Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.?
మీ చేతి వేళ్ల గోళ్లు, ఆకృతి మీ ఆరోగ్య సమస్యల గురించి తెలియజేస్తుందని మీకు తెలుసా.. గోళ్లు పెరిగినప్పుడల్లా కట్ చేసుకోవడమే చాలా మందికి తెలుసు. కానీ వాటిపై ఉండే కొన్ని అసాధారణ లక్షణాలు శరీరంలోని కొన్ని భాగాల అనారోగ్యానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి మీ గోళ్లు ఎలా ఉన్నాయి.. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. కనిపిస్తే ఏం చేయాలి.? ఇక్కడ చూద్దాం..

ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్లు, యూరిన్ ఇన్‌ఫెక్షన్ ఇలా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా వరకు ఈ రోగం ముదిరేవరకు కొందరు నిర్లక్ష్యం వహిస్తారు. అయితే మీ కిడ్నీల ఆరోగ్యం ఎలా ఉందనేది ముందుగానే తెలుసుకోవచ్చు. దానికి మీ చేతి వేళ్ల గోర్ల ఆకృతే ఉదాహరణ.
సాధారణంగా గోర్లపై ఒక భాగంలో అర్ధచంద్రాకారం తెల్లగా కనిపిస్తుంది. కొందరిలో ఇది స్పష్టంగా కనిపిస్తే.. మరికొందరిలో ఇది కనిపించదు. కాగా, ఈ నెలవంకకు మూత్రపిండాల ఆరోగ్యంతో సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే గోరుపై అర్ధచంద్రాకారం కనిపించనంత మాత్రాన ఏదో వ్యాధి ఉన్నట్లు కాదని చెబుతున్నారు. గోర్లు సడెన్‌గా రంగు మారినా, ఆకారం భిన్నంగా కనిపించినా, నెలవంక పూర్తిగా కనుమరుగైనా.. ఇది శరీరంలో సమస్యలను సూచించే అవకాశాలు ఉన్నాయి.

ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా
చాలాకాలంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో గోరు చివరిన ఉండే ఈ పొర చిన్నదిగా అవుతుంది. లేదంటే కనిపించకుండా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ కూడా నెలవంక ఆకృతిపై ప్రభావం చూపించవచ్చు. ఇక, గుండె జబ్బులు ఉన్నవారిలో కూడా ఈ పొర రంగు మారడం, ఆకృతి మారే అవకాశాలు ఉన్నాయి. అయితే కేవలం గోళ్లలో ఈ మార్పులు బట్టే వారిలో ఈ వ్యాధులను నిర్ధారించలేమని నిపుణులు అంటున్నారు.
ఈ లక్షణాల పట్ల నిర్లక్ష్యం వద్దు..
కేవలం గోళ్లపై ఉండే అర్ధచంద్రాకారం ఆకారం మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గోళ్లలో మార్పులతో పాటు, పాదాలు వాపునకు గురి కావడం, ఆయాసం, ఛాతీ నొప్పి, ఛాతీ బరువుగా అనిపించడం, అదే పనిగా అలసటకి గురికావడం, మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
అయితే శరీరంలో రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ లోపాలు, డయాబెటిస్, వయసు పైబడటం వంటి కారణాల వల్ల కూడా గోళ్లలో ఇలాంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని గమనించాలి. గోళ్ల ఆకృతి సమస్యలు ఎక్కువకాలంగా కొనసాగుతూ ఉన్నా, ఇతర తీవ్ర లక్షణాలు కనిపిస్తున్నా.. ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
