Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పెసర రొట్టె..బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎందులో అయినా సూపర్!
ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహం ఉన్నవారికి పెసర రొట్టె ఒక అద్భుతమైన ఆహారం. మన దైనందిన ఆహారంలో ప్రొటీన్, ఫైబర్ (పీచు పదార్థం) తగినంత మోతాదులో ఉండటం చాలా ముఖ్యం. ఇవి రెండూ పుష్కలంగా లభించే పెసలతో చేసే ఈ రొట్టె రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీనిని బ్రేక్ ఫాస్ట్ లోకి అయినా లేదా స్నాక్ గా లేదా డిన్నర్ లోకి అయినా తినవచ్చు. రోజూ తినే ఇడ్లీ, దోశలకు బదులుగా వారంలో రెండు రోజులు ఈ పెసర రొట్టెలను మీ డైట్‌లో చేర్చుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

పెసర రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసలు (పొట్టుతో ఉన్నవి
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-అల్లం
-జీలకర్ర
-కొత్తిమీర
-పుదీనా
-కరివేపాకు
-ఉప్పు
-పసుపు
-క్యారెట్
-పాలకూర
-ఇంగువ
-జొన్న పిండి
-రాగి పిండి
-నూనె లేదా నెయ్యి

పెసర రొట్టె తయారీ విధానం
-ముందుగా అరకప్పు పెసర్లను(green gram)తీసుకొని 2 సార్లు నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో నీళ్లు పోసి 8 గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి.
-తర్వాత మళ్లీ ఒకసారి కడిగి నీటిని వంపేసి పెసరపప్పుని మిక్సీ జార్ లో వేసుకోండి. ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయ పెద్ద ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 టీస్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు కూడా వేసి ఈ మొత్తాన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
-మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్ గా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే 1 చిన్న క్యారెట్ సన్నని తురుము, 1 చిన్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 1 కట్ట పాలకూర, రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ ఇంగువ కూడా వేసి అన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి.
-ఇప్పుడు అందులో అరకప్పు జొన్న పిండి, అరకప్పు రాగి పిండి, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి మొత్తం బాగా కలుపుకోండి. ఇందులో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. రొట్టె చేయడానికి వీలుగా ఉండేలా పిండిని కలుపుకోండి.
-ఇప్పుడు ఒక కాటన్ గుడ్డ లేదా కర్చీఫ్ అయినా తీసుకొని నీటితో తడిపి గట్టిగా పిండేసేయాలి.
-ఇప్పుడు చేతిని నీటిలో తడుపుకొని పిండి మిశ్రమాన్ని కొంత తీసుకొని కాటన్ గుడ్డపై పెట్టి పల్చగా వత్తుకోవాలి. మధ్య మధ్యలో చేతిని తడుపుకుంటుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. పల్చగా వత్తుకుంటే త్వరగా కాలుతుంది, లోపల కూడా చక్కగా ఉడుకుతుంది.
-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి లేదా నూనె వేసి పెనం అంతా రుద్ది దానీమీద వత్తుకున్న రొట్టెను వేసి తక్కువ, మీడియం మంట మీద కాల్చుకోవాలి. రెండువైపులా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోండి. మిగిలిన పిండితో కూడా ఇలా చేసుకోండి.
-అంతే పెసర రొట్టె రెడీ. వీటిని ఎలాంటి చట్నీ లేకుండానే తినేయొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications