Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
Today Rasi Phalalu : ఓ రాశి అవివాహితులు త్వరలో పెళ్లి చేసుకోవచ్చు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, మార్గశిర మాసంలో మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈరోజు కార్యాలయంలో కొంత గొప్ప గౌరవాన్ని పొందొచ్చు. మీరు ఉన్నతాధికారులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. మీ మంచి పనితీరుకు మీరు చాలా ప్రశంసలు పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రభుత్వోద్యోగం చేస్తే ఉన్నత పదవిని పొందొచ్చు. దీంతో పాటు మీ జీతం కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండే అవకాశం ఉంది. మీరు మీ ఇంటి పెద్దల సలహాలు పాటించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రే
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి ఉదయం 10:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు నీరసంగా మరియు సోమరితనంగా అనిపిస్తే, మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మీరు తేలికపాటి వ్యాయామంతో ఈరోజును ప్రారంభించండి. దీంతో పాటు మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును హాబీలు, వినోదం లేదా స్నేహితులను ఆకట్టుకోవడానికి ఖర్చు చేస్తే, రాబోయే రోజుల్లో మీ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు పనులు నెమ్మదిగా చేయడం వల్ల చాలా పనులు పెండింగులో పడిపోతాయి. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారిలో ప్రభుత్వ శాఖలో పనిచేసే వారికి ఈరోజు చాలా మంచి రోజు. మీరు ప్రమోషన్ పొందొచ్చు లేదా మీరు కోరుకున్న బదిలీని కూడా పొందొచ్చు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు లాభదాయకమైన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, ఇటీవల మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే, ఈరోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో అదనపు సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈరోజు మీరు మీ మనసును మీ ప్రియమైన వారితో కూడా పంచుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీరు ఈరోజు ఏదైనా దీర్ఘకాలిక నొప్పి నుండి ఉపశమనం పొందొచ్చు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 2:25 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో చాలా మంచిగా గడుపుతారు. మీ సంబంధాలు బలపడతాయి. ప్రతికూల పరిస్థితుల్లో, మీరు మీ ప్రియమైనవారి నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీరు ఒంటరిగా ఉండి, మీ కోసం చాలా కాలంగా సరైన జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లయితే, మీ శోధన ఈరోజుతో ముగియవచ్చు. త్వరలో మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మీరు మరింత కష్టపడి పనిచేయాలి. మీ శ్రమ ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఈరోజు ప్రతికూల ఆలోచనలకు కూడా దూరంగా ఉండాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6:40 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీ మంచి స్వభావాన్ని, మధురమైన మాటలను ప్రజలు మెచ్చుకుంటారు. మీ సానుకూలత ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలను పొందొచ్చు. మీ ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కాకుండా, మీరు ఏదైనా పాత ఆస్తిని విక్రయించాలని ప్లాన్ చేస్తే, త్వరలో మీరు విజయం పొందొచ్చు. ఈరోజు ఉపాధి పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. దీంతో పాటు, మీకు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. మరోవైపు, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో విద్యార్థులు ఏదైనా సబ్జెక్టులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే, మీరు మీ ఉపాధ్యాయులు మరియు పెద్దల సహాయం తీసుకోవాలి. చదువులు మరియు రచనల పట్ల నిర్లక్ష్యం మీ భవిష్యత్తు ప్రణాళికలను పాడు చేస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలోని సహోద్యోగులతో అనవసర విషయాలకు సంబంధించి గొడవలు మానుకోండి. మీ మొండి స్వభావం ఈరోజు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మరోవైపు వ్యాపారస్తులు ఈరోజు మంచి ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు ఈరోజు పనిలో బిజీగా ఉండటం వల్ల మీ ప్రియమైన వారితో తగినంత సమయం గడపలేకపోవచ్చు. అయితే, మీరు మీ ప్రియమైనవారి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ రెడ్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
