Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
Planet Transit in February 2022:ఫిబ్రవరిలో మూడు గ్రహాల రవాణా.. ఎప్పుడెప్పుడంటే...
2022 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గ్రహాల రవాణా ఏయే తేదీల్లో జరగనుంది మరియు ఏయే ప్రభావం పడనుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.
Planet Transit in February 2022: ఆంగ్ల నూతన సంవత్సరంలో అప్పుడే మనం తొలి మాసానికి గుడ్ బై చెప్పేస్తున్నాం. అదే సమయంలో రెండో నెలలోకి అడుగుపెట్టనున్నాం. ఈ నేపథ్యంలో రెండో ఏడాది ఫిబ్రవరి మాసంలో మూడు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి.

మరో గ్రహం తిరోగమన దిశలో ప్రయాణిస్తుంది. ఇలా గ్రహాలు ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించనున్నాయి. ఈ గ్రహాల రవాణా ఎంతో ముఖ్యమైన సంఘటనగా పరిగణించబడుతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు మకరరాశిలో నుండి కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు.

అంగారకుడు(కుజుడు) ధనస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించనున్నాడు. మరోవైపు బుధుడు మకరరాశిలో నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ సందర్భంగా ఈ గ్రహాల మార్పు ఏయే తేదీల్లో జరగనుంది? గ్రహాల స్థాన చలనం వల్ల రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏ రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి.. ఏ రాశుల వారికి అశుభ ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఫిబ్రవరి 4న..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి ప్రారంభంలోనే నాలుగో తేదీన అంటే శుక్రవారం రోజున బుధుడు తిరోగమన దిశలో ప్రయాణించనున్నాడు. ఆ తర్వాతే నేరుగా సంచారం చేయడం ప్రారంభమవుతుంది. బుధుడు ఇలా తిరోగమనం చెందడం వల్ల ద్వాదశ రాశుల వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారులు మంచి లాభాలను పొందొచ్చు. అదే సమయంలో బుధ గ్రహం మార్పు వల్ల రాశిచక్రాల వ్యక్తుల యొక్క మేధస్సు, ఆలోచనా శక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఫిబ్రవరి 13న..
సూర్యుడు గత నెలలో అంటే జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి వేళ మకరంలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం సూర్యుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నాడు. సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం రోజున సూర్యుడు మకరరాశిని వదిలి కుంభరాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఇదే రాశిలో సూర్యుడు ఒక నెల రోజుల వరకు నివాసం ఉండనున్నాడు. ఆ తర్వాత మీన రాశిలోకి మారనున్నాడు. ఇలా సూర్యుడు తన స్థానం నుండి మరో స్థానంలోకి మారినప్పుడు రాశిచక్రాల జీవితాలపై ప్రభావం పడుతుంది.

ఫిబ్రవరి 26న..
సూర్యుడి తర్వాత అంగారకుడు(కుజుడు) తన స్థానాన్ని మారనున్నాడు. ఫిబ్రవరి 26వ తేదీన కుజుడు శనివారం రోజున ధనస్సు రాశి నుండి మకరరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇలా కుజుడు రవాణా చేసే సమయంలో మొత్తం ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.

ఫిబ్రవరి 27న..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సంతోషం మరియు విలాసవంతమైన జీవితానికి ప్రతీకగా భావిస్తారు. ఫిబ్రవరి మాసం ప్రారంభంలో శుక్రుడు ధనస్సులో నివాసం ఉంటాడు. అయితే ఫిబ్రవరి 27వ తేదీన అంటే ఆదివారం నాడు శుక్రుడు ధనస్సు రాశిని వదిలి మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశుల వారి జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. దీంతో మీ భౌతిక సంతోషం పెరుగుతుంది.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం కొందరు జ్యోతిష్య నిపుణులు అన్నివర్గాల వారిని ద్రుష్టిలో ఉంచుకుని ఇచ్చారు. మీకు పూర్తి వివరాలు కావాలంటే వ్యక్తిగత జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఇక్కడ ఇవ్వబడిన గ్రహాల వివరాలు కేవలం ఊహాజనితం మాత్రమే. ఇక్కడున్న వివరాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.
ఆంగ్ల నూతన సంవత్సరంలోని రెండో ఏడాది ఫిబ్రవరి మాసంలో మూడు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు మకరరాశిలో నుండి కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు. అంగారకుడు(కుజుడు) ధనస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించనున్నాడు. మరోవైపు బుధుడు మకరరాశిలో నుండి తిరోగమనం చెందనున్నాడు.



Click it and Unblock the Notifications
