Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహు, కేతువులు ఏ స్థానంలో ఉంటే లాభమో తెలుసా...!
రాహు, కేతువులు ఎవరికి, ఎక్కడ ఉంటే లక్ కలసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం నవ గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహం ప్రతి నెల తమ ప్రస్తుత స్థానాలను వదిలి మరో స్థానంలోకి మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో రాహు-కేతువులు ఇటీవల తమ స్థానాలను మార్చుకున్నాయి.

అయితే వీటి స్థానాలు మారడం వల్ల భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాలపై తీవ్ర ప్రభావమే పడనుంది. చాలా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అందుకే రాహు-కేతువు గ్రహాలను చెడు గ్రహాలుగా భావిస్తారు. వీటి ప్రభావం వల్ల కరోనా వంటి మహమ్మారి మరింతగా పెచ్చరిల్లే ప్రమాదముందని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు.

అంతటి పవర్ ఫుల్ అయిన ఈ గ్రహాలు మన జాతకంలో ఏ స్థానంలో సానుకూల ఫలితాలొస్తాయి.. ఏ స్థానంలో ప్రతికూల ఫలితాలొస్తాయి.. వీటి వల్ల ఏర్పడే ప్రమాదాల నివారణకు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

మూడో స్థానంలో ఉంటే..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయినా రాహు-కేతువులు మూడో స్థానంలో ఉంటే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ స్థానం శక్తిని సూచిస్తుంది. దీని వల్ల మీరు జీవితాన్ని ఆనందంగా.. హాయిగా గడుపుతారు. మీ జాతక బలం కారణంగా మీ లైఫ్ లో మీరు ప్రత్యేక స్థానాన్ని కూడా పొందొచ్చు. అంతేకాదండోయ్.. మీరు ఎక్కువగా స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

ఆరో స్థానంలో ఉంటే..
ఎవరి జాతకంలో రాహు-కేతువులు ఆరో స్థానంలో ఉంటే వారు చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. దీని ఫలితంగా మీకు ప్రత్యర్థుల నుండి ఎలాంటి నష్టం ఉండదు. మీరు మీ శక్తిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకుంటారు. అంతేకాదండోయ్.. మీరు ప్రతి ప్రయత్నంలోనూ విజయాన్ని సాధిస్తారు. మీరు కీలకమైన సమయాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు కేసుల వంటి వాటిలో సులభంగా విజయం సాధిస్తారు. అయితే మీరు ఆర్థిక లావాదేవీల వంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

పదో స్థానంలో ఉంటే..
ఎవరి జాతకంలో అయినా రాహు-కేతువులు పదో స్థానంలో ఉంటే.. అలాంటి వారు వారు ఎంచుకున్న రంగాల్లో మంచి పురోగతి సాధిస్తారు. ప్రతి విషయంలోనూ విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తులు ఎక్కువగా రాజకీయాల్లో, ప్రభుత్వ రంగాలలో మంచి పేరు, ప్రతిష్టలను సంపాదిస్తారు. అంతేకాదు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అయితే ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం కఠినంగా వ్యవహరిస్తారు. కానీ సంపదను సేవ్ చేయడంలో మాత్రం విజయవంతం అవుతారు. అలాగే ఏ పనినైనా కష్టపడి పూర్తి చేసి, దానికి తగ్గ ఫలితాలను పొందుతారు.

11 స్థానంలో ఉంటే..
రాహు-కేతువులు ఎవరి జాతకంలో అయితే 11 స్థానంలో ఉంటే, వారందరికీ సానుకూలమైన ఫలితాలు వస్తాయి. వీరికి ఈ గ్రహాల ప్రభావం సానుకూలంగా ఉండటం వల్ల.. మీ ఆదాయం డబుల్ అవుతుంది. మీరు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఈ గ్రహాల శుభప్రదమైన ప్రభావాల కారణంగా మీరు ఎందులో అయినా పెట్టుబడి పెడితే మంచి ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదు ఆర్థిక సమస్యల నుండి చాలా త్వరగా రిలీఫ్ లభిస్తుంది.

12వ స్థానంలో ఉంటే..
ఎవరి జాతకంలో అయినా రాహు-కేతువులు 12వ స్థానంలో ఉంటే, ఆ వ్యక్తులకు జీవితంలో ప్రత్యేక ప్రయోజనాలు దక్కుతాయి. వీరు ఏ పని చేసిన మంచి కీర్తిని పొందుతారు. వీరు చేసిన మంచి పనుల వల్ల వీరికి మరణం తర్వాత కచ్చితంగా మోక్షం లభించవచ్చు. సంపదపరంగా మీరు విజయాన్ని అందుకుంటారు. అయితే కొన్నిసార్లు కొందరిని మీరు ఎక్కువగా అనుమానించేందుకు ప్రయత్నిస్తారు. అలాగే, మీ లైఫ్ లో కొందరు వ్యక్తులు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు.



Click it and Unblock the Notifications