2022లో ధనస్సు రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు డబ్బుకు సంబంధించిన చింతలను వదిలించుకోవచ్చు. మీరు చాలా కాలం తర్వాత మంచి మానసిక స్థితిని కనుగొంటారు. ఉద్యోగులు కార్యాలయంలోని ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. వారు మీ పనిలో ఏదైనా లోపాలను కనుగొంటే, మీరు వాటిని తొలగించడానికి ప్రయత్నించండి. త్వరలో మీ పురోగతి కల నెరవేరుతుంది. మరోవైపు, వ్యాపార వ్యక్తులు ఏదైనా కొత్త వ్యాపార ప్రతిపాదనను అంగీకరించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఇంటి సభ్యులతో ప్రేమ మరియు అనుబంధం అలాగే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగించొచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు కొన్ని విషయాల్లో హెచ్చుతగ్గులుంటాయి. కాబట్టి అనవసరమైన వాటి గురించి మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి. చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించడానికి ప్రయత్నించండి. ఈరోజు ఉద్యోగస్తులకు సంబంధించిన ఏ ముఖ్యమైన పనులలో వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. మీరు పైఅధికారుల మద్దతు పొందుతారు. మీ పని పట్ల బాస్ కూడా సంతృప్తి చెందుతారు. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందగలరు. మీరు ఈరోజు చాలా పరుగెత్తాల్సి రావొచ్చు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. మీ ప్రియమైన వారిపై ఇతరుల కోపాన్ని బయట పెట్టడం మానుకోండి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ఖరీదైన రోజు. మీ బడ్జెట్ అసమతుల్యత కావొచ్చు. ఆరోగ్యంగా ఉండేందుకు బయటి వస్తువులను తినడం మానుకోవాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. పనితో పాటు, మీరు చదువు మరియు కంపెనీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా మంచిగా ఉంటుంది. అకస్మాత్తుగా మీరు డబ్బు పొందొచ్చు. ఈరోజు మీరు మీ కోసం విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, మీరు ఏదైనా పాత చిన్న రుణాన్ని కూడా తిరిగి చెల్లించగలరు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో పారదర్శకంగా ఉండండి. మీ మనస్సులో ఏదైనా సమస్య ఉంటే, దానిని మీ ప్రియమైన వారితో బహిరంగంగా పంచుకోండి. మౌనంగా ఉండటం ద్వారా మీ మధ్య అపార్థాన్ని పెంచుకోకండి. పని విషయంలో ఈరోజు మీకు చాలా బిజీగా ఉంటుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఈరోజు మీరు ఎక్కువ కష్టపడాల్సి రావొచ్చు.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే, మీ బాస్ యొక్క మానసిక స్థితి చెడుగా ఉంటుంది. అది మీ పురోగతిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. చిరు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. చిన్న పొరపాటు కూడా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మంచిగా సాగదు. మీ ప్రియమైనవారి స్వభావంలో ప్రతికూలంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే మీ మధ్య వాగ్వాదం జరగొచ్చు. ఈరోజు మీరు మానసికంగా బాగుండరు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఈ సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈరోజు మీరు అప్పులు మరియు రుణాలను కూడా నివారించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. మీ కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయొచ్చు. ఆఫీస్‌లో మీ శ్రమకు బాస్ చాలా ఇంప్రెస్ అవుతారు. ఈరోజు వారు మీకు పెద్ద మరియు ముఖ్యమైన పనిని అప్పగించగలరు. ఇది కాకుండా, మీరు మీ ప్రమోషన్ లెటర్‌ను కూడా పొందొచ్చు. మరోవైపు, మీ వ్యాపారంలో మరియు మీ పనిలో ఏదైనా ప్రభుత్వ అడ్డంకి వచ్చినట్లయితే, ఈరోజు అది తొలగిపోయే అవకాశం ఉంది. త్వరలో మీ వ్యాపారం రెండు రెట్లు వేగంగా వృద్ధి చెందుతుంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ప్రత్యేకమైన రోజు అవుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు మీకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదించొచ్చు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో ఉద్యోగులు విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నట్లయితే, ఈరోజు మీరు ఒక పెద్ద కంపెనీ నుండి ఆఫర్ పొందొచ్చు. ఇలా కష్టపడి పని చేస్తూ ముందుకు సాగండి. త్వరలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆర్థిక స్థితి బలపడుతుంది. ఈరోజు మీరు రెట్టింపు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమపూర్వక ప్రవర్తన మీకు చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీ ప్రియమైన వారిపై మీ నమ్మకం బలపడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు, తండ్రి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాలు సాధ్యమే. ఈరోజు రెండో భాగంలో మీరు ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి రావచ్చు. మీ ప్రయాణం ఉద్యోగానికి సంబంధించినది కావొచ్చు. అయితే, మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











