Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Sun and Mars Transit in Virgo:కుజుడు, సూర్యుడు ఒకే రాశిలో కలిస్తే.. ఈ రాశులకు శుభ ఫలితాలు...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో సూర్యుడు, అంగారకుడు(కుజుడు)కి ఎంతో విశిష్టత ఉంది. ఈ రెండు గ్రహాలు 2021 సంవత్సరంలో సింహ రాశి నుండి కన్యరాశిలోకి సెప్టెంబర్ 16వ తేదీన గురువారం నాడు ప్రవేశించనున్నాయి.

దీని కంటే ముందు ఆగస్టు మాసంలో ఈ రెండు గ్రహాల కలయిక జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. ఈ గ్రహాల ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి ఒడిదుడుకులు ఎదురవుతాయి.

ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యుడు, కుజ గ్రహాలు కన్యరాశిలో కలవడం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనాలు చేకూరనున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు, అంగారకుడు ఐదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నారు. ఈ కాలంలో ఈ రాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు పోటీ పరీక్షల్లో కచ్చితంగా విజయం సాధిస్తారు. మరోవైపు ఉద్యోగులు, వ్యాపారులు ఈ కాలంలో మంచి ఫలితాలను పొందుతారు. రాజకీయ రంగంలో ఉండే వారికి సానుకూలంగా ఉంటుంది. మరోవైపు మీ ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు రావొచ్చు. కాబట్టి మీరు ఇలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి మూడో పాదం గుండా సూర్యుడు, కుజుడు రవాణా చేయనున్నారు. చంద్రుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని వల్ల మీరు మంచి ప్రయోజనాలు పొందే ఛాన్స్ కూడా ఉంటుంది. మరోవైపు వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఇదే సమయంలో ఉద్యోగులు ఆఫీసులో పురోగతికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మీరు పని చేసే ప్రదేశంలో మీ పట్ల గౌరవం కూడా పెరుగుతుంది.

తుల రాశి..
ఈ రాశి నుండి పన్నెండో స్థానం నుండి రెండు గ్రహాలు ప్రయాణం చేయనున్నాయి. ఈ కాలంలో ఈ రాశి వారికి ఊహించిన ఫలితాలు రావొచ్చు. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులు కొంచెం కష్టపడితే మంచి పురోగతి సాధించొచ్చు. విద్యార్థులు విద్యపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి. మీరు చదువుపై ఎక్కువ ఫోకస్ పెడితే చాలు.. మంచి ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి పదో స్థానం నుండి కుజుడు, సూర్యుడు రవాణా చేయనున్నారు. ఈ సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చాలా ధైర్యంగా, శక్తివంతంగా ఉంటారు. ఉద్యోగులు ఆఫీసులో ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. ఇంతకాలం ఇబ్బంది పెట్టిన మీ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అంతా సానుకూలంగా ఉంటుంది. అయితే మీరు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో సూర్యుడు, అంగారకుడు(కుజుడు)కి ఎంతో విశిష్టత ఉంది. ఈ రెండు గ్రహాలు 2021 సంవత్సరంలో సింహ రాశి నుండి కన్యరాశిలోకి సెప్టెంబర్ 16వ తేదీన గురువారం నాడు ప్రవేశించనున్నాయి.



Click it and Unblock the Notifications
