For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిగ్గదీసి అడగండి.. అవినీతిని అట్టడుగుకు తొక్కి పడేయండి...

|

'' నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని.. మారదు లోకం మారదు కాలం.. దేవుడు దిగి రాని ఎవ్వరు ఏమై పోని'' అని సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాట వింటే ఎవ్వరికైనా అవినీతికి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని అనిపిస్తుంది. ఆ పాట విన్నప్పుడంతా యువతలో రొమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాగే ఠాగూర్ సినిమాలో అవినీతికి వ్యతిరేకంగా మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ లు అందరికీ బాగానే గుర్తుండే ఉంటాయి. ''ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. ఆ హక్కుని లంచంతో కొనకండి'' అనే డైలాగ్ అందరికీ ఇప్పటికీ బాగానే గుర్తుండే ఉంటుంది. ఇవే కాదు అవినీతికి వ్యతిరేకంగా భారతీయుడుతో పాటు ఇంకా ఎన్నో సినిమాలు వచ్చాయి.

సాధారణంగా మన దేశంలో ప్రజలు సినిమాలకు ప్రభావితం అవుతారంటారు. కానీ ఇలాంటి మంచి సినిమాలు తీస్తే మాత్రం అప్పటిదాకా అందరూ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ తమ దాకా వస్తే మాత్రం అవినీతి చేసేస్తుంటారు. లంచాలు ఇచ్చేస్తుంటారు. మన సమాజంతో పాటు దేశంలో చాలా మంది అవినీతిపరులను పెంచి పోషించడం వల్లే మన దేశం ఇంకా పురోగమించడం లేదు. దీనంతటికి కారణం ప్రజల్లో అవినీతి నిర్మూలన, లంచం ఇవ్వకూడదన్న దానిపై అవగాహన తక్కువగా ఉండటం. అందుకే ఐక్య రాజ్య సమితి సర్వసభ్యసమావేశం 2003 అక్టోబర్ 31న అవినీతికి వ్యతిరేకంగా ఒక రోజును కేటాయించాలని నిర్ణయించింది. అదే డిసెంబర్ 9వ తేదీ. ఈరోజున అవినీతి నిరోధక దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా అవినీతి వల్ల జరిగే ప్రతికూలతలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టింది. అలాగే యువతకు అవినీతికి వ్యతిరేకంగా కొన్ని మార్గదర్శకాలు కూడా చేసింది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పారదర్శకతతో వేగంగా పనులు..

పారదర్శకతతో వేగంగా పనులు..

PC : Twitter

ఏ దేశంలో అయినా పారదర్శకత(ట్రాన్స్ పరెన్సీ)తోనే సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి ఆటంకం అనేది ఉండదు. అవినీతి ఉన్నచోట అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. అందుకే అవినీతిపరులపై చర్యలు తీసుకోవడానికి మరియు అవినీతికి వ్యతిరేకంగా పారదర్శకత కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అవినీతితో ప్రమాదం..

అవినీతితో ప్రమాదం..

మన దేశమే కాకుండా ప్రపంచంలో ఏర్పాటైన ప్రభుత్వాలు అన్నీ డబ్బును ఖర్చు చేయడానికి పెద్ద మొత్తంలో ప్రజా ధనాన్ని కలిగి ఉంటాయి. ఇది తీవ్రమైన అవినీతి ప్రమాదాన్ని కలిగి స్తుంది. అందుకే ప్రభుత్వ వ్యయంపై ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ నిఘా ఉంచాలి. ప్రజల నుండి ఎన్ని పన్నులు వస్తున్నాయి.. ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేస్తున్నాయనే దానిపై నిఘా ఉంచాలి. ఇందుకోసం సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవాలి. ఏవైనా దుర్వినియోగాలు జరిగితే వెంటనే బహిర్గతం చేసేందుకు మీరు సిద్ధంగా ఉండాలి.

తగిన సమయంలో పరిష్కారం.

తగిన సమయంలో పరిష్కారం.

మనలో చాలా మందికి ప్రభుత్వం లేదా అంది అందించే సేవల గురించి మంచి అభిప్రాయమే లేదు. కానీ వారు తమ అభిప్రాయాలను ఫిర్యాదులుగా మార్చరు. ఒకవేళ ఫిర్యాదు చేసినా అందుకు సంబంధించి సమాధానం వచ్చేంత వరకు కూడా ఓపిక పట్టారు. అయితే ప్రస్తుతం మారిన చట్టాల ప్రకారం మీరు చేసిన ఫిర్యాదుకు తగినంత సమయంలోపు పరిష్కారం దక్కుతుంది. ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు.

టెక్నాలజీ వాడుకోవాలి..

టెక్నాలజీ వాడుకోవాలి..

PC : Twitter

మీరు ఈరోజుల్లో అవినీతిని నిర్మూలించేందుకు టెక్నాలజీని బాగా వాడుకోవాలి. టెక్ నాలెడ్జ్ ఉన్నవారు వెబ్ లో లేదా మొబైల్ లో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఉపయోగించుకోవాలి. అవినీతి కేసులను డాక్యుమెంట్ చేయడానికి ఇది మీకు సహాయపడొచ్చు. ఈరోజుల్లో సోషల్ మీడియా ముఖ్యంగా అవినీతి పరిష్కరించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం.

కామిక్స్ అండ్ కార్టూన్స్..

కామిక్స్ అండ్ కార్టూన్స్..

అవినీతి నిరోధకత గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు కామిక్స్ ఒక శక్తివంతమైన మార్గం. సినిమాలు మరియు వచనాల కలయిక ద్వారా కామిక్స్ కూడా అవినీతికి వ్యతిరేకంగా చర్చకు సహాయపడతాయి. వీటిని ఉత్పత్తి చేయడం చాలా సులభం. ఇందుకు కావాల్సింది కేవలం పెన్ను కాగితం మాత్రమే. ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ను సైతం చక్కగా ఉపయోగించుకోవచ్చు.

అవినీతి నిర్మూలనే లక్ష్యం..

అవినీతి నిర్మూలనే లక్ష్యం..

యువజన సంఘాలు అవినీతిని నిరాకరించడాన్ని చాలా చురుకుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వీటి వల్ల ముందుగా స్థానికంగా, తర్వాత జాతీయ స్థాయిలో అందరికీ అవినీతి నిరోధంపై అవగాహన కలుగుతుంది. అయితే వేర్వేరు గ్రూపులకు వేర్వేరు లక్ష్యాలు ఉన్నప్పటికీ, వారి ఉమ్మడి లక్ష్యం అవినీతి నిర్మూలన అనే ఒక్కటే ఉండాలి.

English summary

Ways young people can fight corruption

Can any thing be done? In this essay we offer a new idea: the formation of an institution called the "business community institution"(BCI). We first highlight some cross-country evidence on fighting corruption. That helps us derive the critical features of the BCI, which should make it more successful than efforts made so far.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more