఇతరులకు సలహాలు ఇవ్వవచ్చు. కానీ మీరు ఇతరుల సలహాలు తీసుకునే సమయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు పండితులు. ముఖ్యంగా బంధువులు, స్నేహితుల సలహాలతో పాటు ఇతరుల సలహాలను మీరు ఆచరిస్తే మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

మీ జీవితంలో రాణించాలంటే...

మీ జీవితంలో రాణించాలంటే...

మే నెలలో పుట్టిన వారు మీ జీవితంలో మీకు ఉన్న లక్ష్యాలను చేరుకోవాలంటే మీరు సొంత నిర్ణయాలే తీసుకోవాలంట. అలా మీరు ఒంటరిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే జీవితంలో చాలా వేగంగా పురోగతిని సాధిస్తారట.

వివాహం త్వరగా..

వివాహం త్వరగా..

మే నెలలో పుట్టిన వారికి త్వరగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారట. అలాగే వీరికి ధైర్యం, పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయి. తమ శ్రమను నమ్ముకుని అన్నింటా విజయాలు సాధిస్తారు.

దూర ప్రయాణాలు ఇష్టం..

దూర ప్రయాణాలు ఇష్టం..

మే నెలలో పుట్టిన వారికి దూర ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టమట. వీరు ఎప్పుడెప్పుడు విదేశాలలో విహరయాత్రకు వెళ్దామా అని కలలు కంటూ ఉంటారట. అక్కడే స్థిరపడాలని.. ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచిస్తారట. వారి కలల్ని కూడా నిజం చేసుకుంటారట

అందరితోనూ ప్రేమగా..

అందరితోనూ ప్రేమగా..

మే నెలలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు. అందరిచేత ప్రేమించబడతారు. ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువగా కవులుగా, కళాకారులుగా, రచయితలుగా, గాయకులుగా విశేషంగా రాణిస్తారు. అయితే ఈ కళల నుండి ఆదాయాన్ని మాత్రం సంపాదించుకోలేరట. దీన్ని కేవలం ఒక అలవాటుగా మార్చుకుంటారట.

ఆరోగ్య పరంగా..

ఆరోగ్య పరంగా..

మే నెలలో పుట్టిన వారికి గొంతు, ముక్కుకు సంబంధించి కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారట. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే మూర్ఛ వ్యాధికి కూడా గురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

ప్రజా సేవకులుగా..

ప్రజా సేవకులుగా..

మే నెలలో పుట్టిన వారు ప్రజాప్రతినిధులుగా మరియు ప్రభుత్వ ఉద్యోగులుగా రాణిస్తారు. వీరు ఎక్కువగా ప్రజా సేవ చేయడానికి ప్రయత్నిస్తారు. సంఖ్యాశాస్త్రం మే నెలతో పాటు ఏ నెలలో అయినా కూడా 5వ తేదీ ముఖ్యమైన పనులను మొదలుపెడితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. 5 అనే అంకెకు అధిష్టాన దేవుడు విష్ణువు కాబట్టి.. మీకు వీలైనప్పుడల్లా శ్రీవిష్ణుమూర్తి గుడికి వెళ్లడం.. ఆ దేవుడిని ప్రార్థించడం, ఆ దేవుడిని తలచుకుని గుడిలో దీపం వెలిగించటం. ‘ఓం నమో నారాయణాయ:‘ అనే మంత్రాన్ని ప్రతిరోజూ 21సార్లు పఠిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయట.

English summary

Personality Traits Of May Born People

Finally May is here and so are the birthdays of people born in this month. Today, we are here with some personality traits about these people. In order to know what makes these people so special, scroll down the article to read more.
Desktop Bottom Promotion