Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
సెక్సియెస్ట్ ఏషియన్ మెన్ జాబితాలో యంగ్ రెబల్ హీరో ప్ర‘భాస్‘ స్థానం ‘పది‘లం..
బాలీవుడ్ నుండి, క్రికెట్ సెలబ్రిటీల నుండి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఈ జాబితాలో ప్రభాస్ ఒక స్థానాన్ని 'పది'లపరచుకున్నాడు.
ఇంతవరకు ఏ తెలుగు హీరో సాధించని రికార్డు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు. బాహూబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎలా అయితే రికార్డులు బద్దలుకొట్టాడో.. అలాగే తన నిజ జీవితంలోనూ ఈ ఏడాది సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. బ్రిటీష్ న్యూస్ వీక్లీ ఈస్టర్న్ ఐ ఎడిషన్ వార్షిక 'సెక్సియెస్ట్ ఏషియన్ మేల్' కేటగిరిలో టాప్-10లో స్థానం సంపాదించాడు.

ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానుల ఓట్ల ఆధారంగా ఈ ర్యాంకింగులు కేటాయించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుండి, క్రికెట్ సెలబ్రిటీల నుండి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఈ జాబితాలో ప్రభాస్ ఒక స్థానాన్ని 'పది'లపరచుకున్నాడు. ఇంతకీ ఈ జాబితాలో ఇంకా ఎవరెవరికీ చోటు లభించింది. ఏయే ప్రముఖులు ఉన్నారో మీరే చూడండి...
దక్షిణాది నుండి దమ్మున్న హీరో..
'బాహూబలి' తర్వాత ప్రభాస్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయింది. ఈ హీరోపై జనాదరణ దక్షిణాదితో పాటు మన దేశ సరిహద్దులు కూడా దాటింది. హిందీలోనూ ఇటీవల విడుదల అయిన 'సాహో' సినిమా విజయం సాధించడం కూడా ఒక కారణం. మన దక్షిణాది దిగ్జజాలను కాదని బ్యాంకాక్ లోని ప్రసిద్ధ టుస్సాడ్స్ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే ఆయనపై అభిమానం ఏ రేంజ్ లో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

నెంబర్ వన్ హృతిక్ రోషన్...
గత పదేళ్లుగా ఓవరాల్ ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో ఉండటంతో రోషన్ డబుల్ విక్టరీ సాధించాడు. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ ‘‘నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను మరోసారి టాపర్ గా నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనిని నేను ‘సాధన‘గా చూడలేదు. ఒక వ్యక్తి యొక్క రూపాలు పలు విషయాలలో సంబంధం లేకుండా ఉంటాయి. ప్రజలను వారు చూసే తీరును బట్టి నేను తీర్పు చెెప్పలేను. అదేవిధంగా చూసే తీరును బట్టి నాకు నేను తీర్పు చెప్పుకోను‘‘ అని అన్నాడు.

విరాట్ కోహ్లీ...
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్స్ నుండి పోటీని తట్టుకుని టాప్ -10లో ప్లేస్ కన్ఫార్మ్ చేసుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ తో మ్యాచ్ లో బిజీగా ఉన్న ఈ కింగ్ కెప్టెన్ కోహ్లీ ఈ వార్త విని తెగ సంతోషపడ్డారట. ఈ ఉత్సాహంలోనే విండీస్ తో తొలి ట20 మ్యాచ్ లో ఒంటి చేత్తో భారీ స్కోరును అలవోకగా ఛేదించారు.

షాహిద్ కపూర్..
హృతిక్ రోషన్ టాప్ ప్లేసులో నిలవగా... మరో బాలీవుడ్ నటుడు, అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించిన హీరో షాహిద్ కుమార్ సెకండ్ ప్లేసులో నిలిచాడు. ఈ హీరో పద్మావత్ సినిమా నుండి అర్జున్ రెడ్డి వరకు తన బాడీని సిక్స్ ప్యాక్ కోసం సిద్ధం చేసుకుని అందంగా కనిపించాడు. ఈ కారణంగానే అతనికి రెండో స్థానం లభించింది.

వివియన్ ద్సేనా..
రోషన్, షాహిద్ తర్వాత మరో టివీ స్టార్ వివియన్ ద్సేనా మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇతను ‘సెక్సీయెస్ట్ ఏషియన్ మెన్ ఆఫ్ ద డికెడ్‘ నాలుగో స్థానంలో నిలిచాడు.

టైగర్...
మరో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రఫ్ నాలుగో స్థానాన్ని సాధించాడు. ఈ నటుడు హెరోపంటిలో తొలిసారిగా అడుగుపెట్టాడు. ఈయన తండ్రి జాకీ ష్రఫ్ లాగే మృదువుగా మాట్లాడేవాడు. ‘సవాళ్లు లేనట్లయితే, నేను ప్రతిసారీ నన్ను మెరుగుపరచుకోలేను‘ అని ఎప్పుడూ చెబుతుంటాడు.

సింగర్ మాలిక్..
యుకెకు చెందిన సింగర్ జ్యాన్ మాలిక్ కు ఐదో స్థానం లభించింది. ఈ గాయకుడు సోలోగా ఎన్నో బెస్ట్ పర్మార్ఫెన్సులు ఇచ్చాడు. తన తొలి స్టూడియో ఆల్బమ్ ‘మైండ్ ఆఫ్ మైన్‘ బాగా పాపులర్ అయ్యింది.

హర్షద్ చోప్డా...
ఇక మరో బాలీవుడ్ నటుడు సిక్సర్ కొట్టాడు. ఈ సందర్భంగా ఈ నటుడు స్పందిస్తూ సోషల్ మీడియాలోని తన అభిమానులందరికీ రుణపడి ఉంటానని చెప్పాడు. దీంతో అతని అభిమానులు ఎంతగానో సంతోషించారు.

బిలాల్ అష్రఫ్..
మరో నటుడు ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ హీరో కూడా ట్విట్టర్లో స్పందించాడు. ‘మీరు ఎవరో గర్వపడండి.. ఇతరులు మిమ్మల్ని ఎలా చూసినా మీరు సిగ్గుపడకండి‘ అని చెప్పాడు.

మొహ్సిన్ ఖాన్..
మరో టెలివిజన్ నటుడు ఎనిమిదో స్థానాన్ని సాధించాడు. ఇతను తన సహ నటి శివంగి జోషితో ఉన్న ఎఫైర్స్ వల్ల వార్తల్లో నిలిచి బాగా పాపులర్ అయ్యాడు.



Click it and Unblock the Notifications