Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
Today Rasi Phalalu : ఓ రాశి వారు కొత్త ఆదాయ వనరులను కనుగొంటారు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, కార్తీక మాసంలో శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో మీ బాస్ ముఖ్యమైన పనులు కేటాయించొచ్చు. అయితే మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు ఉన్నతాధికారుల పూర్తి మద్దతును కూడా పొందుతారు. మీరు వారి వైపు నుండి మంచి పనికి సంబంధించిన సలహాలను కూడా పొందొచ్చు. మరోవైపు, వ్యాపారవేత్తలు డబ్బు విషయంలో చాలా అజాగ్రత్తగా ఉండకూడదు. లేకపోతే మీరు ఈరోజు ఇబ్బందుల్లో పడొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల ఆప్యాయత మరియు మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. మీరు మీ ప్రియమైన వ్యక్తి యొక్క విభిన్న రూపాన్ని చూడొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత పాటించాలి. ఆరోగ్యంగా ఉండేందుకు రాత్రిపూట తేలికపాటి భోజనం చేయాలి.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది. మీ వ్యాపారం పుంజుకోవచ్చు. ఈరోజు మీరు మంచి లాభాలను పొందగలుగుతారు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ సమయం దీనికి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే వారికి పదోన్నతి లభిస్తుంది. మరోవైపు, మీరు ఇటీవల పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే, మీకు సానుకూల సమాధానం వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ రోజు అవుతుంది. ఈరోజు మీరు రుణాలు తీసుకోవడం వంటివి చేయొద్దు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. చిన్న విషయాలపై వివాదాలు మీ వైవాహిక జీవితంలో అసమ్మతిని పెంచుతాయి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో మర్యాదగా వ్యవహరించాలి. ఇటీవలే మీరు వివాహం చేసుకున్నట్లయితే, మీ వైవాహిక జీవితంపై కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీలైతే, ఈరోజు మీ ప్రియమైన వారి కోసం మీ బిజీ రొటీన్ నుండి కొంత సమయం కేటాయించి, వారికి ఇష్టమైన ప్రదేశానికి విహారయాత్రకు తీసుకెళ్లండి. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆర్థికంగా, మీరు దగ్గరగా ఉన్నవారికి కూడా సహాయం చేయొచ్చు. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు అనవసరమైన విషయాల్లో చిక్కుకోవడం వల్ల మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు తలనొప్పి, కంటి నొప్పి మొదలైన సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఈరోజు పనికి సంబంధించిన సుదీర్ఘ ప్రయాణం చేయవలసి ఉంటుంది. మీ ప్రయాణం చాలా ముఖ్యమైనది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈరోజు మంచి లాభాలను పొందుతారు. ఇటీవలి నష్టాలను భర్తీ చేసుకునే అవకాశం మీకు ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ తల్లిదండ్రుల విజయాల గురించి మీరు గర్వపడతారు. వారితో మీ సంబంధం బలపడుతుంది. గృహ బాధ్యతలను నెరవేర్చడంలో జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచి రోజు. వాతావరణంలో మార్పుల కారణంగా ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 24
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3:45 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో ఏవైనా సమస్యలుంటే.. మీరు చాలా తెలివిగా సమస్యను పరిష్కరించగలుగుతారు. చాలా కాలం తరువాత, మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో కూడా కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆదాయం విషయంలో సమతుల్యంగా ప్రవర్తించాలి. ఇతరులను సంతోషపెట్టడానికి, మీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండండి. లేకుంటే రాబోయే రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. మీరు పని చేస్తూ, మీ ఉద్యోగాన్ని మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, కొత్త ఉద్యోగం కోసం వెతకడానికి ఈరోజు అనుకూలమైన రోజు. మీరు త్వరలో విజయం సాధించొచ్చు. ప్లాస్టిక్, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటికి సంబంధించిన పని చేసే వారికి ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ప్రతి అడుగు చాలా ఆలోచనాత్మకంగా ముందుకు వేయాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు మీ స్వంత నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఇతరుల కోరిక మేరకు ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మరోవైపు చిరు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, పెద్ద వ్యాపారవేత్తలు కొంత సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చేస్తున్న ఏదైనా పని అకస్మాత్తుగా చెడిపోయే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీరు సహనంతో పని చేయాలి. మీరు తొందరపాటుతో తీసుకున్న తప్పుడు నిర్ణయం మీ సమస్యలను పెంచుతుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఆఫీసులో ఎక్కువగా జోక్ చేయడం మానుకోవాలి.