Latest Updates
-
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.! -
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.!
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా..
ఈ రోజు కూర ఏంటి? అని అడిగినప్పుడు సొరకాయ అని చెబితే చాలు.. ఇంట్లో వాళ్ల ముఖాలు ఎలా మాడిపోతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకేదైనా వండొచ్చుగా అంటూ సణుక్కునేవారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా పిల్లలైతే సొరకాయ పేరు వింటేనే ఆమడ దూరం పరుగుతీస్తారు. అందరూ వద్దనుకునే ఈ సాధారణ సొరకాయతో, అందులో సొరకాయ ఉందంటే ఎవరూ నమ్మలేనంత అద్భుతమైన, కరకరలాడే దోశలు వేయొచ్చని మీకు తెలుసా?
సొరకాయ దోశలు ఎంత రుచిగా ఉంటాయంటే.. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ వేయించుకుంటారు. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే ఈ సొరకాయ దోశను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా, పిల్లల లంచ్ బాక్స్ లోకి లేదా సాయంత్రం వేడివేడి స్నాక్ గానూ సులభంగా తయారు చేసుకోవచ్చు.

సొరకాయ దోశ తయారీకి కావలసిన పదార్థాలు
లేత సొరకాయ - 1
బియ్యం పిండి - 1 కప్పు
బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - అర కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఉప్పు -సరిపడా
నీళ్లు - సుమారు 2 గ్లాసులు
నూనె - దోశలు కాల్చుకోవడానికి
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా..
సొరకాయ దోశ తయారీ విధానం
-ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి, కొద్దిగా నీళ్లు పోసి ఎక్కడా ముక్కలు తగలకుండా చాలా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఈ సొరకాయ గుజ్జును ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, అందులో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సుమారు రెండు గ్లాసుల నీళ్లు పోసి, పిండిని రవ్వ దోశ పిండిలా పల్చగా కలుపుకోవాలి. పిండి ఎంత పల్చగా ఉంటే దోశలు అంత కరకరలాడుతూ వస్తాయి.
-పల్చటి పిండి మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి గరిటతో బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడి చేయాలి. పెనం వేడెక్కాక, గరిటతో పిండిని తీసుకుని పెనం అంతటా పల్చగా పోయాలి. దోశ చుట్టూ కొద్దిగా నూనె వేసి, మంటను మీడియంలో ఉంచి దోశ కింది భాగం ఎర్రగా, కరకరలాడేలా కాలే వరకు వేగనివ్వాలి.
-ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత, దోశను నెమ్మదిగా రెండో వైపుకు తిప్పి కాస్త కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి కరకరలాడే సొరకాయ దోశలు రెడీ. వీటిని కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ లేదా టమాటా పచ్చడితో వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications