Latest Updates
-
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా..
Solar Eclipse April 2022:తొలి సూర్య గ్రహణం వేళ.. ఈ రాశులకు డబ్బే డబ్బు... మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
2022లో ఏప్రిల్ 30వ తేదీన సూర్య గ్రహణ సమయంలో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు, అదృష్టం కలిసొస్తుందట..
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉంటాయి. అంటే మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో 2022లో ఏప్రిల్ నెలలో తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది. మరోవైపు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏప్రిల్ నెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో మొత్తం 9 గ్రహాలు తమ రాశిచక్రాలను మారనున్నాయి.

ఇందులో శని, గురు, రాహు, కేతు గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 30వ తేదీన శనివారం అర్థరాత్రి 12:15 గంటలకు(భారత సమయం ప్రకారం) తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది.

ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం 4:07 గంటల వరకు ఉంటుది. ఇదే రోజున అమావాస్య కూడా ఏర్పడనుంది. ఈ కారణంగా ఈ గ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. ఇదిలా ఉండగా.. సూర్య గ్రహణాన్ని కొందరు అశుభకరంగా భావిస్తారు. అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.

దేవాలయాలు కూడా పూర్తిగా మూసివేస్తారు. ఎందుకంటే గ్రహణం సమయంలో సూర్యుడి ప్రభావంతో శక్తిని కోల్పోతారని చాలా మంది నమ్ముతారు. ఈ కాలంలో రాశిచక్రాలపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. అయితే సూర్యగ్రహణ కాలంలో కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు రానున్నాయట. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో ఊహించని లాభాలొస్తాయి. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికి సూర్య గ్రహణ సమయంలో శుభ ఫలితాలు రానున్నాయి.. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022లో ఏప్రిల్ 30వ తేదీన శనివారం నాడు సూర్య గ్రహణం ఏర్పడే సమయంలో మేష రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి చూపుతారు. మీరు ఎంతో కాలంగా ఉన్న ఆర్థిక సమస్యల నుండి బయటపడొచ్చు. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ కాలంలో పురోగతి లభిస్తుంది. మీరు కొత్త ఒప్పందాలను కూడా పొందొచ్చు. మీ జీవితంలో ఏదైనా విషయాల్లో వివాదాలు కొనసాగుతుంటే, అవి ముగిసే అవకాశం ఉంది. మీకు కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇది మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

వృషభ రాశి..
ఈ రాశి వారికి సూర్యగ్రహణం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఇప్పటివరకు మీకు ఎదురైన సవాళ్లన్నీ ఈ సమయంలో ముగుస్తాయి. మీ కెరీర్ లో కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీరు అనేక వనరుల నుండి డబ్బును పొందే అవకాశం ఉంది. మీరు పూర్వీకుల ఆస్తి ప్రయోజనాలను కూడా పొందొచ్చు. సమాజంలో మార్పు తీసుకురావడానికి చేస్తున్న క్రుషి ప్రజల ద్రుష్టిలో పడుతుంది. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో ఆర్థిక పరంగా అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ కాలంలో ఏ పని చేసినా విజయం సాధిస్తారు. మీ శ్రమ మరియు అంకితభావాన్ని చూసి అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. ఉద్యోగులకు తమ పని విషయంలో తగిన గౌరవం లభిస్తుంది. ఈ సమయంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ పొందుతారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో శుభ ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు విద్యారంగంలో పురోగతి సాధిస్తారు. మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. ఈ రాశి వారికి గౌరవం మరియు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ప్రేమ జీవితంలో మీ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారు. దీంతో పాటు అవివాహితులకు వివాహ అవకాశాలు కూడా రావొచ్చు. మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారు. మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

మకర రాశి..
ఈ రాశి వారికి సూర్యగ్రహణం సమయంలో శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారులకు అద్భుతమైన లాభాలు రానున్నాయి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంది. మీరు ఆకస్మిక ద్రవ్య లాభాలను కూడా పొందే అవకాశం ఉంది. మీ ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. మీ ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు పెరుగుతుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన స్థలాన్ని సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.
గమనిక : ఈ సమాచారం ఆన్ లైనులో అందుబాటులో ఉన్న ఊహాలు, జ్యోతిష్యశాస్త్ర నిపుణులు తెలిపిన సమాచారంపై ఆధారపడి ఉంటుది. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునే ముందు దయచేసి మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణులను సంప్రదించగలరు. అప్పుడే తుది నిర్ణయం తీసుకోగలరు.
2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 30వ తేదీన శనివారం అర్థరాత్రి 12:15 గంటలకు(భారత సమయం ప్రకారం) తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం 4:07 గంటల వరకు ఉంటుది. అంటే ఇది పాక్షిక గ్రహణంగా మేషరాశిలో ప్రారంభమవుతుంది.
శాస్త్రవేత్తల ప్రకారం.. సూర్యునికి మరియు భూమికి మధ్య చంద్రుడు వెళ్లినప్పుడు, చంద్రుడు సూర్యుని కాంతిని భూమిని చేరకుండా కొంత సమయం పడుతుంది.



Click it and Unblock the Notifications