ఈరోజు మీ ఆరోగ్యం బాగాలేకపోతే, విశ్రాంతిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలు ఆశించిన ఫలితాలను పొందలేకపోతే, మీ వ్యాపార ప్రణాళికలను సమీక్షించుకోవాలి. మీరు మీ వ్యాపార నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకుంటారు. తద్వారా మీరు ప్రమోషన్‌పై కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆన్‌లైన్ వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో ఉన్నతాధికారులతో విభేదాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. మీ పనిపై దృష్టి పెట్టండి, అలాగే ఉన్నతాధికారులను గౌరవించండి. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు డబ్బుకు సంబంధించిన చింతల నుండి బయటపడలేరు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈరోజు మీ ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు ఇటీవల ఏదైనా పోటీ పరీక్ష ఇచ్చినట్లయితే, మీరు విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు, మీరు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను పొందాలనుకుంటే మరియు మీ మార్గంలో ఏదైనా అడ్డంకి వస్తున్నట్లయితే, ఈరోజు అన్ని అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో అదనపు బాధ్యతలను పొందొచ్చు. మీ అన్ని బాధ్యతలను నెరవేర్చడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి. సోమరితనాన్ని విడిచిపెట్టి, మీ పనిపై దృష్టి పెట్టండి. మరోవైపు, వ్యాపారవేత్తలు ఈరోజు తొందరపడి ఏ ముఖ్యమైన పత్రంపై సంతకం చేయవద్దు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, పొట్టకు సంబంధించిన కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : ఉదయం 8:55 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆఫీసు వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీ బాస్ యొక్క హాట్ టెంపర్ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. చిన్న చిన్న పొరపాట్లకు మీరు వారి కోపాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. మరోవైపు, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తి మంచి లాభాలను పొందొచ్చు. ఈరోజు మీ ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. మీరు కొత్త ఉద్యోగం ప్రారంభించాలనుకుంటే, తొందరపడకండి. మీ ఇంటి వాతావరణం బాగా ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లోతుగా ఉండొచ్చు. ప్రత్యేకించి మీరు ఉమ్మడి కుటుంబంలో నివసిస్తుంటే, మీ నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో మంచి సామరస్యం ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ ప్రియమైన వ్యక్తి యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:05 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో ప్రైవేట్ రంగంలో పని చేసే వారికి పురోగతి ఉంటుంది. మీ కృషి చాలా కాలంగా కొనసాగుతోంది. మీ విజయానికి బలమైన అవకాశం ఉంది. మరోవైపు, వ్యాపార వ్యక్తులు చర్చకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడొచ్చు. మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ ఇంటి సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశాన్ని పొందొచ్చు. ఈరోజు జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ ప్రియమైన వ్యక్తి యొక్క ఆవేశపూరిత స్వభావం మీ భావాలను గాయపరచొచ్చు. అలాగే వారు మిమ్మల్ని విస్మరిస్తున్నారని మీరు భావిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీలు, టీలు తీసుకోవడం తగ్గించాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 24
లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి రాత్రి 8:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసులో శుభవార్తలు వినిపిస్తాయి. మీరు త్వరలో విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే, మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఈరోజు పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా డబ్బు విషయంలో ఇతరులను గుడ్డిగా నమ్మడం మానుకోండి. మీ పని విదేశీ కంపెనీలకు సంబంధించినది అయితే, త్వరలో మీ వ్యాపారం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉండొచ్చు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు అవుతుంది. ఆరోగ్యం విషయానికొస్తే.. చెవులకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:55 నుండి రాత్రి 8:05 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందే బలమైన అవకాశం ఉంది. త్వరలో మీరు డబ్బు సంబంధిత చింతలను వదిలించుకోవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టతరమైన కొన్ని పనులు ఈరోజు సకాలంలో పూర్తవుతాయి. మీ పనితీరుతో బాస్ చాలా సంతోషిస్తారు. ఇది కాకుండా, ఉన్నతాధికారులు కూడా మీ ఉత్సాహాన్ని పెంచుతారు. వ్యాపారస్తులు మిశ్రమ లాభాలు పొందగలరు. మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కష్టపడి పని చేస్తూ ముందుకు సాగండి. మీ కష్టానికి త్వరలో ఫలితం దక్కుతుంది. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైన వారితో చాలా సంతోషకరమైన రోజు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 4:15 నుండి రాత్రి 9:50 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











