Latest Updates
-
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.!
లాక్ డౌన్ వేళ శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే...
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు' నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు ఛాయా గ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. అయితే ఈ నవగ్రహాలలో ఒకటైన శనిగ్రహం. శనీశ్వరుడు, శనేశ్వరుడు అనే పలు నామాలతో పిలువబడతాడు. ఈయన ప్రభావం భూమి మీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవులపైన, నిర్జీవ, నిర్లిప్త వస్తువులపై ఉంటుంది.

సూర్యభగవానుడికి, ఛాయదేవికి పుట్టిన సంతానమే శనిదేవుడు. ఆయనకు ఛాయా పుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి ఆయన జననం సూర్యగ్రహణంలో జరిగింది. శని జయంతి సందర్భంగా శనీశ్వరుడికి ఇష్టమైనవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నీలం, ఇనుము, అశుభ్రంగా ఉండే చోటు, బద్ధకంగా ఉండే వారు. జీవులు చేసే తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శని భగవానుడు యమధర్మరాజుకు అన్న. యమధర్మారాజు మరణానంతరం శిక్ష విధిస్తే, శని దేవుడు మాత్రం జీవులు బతికి ఉండగానే హింసించి, ఇబ్బందులకు గురి చేస్తాడు. ఈ నేపథ్యంలో శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శని దోషాలు తొలగిపోవడానికి లాక్ డౌన్ వేళ ఎలాంటి పవిత్రమైన పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాత షూను..
శని జయంతి రోజున మీ పాత బూట్లు(షూ)ను ఒక కూడలి వద్ద ఉంచండి.

కోతులకు ఆహారం..
శని జయంతి రోజున కోతులకు, నల్ల కోతులకు అరటిపండ్లు, బెల్లం ఆహారంగా ఇవ్వాలి.

సొమ్మును కాపాడుకోవడానికి..
మీ జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి శని జయంతి రోజున గోధుమలను, నువ్వులను దానం చేయాలి.

చేపలకు ఆహారం..
శని జయంతి సమయంలో నల్లటి ఉద్ది పప్పును పిండిగా చేసి చేపలకు ఆహారంగా తయారు చేసి తినిపించాలి.

కొబ్బరికాయను..
శని జయంతి రోజున శనీశ్వరుడిని పూజించడానికి ముందు కొబ్బరికాయను నీటిలో ముంచండి.

ఆవ నూనెను..
శని జయంతి సమయంలో మీ చేతులు, కాళ్ల గోళ్లపై ఆవాలు నూనెను రాయండి.

హనుమాన్ చాలీసా పఠించాలి..
శని జయంతి నాడు ఉదయం మరియు సాయంత్రం హనుమాన్ చాలీసాను పఠించాలి.

చీమలకు ఆహారం..
శని జయంతి రోజు నుండి వచ్చే ఏడు శనివారాల వరకు చీమలకు నువ్వులు, పిండి, చక్కెరను కలిపి ఆహారంగా ఇవ్వాలి.

ఆవ నూనె దీపం..
శని జయంతి రోజున సాయంత్రం వేళ నువ్వులు లేదా ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి.

వివాహం ఆలస్యం అయితే..
వివాహం ఎవరికైతే ఆలస్యం అవుతూ ఉంటుందో, వారు శని జయంతి రోజున 250 గ్రాముల నల్ల ఆవ పిండిని నల్లటి వస్త్రంలో కట్టి, పెపాల్ యొక్క మూలంలో ఉంచి, ముందస్తు వివాహం కోసం శనీశ్వరుడిని ప్రార్థించాలి.



Click it and Unblock the Notifications
