For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఈరోజు ఓ రాశి వ్యాపారులు ఆర్థిక పరంగా నష్టపోవచ్చు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, పుష్య మాసంలో సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Makar Sankranti 2022 Horoscope:మకరంలోకి సూర్యుడి రవాణా.. 12 రాశులపై పడే ప్రభావం...!Makar Sankranti 2022 Horoscope:మకరంలోకి సూర్యుడి రవాణా.. 12 రాశులపై పడే ప్రభావం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితంపై బ్యాలెన్స్ పాటించాలి. పనితో పాటు, మీరు మీ కుటుంబంపై కూడా తగినంత శ్రద్ధ వహించాలి. లేకపోతే మీ సంబంధాలు దెబ్బతింటాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. మీ ప్రియమైన వారు అజాగ్రత్తగా ఉంటే వారి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు. దీని కారణంగా మీరు చాలా ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగులు కార్యాలయంలోని సహోద్యోగులతో మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. అనవసర వివాదాలు మీ పనిని ప్రభావితం చేయొచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు పెద్ద ఒప్పందాలు చేసుకునే అవకాశం లభిస్తుంది. మీ వ్యాపారం పుంజుకుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో పెద్ద వ్యాపారవేత్తలకు ఈరోజు సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో సమన్వయం దెబ్బతింటుంది. మీరు తెలివిగా వ్యవహరించడం మంచిది. అదే సమయంలో అదనపు పనిభారం ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతుంది. సీనియర్ అధికారుల ఒత్తిడి మీపై ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు ఇంటి సభ్యునితో వాగ్వాదం ఉండొచ్చు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీరు మీ వైపు ప్రశాంతంగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో సోమరితనాన్ని విడిచిపెట్టి, మీ పూర్తి దృష్టిని మీ పనిపై కేంద్రీకరించాలి. మీరు ఈరోజు అజాగ్రత్తగా ఉంటే, మీ ముఖ్యమైన పనులు చాలా అసంపూర్ణంగా ఉంటాయి. వ్యాపారస్తులు ఈరోజు ఆర్థికంగా నష్టపోతారు. ఇతరులను గుడ్డిగా నమ్మడం మానుకోండి. ఇది కాకుండా, మీ వ్యాపార నిర్ణయాలు మీరే తీసుకుంటే మంచిది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు లోతుగా ఉండొచ్చు. మీ మధ్య విడిపోయే అవకాశం కూడా ఉంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మరియు మీ నిర్ణయాలు తెలివిగా తీసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేయొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:05 గంటల వరకు

2022 Yearly Rasi Phalalu : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు అద్భుత విజయాలు సాధిస్తారట...!2022 Yearly Rasi Phalalu : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు అద్భుత విజయాలు సాధిస్తారట...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి నిరాశ మరియు నిస్పృహలు ఏవీ సాధించలేవు. మీరు సానుకూలంగా ఉండండి. త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీ ఆఫీసు వాతావరణం చాలా బాగుంటుంది. ఈరోజు మీ పని చాలా వేగంగా పూర్తవుతుంది. ఇది కాకుండా, మీరు అవసరమైనప్పుడు సహోద్యోగులకు కూడా సహాయం చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కోరుకున్న బదిలీని పొందొచ్చు. మీ ఆదాయం కూడా పెరిగే బలమైన అవకాశం ఉంది. రవాణా సంబంధిత పనులు చేసే స్థానికులు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈరోజు మానసికంగా కూడా దృఢంగా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:50 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారు ఇటీవల ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే, మీరు దాని నుండి అద్భుతమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఇలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే త్వరలోనే మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలని ఆలోచిస్తుంటే, మీరు విజయాన్ని పొందొచ్చు. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు వెన్ను లేదా నడుముకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:15 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు అలసిపోయినట్లు అనిపించొచ్చు. మీకు భారంగా ఉన్నట్లయితే, ఈరోజు మీ బిజీ రొటీన్ నుండి మీ కోసం కొంత సమయం కేటాయించండి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లండి లేదా కుటుంబ సభ్యులతో గడపండి. దీనివల్ల మీకు మానసికంగా మంచి అనుభూతి కలుగుతుంది. అదే సమయంలో, మీరు కూడా చాలా రిఫ్రెష్ అవుతారు. వ్యాపారస్తులు ఈరోజు అనవసరంగా ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఈరోజు మీకు సవాలుగా ఉండే రోజు. ఆర్థిక పరంగా ఈరోజు అదృష్టం మీకు కలిసి వస్తుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు తల్లిదండ్రులతో సంబంధాలలో సామరస్యం ఉంటుంది. అయితే, ఈ సమయంలో వారు విశ్రాంతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

