Latest Updates
-
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే!
children's day 2021 :భారత్ లో బాలల దినోత్సవం నవంబర్ 14నే ఎందుకు జరుపుకుంటారంటే...
నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని నవంబర్ 20వ తేదీన జరుపుకుంటారు. కానీ మన దేశంలో మాత్రం దాని కంటే ఆరు రోజులు ముందుగానే అంటే నవంబర్ 14వ తేదీన, నెహ్రు పుట్టినరోజున చిల్డ్రన్స్ డేను జరుపుకుంటాం.

ఈరోజంటే చిన్నపిల్లలందరికీ ఎంతగానో ఇష్టం. ఈరోజే కాదు.. ఈ నవంబర్ నెల మొత్తం బాలలు ఎంతగానో ఇష్టపడతారు. ఎందుకంటే ఈ నెలలో బాలల కోసం ప్రత్యేక చిత్రాలు.. ప్రత్యేక ఎగ్జిబిషన్ తో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

మన దేశంలోని పిల్లలంతా ఉత్సాహంగా ఉండే నెల ఏదైనా ఉందంటే అది నవంబర్ నెల అని అందరూ చెబుతారు. అయితే పండిట్ జవహార్ లాల్ నెహ్రు పుట్టినరోజును బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు.. ప్రపంచంలోని ఇతర దేశాలు నవంబర్ 20 తేదీన జరుపుకంటే.. మనం మాత్రమే ముందుగా ఎందుకు జరుపకుంటాం.. దీని వెనుక కారణాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పిల్లలే భవితగా..
మన దేశంలో నేటి బాలలే రేపటి పౌరులు అని భారత తొలి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ గాఢంగా నమ్మారు. పిల్లలు భావి భారత భవిష్యత్తు పౌరులు అని విశ్వసించారు. వారందరి అభివృద్ధి మన బాధ్యత అని తెలిపారు.

పిల్లల కోసం..
భారత దేశ తొలి ప్రధానమంత్రిగా విశేష సేవలు అందించిన జవహార్ లాల్ నెహ్రూ 1964లో మరణించిన తర్వాత, అతడు జన్మించిన రోజును అతను ప్రేమించిన వ్యక్తుల కోసం కేటాయించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ఆయన పుట్టినరోజును నవంబర్ 14వ తేదీన పిల్లలకు అంకితం చేయబడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మన దేశంలో నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు.

ప్రతి బిడ్డకు పోషకాలు..
మన దేశాన్ని ఇంటిగా భావిస్తే.. దాన్ని అందంగా నిర్మించాలంటే పిల్లలే ప్రధాన పిల్లర్లు అని అందరూ గుర్తించాలి. ఎందుకంటే పిల్లర్లు, ఇటుకలతోనే భవనం అందంగా రూపుదిద్దుకుంటుంది. అలాగే దేశంలోని సంస్కృతి, కళ, సాహిత్యం, సాంప్రదాయాలు మనుగడ సాగించాలంటే, ప్రతి వయోజన పిల్లవాడు సజీవంగా ఉండాలి. ప్రతి బిడ్డకు ఉత్తమ పోషక పునాది అందేలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు క్రుషి చేయాలని కోరారు.

ప్రతి పిల్లాడికి విద్య..
బాలల దినోత్సవం యొక్క ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి పిల్లల అభివృద్ధి. దేశంలోని ప్రతి బిడ్డకు విద్య అందేలా చూడాల్సిన తొలి బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. పిల్లలు ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేందుకు తల్లిదండ్రులు చేయూత అందించాలి.

పిల్లలతో ప్రేమగా..
తను ఎక్కడికి వెళ్లినా.. ఎప్పుడు వెళ్లినా.. చిన్నారులను అన్వేషించి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి అందమైన బహుమతులను ఇచ్చి ఉత్సాహరపరిచేవారు. వారితో ఉంటే తనకు కాలమే తెలియదని చాలా సందర్భాల్లో చెప్పేవారు. అందుకే చాచాజీ నెహ్రూ ఎక్కువగా చిన్నారులతో గడిపేవారు.

పిల్లలకు అర్థమయ్యేలా..
మన దేశానికి చాచాజీ నెహ్రు తొలి ప్రధాని మాత్రమే కాదు.. మంచి రచయిత కూడా. తను జైలు నుండే తన కూతురు ఇందిరాగాంధీకి ఉత్తరాల్లో అనేక సంగతులు వివరించేవారు. పిల్లలు ఎలా ఉండాలి? వారు ఎలాంటి విషయాలను నేర్చుకోవాలి? సమాజంలో ఏది మంచి.. ఏది చెడు అనే విషయాలను ఎలా గ్రహించాలి? అడ్డంకులను ఎలా అధిగమించాలనే వివరాలను అందరికీ అర్థమయ్యేలా వివరించేవారు.

పిల్లలకు స్వేచ్ఛా హక్కు..
6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు తప్పనిసరి ప్రాథమిక విద్య యొక్క హక్కు, ఏదైనా ప్రమాదకరమైన వృత్తి నుండి రక్షణ పొందే హక్కు, పిల్లల సంరక్షణ మరియు విద్యకు హక్కు, దుర్వినియోగం నుండి రక్షణ పొందే హక్కు, ఆర్థిక లేమి నుండి రక్షణ పొందే హక్కు, సమాన అవకాశం మరియు స్వేచ్ఛ హక్కు గురించి బాలల దినోత్సవం అది గుర్తుచేస్తుంది.

పిల్లలందరినీ తన బిడ్డల్లా..
1889 నవంబర్ 14వ తేదీన పుట్టిన జవహార్ లాల్ నెహ్రుకు గులాబీపువ్వులన్నా.. చిన్న పిల్లలన్నా ఎంతగానో ఇష్టం. అయితే ఆయన తండ్రిగా మారిన తర్వాత తన కూతురితో కూడా ఎక్కువ సమయం గడిపలేకపోయాడు. కానీ తను దేశంలోని పిల్లలంతా తన బిడ్డలగానే భావించాడు.
మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన జవహార్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటారు.భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన జ్ఞాపకార్థం, పిల్లల సౌలభ్యం కోసం ఈరోజున బాలలకు కేటాయించారు.
మన దేశాన్ని ఇంటిగా భావిస్తే.. దాన్ని అందంగా నిర్మించాలంటే పిల్లలే ప్రధాన పిల్లర్లు అని అందరూ గుర్తించాలి. ఎందుకంటే పిల్లర్లు, ఇటుకలతోనే భవనం అందంగా రూపుదిద్దుకుంటుంది. అలాగే దేశంలోని సంస్కృతి, కళ, సాహిత్యం, సాంప్రదాయాలు మనుగడ సాగించాలంటే, ప్రతి వయోజన పిల్లవాడు సజీవంగా ఉండాలి. ప్రతి బిడ్డకు ఉత్తమ పోషక పునాది అందేలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పని చేయాలి.
బాలల దినోత్సవం యొక్క ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి పిల్లల అభివృద్ధి. దేశంలోని ప్రతి బిడ్డకు విద్య అందేలా చూడాల్సిన తొలి బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. పిల్లలు ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేందుకు తల్లిదండ్రులు చేయూత అందించాలి.



Click it and Unblock the Notifications