Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
zodiac signs:ఏ రాశుల వారికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారంటే...!
ఈ రాశుల వారికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారట. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి.
ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి బంధువులు, మిత్రులు, సన్నిహితులు ఉంటారు. అయితే వీరితో పాటు ప్రతి ఒక్కరికీ శత్రువులు కూడా కచ్చితంగా ఉంటారు. కొన్నిసార్లు మనం చేసిన పొరపాట్ల నుండి మనకు ప్రత్యర్థులు తయారవుతూ ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో మనకు తెలిసో.. తెలియక చేసిన తప్పుల వల్ల కూడా శత్రువులు పుట్టుకొస్తుంటారు.

అయితే కొందరు వ్యక్తులు మనం చేసిన తప్పులను, పొరపాట్లను లైట్ తీసుకుంటారు. వారి పెద్ద మనసుతో మనల్ని క్షమిస్తుంటారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం మనం ఏ చిన్న తప్పు చేసినా.. దాన్ని భూతద్దంలో చూస్తూ ఉంటారు.

అలాంటి విషయాలను మనసుల పెట్టుకుని.. మనపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు మనల్ని అనునిత్యం శత్రువులుగా ఊహించుకుంటూ ఉంటారు. అంతటితో ఆగకుండా మనల్ని ఎప్పుడు దెబ్బ కొడదామా అని కాచుకుని కూర్చుంటారు. అయితే అలాంటి వ్యక్తులను కనిపెట్టడం కొంచెం కష్టమే.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారు ఎదుటి వ్యక్తులు చేసిన తప్పులను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారట. అలా వాటిని మరచిపోకుండా పొరపాట్లు చేసిన వ్యక్తులను శత్రువులుగా పరిగణిస్తారట. వారు చేసిన తప్పులు, పొరపాట్లను అస్సలు మరచిపోరట. వీరు ఎదుటి వ్యక్తులను క్షమించడం అనేది జీవితంలోనే జరగదట. ఇంతకీ ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు తమ చుట్టూ ఉండే వ్యక్తులు ఏ చిన్న పొరపాటు చేసినా, వాటిని భూతద్దంలో పెట్టి చూస్తుంటారట. ఇలాంటి స్వభావం కారణంగా వీరికి శత్రువులు పెరిగిపోతారంట. వీరిని చూసి ఎదుటి వ్యక్తులు అసూయపడతారంట. వీరు చిన్న తప్పులను కూడా నలుగురిలో వేలెత్తి చూపడం వల్ల వీరు అందరికీ దూరమైపోతూ ఉంటారట. మరోవైపు వీరు అందరి కంటే బలవంతులమని భావిస్తూ ఉంటారట.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు ఒక్కో సందర్భంలో ఒక్కో మాదిరిగా ప్రవర్తిస్తారట. కొన్నిసార్లు వీరు చాలా భావోద్వేగంగా మాట్లాడతారంట. మరి కొన్నిసార్లు అన్ని విషయాల్లో అందరిపై ఆధిపత్యం చెలాయించాలని భావిస్తారట. వీరు అందరిపై అజమాయిషీ చెలాయిస్తూ తమలో తాము సంతోష పడతారట. ఈ నేపథ్యంలో వీరికి కూడా శత్రువులు క్రమంగా పెరిగిపోతుంటారట.

సింహ రాశి..
ఈ రాశి వారు సాధారణంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వీరు కొత్త వ్యక్తులను సులభంగా నమ్ముతూ ఉంటారు. అయితే వీరిని ఎవరైనా మోసం చేసినా.. లేదా వీరి విషయంలో ఏదైనా తప్పు జరిగినా వీరు అస్సలు తట్టుకోలేరట. అంతేకాదు అలాంటి వారిని జీవితంలో అస్సలు క్షమించరట. అలాంటి వ్యక్తులపై ద్వేషం పెంచుకుంటారట. వారిపై ప్రతీకారం కూడా తీర్చుకోవాలని ప్రయత్నిస్తారట. ఇలా వీరు కూడా తమ శత్రువులను పెంచుకుంటూ పోతారట.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు ఎక్కువగా ప్రతికూల ఆలోచనలు చేస్తుంటారట. ఈ రాశి వారిలో చాలా మంది చిన్నప్పటి నుండే అబద్ధాలు చెప్పడం అలవాటుగా మార్చుకుంటారట. ఈ నేపథ్యంలోనే ఎదుటి వ్యక్తులు ఏదైనా తప్పు చేస్తే.. పొరపాటు చేస్తే వారిపై కోపం, ద్వేషం పెంచుకుంటూ పోతారంట. వారిని ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామా అని భావిస్తూ ఉంటారట. అయితే అలా అందరికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ.. చివరికి వీరి జీవితాన్నే చేతులారా చెడగొట్టుకుంటారట.

మకర రాశి...
ఈ రాశి వారికి పుట్టినప్పటి నుండి శత్రువులు ఎక్కువగా ఉంటారట. అయితే వీరు ఎక్కువగా మోసానికి గురవుతూ ఉంటారు. దీంతో ఇతరులపై ఎక్కువగా ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. అయితే వీరు ప్రేమగా ఉన్నంత వరకూ అందరితో చాలా బాగుంటారు. కానీ వీరు ఎవరిపై అయితే ద్వేషం పెంచుకుంటారో.. వారిని శత్రువులుగా భావిస్తారు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటారు.



Click it and Unblock the Notifications