Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
Venus Transit in Gemini on 28 May 2021:శుక్రుడు మిధునంలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారు జాగ్రత్త...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క గ్రహం ప్రతి నెల తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరంలో మే 28వ తేదీన రాత్రి 11:44 గంటలకు శుక్రుడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇదే రాశిలో 2021, జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ఏడు నిమిషాల వరకు నివాసం ఉండనున్నాడు.

ఆ తర్వాత కర్కాటక రాశిలోకి రవాణా చేయనున్నాడు. శుక్రుని అనుగ్రహం ఉంటే వైవాహిక జీవితం, కళా రంగంలో, సంగీతం, వినోద రంగంలో ప్రయోజనాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో శుక్రుడి రవాణా వల్ల ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడనుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పని రంగంలో మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో మీరు చాలా ఉత్సాహంగా పని చేస్తారు. దీంతో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులకు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈ సమయం మంచిగా ఉంటుంది.

వృషభ రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ కాలంలో మీరు లావాదేవీలు చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త వాహనం లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేయొచ్చు. ఉద్యోగులు మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో ఎవ్వరినీ నమ్మకండి. మీ ప్రేమ జీవితంలో సమయం అనుకూలంగా ఉంటుంది.

మిధున రాశి..
శుక్రుడు వృషభరాశి నుండి ఈ రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశిపై సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో మీరు సమాజంలో గౌరవం పొందుతారు. ఉద్యోగులకు మరియు వ్యాపారవేత్తలకు ఈ కాలంలో మంచి ప్రయోజనాలు వస్తాయి. విద్యార్థులు ఈ సమయంలో సరైన ఫలితాలను పొందుతారు. ఒంటరిగా ఉండే వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఈ సమయం మీకు చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల ప్రతికూలంగా ఉంటుంది. మీకు ఆర్థిక పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి.

సింహ రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు వస్తాయి. అయితే మీరు చేసే ప్రయత్నంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీకు విజయం దక్కుతుంది. మరోవైపు ఆర్థిక పరంగా చాలా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండటం మరచిపోవద్దు.

కన్య రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ గురించి శుభవార్త వినొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీకు కుటుంబంతో గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ వివాహ జీవితంలో సమయం మంచిగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య సంబంధం మరింత బలంగా ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి సంచారం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఉద్యోగులకు కార్యాలయంలో పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. పెండింగ్ పనులను కూడా పూర్తి చేసేస్తారు. వ్యాపారులకు ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒంటరిగా ఉండే వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల వైవాహిక జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులుంటాయి. కాబట్టి మీరు మీ సంబంధానికి మంచి సమయం ఇవ్వాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మంచిగానే ఉంటుంది. అయితే మీరు బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయకండి. మరోవైపు ఈ సమయంలో మీ శత్రువులు చాలా చురుకుగా ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

ధనస్సు రాశి..
శుక్రుడు వృషభరాశి నుండి మిధునరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈ కాలంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ వైవాహిక జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మరోవైపు మీ కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అయితే మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

మకర రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. కాబట్టి మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి.

కుంభ రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల మంచిగా ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో పనితీరు చాలా మంచిగా ఉంటుంది. వ్యాపారులు కూడా ఈ కాలంలో మంచి లాభాలను పొందుతారు. విద్యార్థులు కొంచెం కష్టపడితే.. మంచి విజయాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ సమయం మీ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

మీన రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు. ఉద్యోగులు మరియు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు విజయం సాధించడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీరు మంచి ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. మీరు ప్రారంభంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండాలి. లేకపోతే మీరు నష్టపోవాల్సి ఉంటుంది. రొమాన్స్ విషయంలో ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
