Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
విజయం సాధించాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలను అలవర్చుకోవాలని చాణక్యుడు చెప్పాడు. జీవితంలో గెలుపును అందుకోవడానికి చాణక్యుడు చెప్పిన ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుడు ఆర్థికవేత్త మాత్రమే కాదు జీవితంలోని ప్రతి అంశాన్ని చాలా చక్కగా వివరించిన గొప్ప మేధావి. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నిజజీవితంలో పాటించదగినవి. ఆయన ఆలోచనలు కచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేవి.

మనిషి సంతోషకరమైన జీవితానికి, కష్టాలను దూరం చేయడానికి కొన్ని విధానాలను రూపొందించాడు. వాటి గురించి చాణక్య నీతి పుస్తకంలో వివరించాడు. ఈ విధానాలను అవలంబించడం ద్వారా విజయ శిఖరాలను చేరుకోవచ్చు. విజయం సాధించాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలను అలవర్చుకోవాలని చాణక్యుడు చెప్పాడు. జీవితంలో గెలుపును అందుకోవడానికి చాణక్యుడు చెప్పిన ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కష్టపడటం ఒక్కటే సరిపోదు:
విజయాన్ని సాధించడానికి కష్టపడటం ఒక్కటే సరిపోదని చెప్పాడు చాణక్యుడు. గమ్యాన్ని చేరుకోవాలంటే ఎన్నో ఇతర అంశాలు దోహదం చేయాల్సి ఉంటుందని వివరించాడు. విజయం సాధించడం హార్డ్ వర్క్ పై ఆధారపడి ఉండదని చాణక్యుడు చెప్పాడు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొన్ని ఇతర అంశాలు కూడా ఉండాలన్నాడు.
ధైర్యం కావాలి:
విజయం సాధించాలంటే పరుగు పందెంలో ఒక వ్యక్తి ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా ఒక మలుపు వస్తుంది. ఆ సమయంలో వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోలేడు. అప్పుడు అతను గెలిచినా ఆటను కోల్పోతాడని, కష్టమంతా వృథా అవుతుందని చాణక్యుడు వివరించాడు. ధైర్యం అంటే మీ లక్ష్యాన్ని సాధించడంలో అడ్డంకిని ఎదుర్కోవడం, విమర్శనలకు వెరవకపోవడం, ఓడిపోయిన వ్యక్తిని చూసి వెనకడుగు వేయకపోవడం.
తప్పుల నుండి నేర్చుకోవాలి:
తప్పులు జీవితంలో ఎంతో నేర్పిస్తాయి. ప్రతి వ్యక్తి తప్పులు చేస్తాడు. అయితే ఆ తప్పుల నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిన వాడే విజయాన్ని సాధిస్తాడని చాణక్యుడు చెప్పాడు. అలాగే ప్రతి తప్పు మనం చేయాల్సిన అవసరం లేదు. ఇతరులు చేసిన తప్పుల నుండి కూడా పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆచార్య చాణక్యుడు వివరించాడు. లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటో, చేసిన తప్పులేమిటి, ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకుంటూ, నేర్చుకుంటూ విజయాన్ని సాధించాలని చాణక్యుడు చెప్పాడు.
కొత్తగా ప్రయత్నించాలి:
ఏదీ శాశ్వతం కాదు, మార్పు ఒక్కటే శాశ్వతం. అందుకే కాలానుగుణంగా మారుతూ ఉండాలని చాణక్యుడు సూచించాడు. మూస ధోరణులు, పాత విధానాలు, పద్ధతులను పట్టుకుని వేలాడకూడదని, కొత్తగా చేయడానికి ప్రయత్నించాలని చాణక్యుడు చెప్పాడు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సిగ్గు పడకూడదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలని చాణక్యుడు చెప్పాడు.
మంచి సాంగత్యం:
జీవితంలో విజయం సాధించాలంటే చెడు సాంగత్యానికి, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిదని చాణక్యుడు చెప్పాడు. చెడు సహవాసం, చెడు అలవాట్లు ప్రతిభావంతులైన వ్యక్తుల భవిష్యత్తును కూడా నాశనం చేస్తాయి.



Click it and Unblock the Notifications
