Latest Updates
-
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
ఆసీస్ ఆటగాళ్లలో టాప్-10 అందమైన భార్యల గురించి మీకు తెలుసా...
ఆస్ట్రేలియా బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న షేన్ వాట్సన్ భార్య పేరు లీ వాట్సన్. వీరిద్దరూ 2010 జూన్ 3వ తేదీ వివాహం చేసుకున్నారు.
ఆసీస్ ఆటగాళ్లంటే క్రికెట్లో ఎంత దూకుడుగా ఉంటారో అందరికీ తెలిసిందే. మైదానంలో అడుగు పెట్టకముందే మైండ్ గేమ్ మొదలుపెడతారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారు పర్సనల్ లైఫ్ లోనూ అలానే ఉంటారా? తమ గ్లామర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారా? హెయిర్ స్టైల్ మరియు డ్రెస్సింగ్ స్టైల్స్ పైనా కేర్ తీసుకుంటారా?

అందరి కంటే తామే అందంగా కనిపించాలని ఆరాటపడతారా? అలాగే తమ భాగస్వాముల విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. క్రికెట్లోనే కాదు.. కపుల్స్ లోనూ బెస్ట్ తామే అనే నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా టాప్-10 ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ల జాబితాను మీ కోసం తీసుకొచ్చాం... ఆ జాబితాపై మీరూ ఓ లుక్కేయండి.

టాప్-10
ఆస్ట్రేలియా బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న షేన్ వాట్సన్ భార్య పేరు లీ వాట్సన్. వీరిద్దరూ 2010 జూన్ 3వ తేదీ వివాహం చేసుకున్నారు. తన భార్యకు ఫ్యాషన్ పట్ల చాలా ఆసక్తి ఉంది. అయితే ఆమె ప్రొఫెషనల్ గా టివి ప్రెజెంటర్.

టాప్ -9
ఆసీస్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన పీటర్ సిడిల్ భార్య పేరు అన్నా వెదర్ లెక్. ఈ ఆటగాడి భార్య ఆరోగ్య మరియు మొక్కల ఆధారిత పోషకాహార నిపుణురాలు. అంతేకాదు జంతు హక్కుల న్యాయవాది, జర్నలిజంలో గ్రాడ్యుయేట్, పర్యావరణ వేత్తగా ప్రముఖ పేరు గడించింది.

టాప్ - 8
ఆసీస్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన నాథన్ బ్రాకెన్ భార్య పేరు హేలీ బ్రాకెన్. తన భార్య ప్రొఫెషనల్ డ్యాన్సర్. అంతేకాదు మోడల్ మరియు హోస్టుగానూ మంచి పేరు తెచ్చుకున్నారు.

టాప్ - 7
ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భార్య పేరు క్యాండిస్ ఫాల్జోన్ . ఆమె ఒక ప్రొఫెషనల్ ఐరన్ వుమన్. వార్నర్ జట్టు నుండి సస్పెండ్ అయినప్పుడు ఆమె అతనికి ఎంతగానో సపోర్ట్ చేసింది. ఆమె చేసిన సహాయంతోనే అతను జట్టులోకి మళ్లీ పునరాగమనం చేయగలిగాడు.

టాప్-6
ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ పేరు సారా లియోనార్డి. ఈమె మెక్ గ్రాత్ యొక్క రెండో భార్య. ఈ ఫాస్ట్ బౌలర్ మొదటి భార్య మరణించడంతో 2010లో ఈ ఇంటీరియర్ డిజైనర్ ను పెళ్లి చేసుకున్నాడు.

టాప్ - 5
షేన్ వార్న్ అంటే ఎంత బెస్ట్ స్పిన్నరో అందరికీ తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక వికెట్లు నేలకూల్చిన వారిలో టాపర్ల లిస్టులో ఇప్పటికీ తన పేరును నిలుపుకున్నాడు. అయితే పర్సనల్ లైఫ్ లోనూ ఈ ఆటగాడు అనేక వికెట్లు పడగొడదామని ప్రయత్నించాడు. అనవసరంగా వివాదాల్లోకి చిక్కుకున్నాడు. ఈ ఆటగాడు రెండు కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునేందుకు ప్రయత్నించాడు. తన మాజీ భార్యలకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఎలిజిబెత్ జెన్ హర్లీతో డేటింగ్ చేస్తున్నాడు.

టాప్ - 4
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ భార్య పేరు కైలీ క్లార్క్. ఈమె ఆ దేశంలో ప్రముఖ మోడల్ మరియు ప్రెజెంటర్. వీరిద్దరూ 2012లో వివాహం చేసుకున్నారు.

టాప్-3
ఆసీస్ జట్టులోని మరో మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్ భార్య పేరు జెస్సికా బ్రాటిచ్. ఈ ఆటగాడి భార్ అందంగా కనిపించడమే కాదు కరాటేలో కూడా మంచి ప్రావీణ్యురాలే. ఈమె కరాటే ఛాంపియన్ 2006లోనే కరాటే విభాగంలో కాంస్య పతకం సాధించింది. అంతేకాదు ఈమె కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉంది. వీరికి రుబికా అనే కుమార్తె కూడా ఉంది. అంతేకాదు ఈమె బిజినెస్ లను కూడా నడుపుతోంది.

టాప్ -2
ఆసీస్ మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హ్యాడిన్ భార్య పేరు కరీనా కోట. ఈ ఆటగాడు 2007లోనే తన ప్రియురాలితో వివాహం చేసుకున్నాడు.

టాప్ - 1
జేమ్స్ ప్యాటిన్ సన్ భార్య పేరు కైలా డిక్సన్. ఈ ఆసీస్ ఆటగాడు కొంత కాలంగా తన ప్రియురాలితో డేటింగ్ చేస్తున్నాడు. త్వరలో తన గర్ల్ ఫ్రెండ్ కు చేతికి రింగు తొడిగి ఒక్కటవ్వబోతున్నారు.
చూశారుగా టాప్-10 ఆసీస్ క్రికెటర్ల భార్యల జాబితాను. మీకు ఈ జాబితాలో ఏ జంట ఇష్టమైనదో... ఎవ్వరి జంట చూడముచ్చటగా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజగలరు.



Click it and Unblock the Notifications
