Latest Updates
-
ఆగస్టు 11 నుంచి 5 రాశులకు రాజయోగం.. కుబేరులు కాబోతున్న ఆ అదృష్టవంతులు మీరేనా? -
చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే! -
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా.. -
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి.. -
అరేయ్ మామా.. మీ బెస్ట్ ఫ్రెండ్ కి పంపించడానికి అదిరిపోయే ఫ్రెండ్ షిప్ డే విషెస్, కోట్స్,స్టేటస్ లు.. -
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు! -
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం! -
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు
జులైలో ఈ రాశులకు శృంగార పరంగా అద్భుతంగా ఉంటుదట.. మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
ఈ రాశుల వారు జులై నెలలో చాలా రొమాంటిక్ గా ఉంటారట. అందులో మీ రాశి ఉందేమో చూసెయ్యండి.
2021 సంవత్సరంలో అప్పుడే సగం కాలం పూర్తయ్యింది. కరోనా కాలంలో జులై నెలలోకి అడుగుపెట్టేశాం. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ మాసంలో నాలుగు గ్రహాలు పరివర్తనం చెందనున్నాయి.

ఈ సమయంలో ద్వాదశ రాశి చక్రాలపై కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ముఖ్యంగా జులై 7వ తేదీన బుధుడు మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. జులై 16న సూర్యుడు కర్కాటకంలోకి, జులై 17న శుక్రుడు సింహ రాశిలోకి, జులై 20వ తేదీన సింహ రాశిలోకి అంగారకుడు ప్రవేశించనున్నాడు.

ఈ గ్రహాల కారణంగా కొన్ని రాశుల వ్యక్తుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో సైతం శృంగారం పుష్కలంగా ఉంటుంది. ఇంతకీ ఆ రాశిచక్రాలేవి... ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
ఈ మాసంలో శుక్రుడు ఈ రాశి నుండి ఐదో స్థానం నుండి రవాణా చేయనుండగా.. బుధుడు మూడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ గ్రహాలు ధైర్యానికి, శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ సమయంలో మీరు మీ ప్రియురాలు/ప్రియుడు లేదా మీ జీవిత భాగస్వామిని బాగా ఆకట్టుకుంటారు. శుక్రుని రవాణా వల్ల మీ శృంగార జీవితం మరింత మెరుగవుతుంది. ఇదే నెలలో మీరు కొన్ని శృంగార ప్రదేశాలకు కూడా వెళ్లొచ్చు. మరోవైపు మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే మీ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. వారి నుండి సానుకూల సమాధానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వృషభ రాశి..
శుక్రుడు ఈ రాశి నుండి నాలుగో స్థానం రవాణా చేయనున్నాడు. ఈ సందర్భంగా మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. దీంతో పాటు మీ కుటుంబ వాతావరణం కూడా మంచిగా ఉంటుంది. ఏదైనా విషయం గురించి మీ జీవిత భాగస్వామితో ఏదైనా విభేదాలు ఉంటే, అది కూడా ఈ సమయంలో అధిగమించొచ్చు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు తమ ప్రియురాలిని లేదా ప్రియుడిని లేదా స్నేహితుడిని చాలా సులభంగా ఆకట్టుకుంటారు. అయితే ఈ రాశి వారు మీ ప్రేయసితో లేదా ప్రియుడితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ నోటి నుండి చెడు మాటలు బయటకు రాకుండా ఉండాలి. దీని వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.

మిధున రాశి..
ఈ రాశి వారికి గ్రహాల సంచారం కారణంగా ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. బుధుడు ఈ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఏడో స్థానం నుండి ప్రవేశించడం వల్ల, మీ వివాహ జీవితంలో మంచి ఫలితాలు ఎదురవుతాయి. ఈ నెలలో మీరు మీ తప్పులను కూడా అర్థం చేసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో మంచిగా ఉండొచ్చు. మీ వైవాహిక జీవితంలో లేదా ప్రేమ జీవితంలో శృంగార పరంగా అద్భుతంగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి ప్రేమ పరంగా జులై మాసం చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ రాశి నుండి సూర్యుడు 11వ స్థానం గుండా ప్రయాణించనున్నాడు. ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో సంబంధాన్ని బలోపేతం చేస్తారు. మీరు వారి ప్రతి కోరికను తీర్చడానికి ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకు తరచుగా జరిగ తగాదాలు కూడా ఆగిపోతాయి. మీ భాగస్వామితో మీ బంధం కూడా మరింత బలంగా మారుతుంది. ఇప్పటికీ ఎవరైనా ఒంటరిగా ఉంటే.. సూర్యుడి ప్రభావం వల్ల మీరు ఈ సమయంలో ఎవరినైనా సులభంగా ఆకట్టుకోవచ్చు. అదే సమయంలో భాగస్వామి ఉన్నవారు, వారు మీకు అన్ని విషయాల్లో సహాయపడతారు. దీంతో మీ వైవాహిక జీవితం మరింత మెరుగుపడుతుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి జులై నెలలో ప్రేమ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి నుండి అంగారకుడు పదో స్థానం నుండి ప్రయాణించడం వల్ల ఈ రాశి వారికి చాలా రంగాల్లో విజయం లభిస్తుంది. అంగారకుడి స్థానం మార్పు వల్ల ఈ రాశి వారు పూర్తి విశ్వాసంతో ఉంటారు. మీ ప్రేమ జీవితం కూడా బలంగా ఉంటుంది. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలని ఆలోచిస్తుంటే.. ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామిని, కుటుంబ సభ్యులను సులభంగా ఒప్పిస్తారు. వారు మీ జీవితంలో ముఖ్యమైన వారని అనిపిస్తుంది. అయితే మీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి.

కుంభ రాశి..
ఈ రాశి వారికి జులై నెల అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు ఈ రాశి ఏడో స్థానం నుండి రవాణా చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో శుభప్రదంగా ఉంటుంది. అదే విధంగా శృంగార పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామిని మీరు సులభంగా ఆకర్షిస్తారు. వివాహం కాని వ్యక్తులు, ఈ కాలంలో మంచి జీవిత భాగస్వామిని పొందొచ్చు. మీ రిలేషన్ షిప్ కూడా స్థిరంగా ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రేమ సంబంధంలో ఉన్న ఈ రాశి చక్రాలకు ఈ నెల చాలా మంచిది.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications