Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
Valentine Day :న్యూమరాలజీ ప్రకారం, ఈ ఏడాది వాలెంటైన్స్ డే ఎంత రొమాంటిక్ గా ఉంటుందో తెలుసుకోవచ్చు...!
న్యూమరాలజీ ప్రకారం, వాలెంటైన్ డే మీ గురించి ఏమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
మనలో ఒక్కొక్కరికి ఒక్కోదానిపై నమ్మకం ఉంటుంది. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. చాలా మంది జ్యోతిష్యశాస్త్రాన్ని.. జాతకాలను.. నమ్ముతూనే ఉన్నారు.

అదే విధంగా న్యూమరాలజీని కూడా ఎక్కువగా పరిగణనలోని తీసుకుంటున్నారు. ఎందుకంటే నెంబర్లు మన జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దీన్ని బట్టి నెంబర్లు మన జీవితంలోని అనేక విషయాలపై ప్రభావం చూపుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా న్యూమరాలజీ ప్రకారం, ఈ ఏడాది వాలెంటైన్స్ డే మీకెంత ప్రత్యేకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

నెంబర్ #9
2021 సంవత్సరంలో వాలెంటైన్స్ డే రోజు మీకు చాలా రొమాంటిక్ గా ఉంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తి నుండి మీరు ప్రేమ ప్రతిపాదన పొందొచ్చు. మీరు ఒకరిని ప్రతిపాదించినట్లయితే, మీకు సానుకూల సమాధానం లభిస్తుంది. భార్యభర్తల సంబంధం బలంగా ఉంటుంది. మీరు ఈ ప్రత్యేకరోజున మీ పార్ట్ నర్ తో చాలా సన్నిహితంగా గడుపుతారు.

నెంబర్ #8
ఈ వాలెంటైన్స్ డే సమయంలో మీకు చాలా నిరాశ ఎదురవుతుంది. మీరు ఎవరి ముందైనా ప్రేమ ప్రతిపాదన పెడితే, మీకు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మరోవైపు మీరు ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉంటే మీ మధ్య అపార్థాలు పెరుగుతాయి. వివాహితులకు ఈ సమయం సాధారణంగా ఉంటుంది.

నెంబర్ #7
2021 ఏడాదిలో కొన్ని కారణాల వల్ల మీ ప్రేమ భాగస్వామితో మీ సంబంధం విచ్ఛిన్నమైతే, మీ మధ్య ఉన్న అపొహలన్నీ ప్రేమికుల దినోత్సవం రోజు తొలగించబడతాయి. మీ మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. మీరు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. వివాహితులకు ఈ సమయంలో మానసిక స్థితి చాలా బాగుంటుంది. రొమాంటిక్ గా కూడా ఉంటుంది. మీ యొక్క కొన్ని ముఖ్యమైన కోరికలను కూడా నెరవేరొచ్చు.

నెంబర్ #6
2021 సంవత్సరంలో ఒంటరిగా ఉండేవారు ప్రేమికుల దినోత్సవం నాడు కచ్చితంగా ప్రేమను కనుగొంటారు. మీరు ఇప్పటికే ప్రేమ బంధంలో ఉంటే.. మీ భాగస్వాములు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో, వాలెంటైన్స్ డే వివాహిత జంటలకు ఒత్తిడిని కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఉండొచ్చు.

నెంబర్ #5
2021లో ఈ వాలెంటైన్స్ డే మీకు ప్రతికూలంగా ఉండొచ్చు. కొన్ని కారణాల వల్ల మీ ప్రేమ సంబంధంలో దూరం పెరుగుతుంది. అయితే మీరు ఆ సమయంలో తెలివితేటలతో సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. వివాహితులకు ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు మీకు ఇష్టమైన బహుమతిని మీ జీవిత భాగస్వామి నుండొ పొందొచ్చు.

నెంబర్ #4
మీ ప్రేమ జీవితంలో రిలేషన్ షిప్ మరింత బలంగా ఉంటుంది. మీరు ఒకరికొకరు పూర్తిగా అంకితభావంతో ఉంటారు. వాలెంటైన్స్ డే రోజున ప్రేమికులు తమ బంధాన్ని మరింత బలపరచుకుంటారు. ప్రేమికుల దినోత్సవం నాడు సాయంత్రం రోజున మీకు చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అయితే వివాహితులకు మాత్రం ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని విస్మరిస్తున్నారని మీకు అనిపిస్తుంది.

నెంబర్ #3
2021 సంవత్సరంలో ఒంటరిగా ఉన్నవారికి ప్రేమ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ఈరోజున మీరు నిజమైన ప్రేమను కనుగొనవచ్చు. వివాహితులకు ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ భాగస్వామి మీకోసం ప్రత్యేకమైన మరియు భిన్నమైన ప్రణాళికతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు.

నెంబర్ #2
మీ బర్డ్ డే ప్రకారం, రెండో నెంబర్ వస్తే.. మీ రొమాంటిక్ లైఫ్ లో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని వల్ల మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు మీ ప్రేమలో విజయం సాధిస్తారు. ఆరెంజ్, రోజ్ వంటి కలర్లు మీకు కలిసి వస్తాయి. మీ ప్రేయసి/ప్రియుడిని ఒప్పించేందుకు మీరు వారికి ఆరెంజ్ లేదా గులాబీ పువ్వులను ఇస్తారు. వివాహిత జంటలకు సైతం ఈ సమయంలో ఆనందం పెరుగుతుంది.

నెంబర్ #1
మీ బర్త్ డేను బట్టి ఒకటో నెంబరు వచ్చే వారికి వాలెంటైన్స్ డే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజున మీరు మీ పార్ట్ నర్ తో చాలా రొమాంటిక్ గా గడుపుతారు. మీరు ఒకరితో ఒకరు కలిసి మధురమైన క్షణాలను ఆనందిస్తారు. మీరు మీ భావాలను ఒకరినొకరు బహిరంగంగా వ్యక్తపరచగలరు. మీరిద్దరూ ఆ రోజున సరదాగా ఎక్కడైనా మంచి ప్రదేశానికి వెళ్లొచ్చు. వివాహితులకు కూడా ఈరోజు చాలా సరదాగా ఉంటుంది.



Click it and Unblock the Notifications