2022లో పురుషులు ఎలా ఉండబోతున్నారో తెలుసా? ఈ 4 రాశుల వారికి రాజయోగం రాబోతుంది....!2022లో పురుషులు ఎలా ఉండబోతున్నారో తెలుసా? ఈ 4 రాశుల వారికి రాజయోగం రాబోతుంది....!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఆస్తమాతో బాధపడుతున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. పని విషయంలో ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా పరుగెత్తాల్సి రావొచ్చు. సేల్స్ మరియు మార్కెటింగ్‌కు సంబంధించిన వ్యక్తులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు ఈరోజు కొత్త పనులు ప్రారంభించొద్దు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఇంటి సభ్యులతో మీ సంబంధం బాగుంటుంది, మీ జీవిత భాగస్వామితో విభేదాలు లేదా అహంకారాన్ని నివారించండి. మీరు ఒకరినొకరు గౌరవించుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అవసరానికి మించి ఖర్చు చేయడం మానుకోండి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు పెండింగులో ఉన్న పనులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ పనితీరుతో బాస్ చాలా సంతృప్తి చెందుతారు. దీంతో పాటు, మీకు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. మందుల వ్యాపారులు ఆర్థికంగా మంచి లాభాలు పొందగలరు. మీ వ్యాపారం పెరుగుతుంది. అదే సమయంలో, ధాన్యానికి సంబంధించిన పని చేసే వ్యక్తులు కూడా ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. మీ తండ్రి ఆరోగ్యంలో ఆకస్మిక క్షీణత ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6:15 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఒంటరిగా ఉన్నట్లయితే, ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. మీ జీవిత భాగస్వామి కోసం అన్వేషణ ముగియవచ్చు. త్వరలో మీరు ముడి వేయొచ్చు. మరోవైపు, మీరు ఇప్పటికే వివాహం చేసుకున్నట్లయితే, మీ వైవాహిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేకపోతే మీ ప్రియమైనవారు నిర్లక్ష్యం చేయబడొచ్చు. చిన్న తోబుట్టువులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఈరోజు మీరు వారితో సరదాగా గడిపే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగులు తమపై ఎక్కువ పని ఒత్తిడిని పెట్టుకోకుండా ఉండాలి. పైఅధికారులను ప్రసన్నం చేసుకునేందుకు ఇలా చేస్తే మీ పనితీరుతో పాటు ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 9:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. లేకుంటే మీ జీవితం కూడా ప్రభావితం కావొచ్చు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో బాస్ మరియు సీనియర్ అధికారుల నుండి మద్దతు ఉంటుంది. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటారు. మీరు మీ పనులన్నింటినీ త్వరగా పూర్తి చేస్తారు. మీరు బాస్‌తో ముఖ్యమైన చర్చను కూడా కలిగి ఉండొచ్చు. అదే సమయంలో, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు త్వరితగతిన లాభాలను సంపాదించడానికి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఇంటి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి, మీరు సమతుల్య ఆహారం తీసుకోవాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు వినోదభరితంగా ఉంటుంది. స్నేహితులతో, ఈరోజు మీరు ఇంట్లో చిన్న పార్టీని నిర్వహించొచ్చు. చాలా కాలం తర్వాత అలాంటి సమయాన్ని గడిపిన తర్వాత మీరు చాలా మంచిగా మరియు రిఫ్రెష్‌గా ఉంటారు. ఉద్యోగం కోసం చేస్తున్న వ్యక్తులు తమ ప్రయత్నాలను పెంచుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నట్లయితే, మీరు కార్యాలయంలోని సహోద్యోగులు మరియు సీనియర్ అధికారులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. దీంతో వ్యాపారులకు లాభసాటిగా మారుతోంది. మీరు ఇటీవల కొత్త వ్యాపార పరిచయాన్ని కలిగి ఉంటే, ఈరోజు మీరు దాని నుండి మంచి ప్రయోజనం పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రేమ మరియు అనుబంధం అలాగే ఉంటుంది. ఈరోజు మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు క్రెడిట్ లావాదేవీలకు దూరంగా ఉండాలని, లేకుంటే రాబోయే రోజుల్లో మీ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఉద్యోగులు తమ శక్తిని మంచి పనుల కోసం ఉపయోగించాలి. ఇతరుల పనిలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీ పనిపై దృష్టి పెట్టండి. మీ జీవిత భాగస్వామిని అనవసరంగా అనుమానించకుండా ఉండండి. మీ ఈ అలవాటు మీ వైవాహిక జీవితంలోని ఆనందాన్ని గ్రహణం చేస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను ఉంచుకుంటే, అప్పుడు ఎటువంటి సమస్యా ఉండదు. ఆరోగ్యంగా ఉండేందుకు మీ దినచర్యలో యోగా, ధ్యానం చేర్చుకోవాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -24 January 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Saturday, January 22, 2022, 19:22 [IST]
Desktop Bottom Promotion