Latest Updates
-
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.! -
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.!
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!
వేడివేడి ఇడ్లీలు, కరకరలాడే దోసెల్లోకి ఎప్పుడూ రొటీన్ గా చేసుకునే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ లేదా సాంబార్ బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త భిన్నంగా, నోటికి రుచిగా తగిలేలా ఏదైనా కొత్త చట్నీ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మీ వంటింట్లో ఉండే అల్లంతో అద్భుతమైన చట్నీ చేసి చూడండి. అల్లం అనగానే కొంతమంది, ముఖ్యంగా పిల్లలు ముఖం చిట్లిస్తుంటారు. కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో అల్లం పచ్చడి చేసి పెట్టండి, మారాం చేయకుండా ఎంతో ఇష్టంగా తింటారు.
ఈ చట్నీ ఇడ్లీ, దోసె, ఉప్మా లాంటి టిఫిన్స్ లోకే కాకుండా, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అమృతంలా ఉంటుంది. అల్లం మన జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. కాబట్టి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఈ పచ్చడి ఎంతో మేలు చేస్తుంది.

అల్లం పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - 4 టేబుల్ స్పూన్లు
మినపపప్పు - 1 టేబుల్ స్పూన్
చింతపండు - ఉసిరికాయ సైజులో సగం
ఎండు మిరపకాయలు - 2 లేదా 3
కరివేపాకు - రెండు రెమ్మలు
ఉప్పు - రుచికి సరిపడా
వంట నూనె - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి తురుము - 1 టేబుల్ స్పూన్
లవంగాలు - 2
అల్లం పచ్చడి తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండీ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి.
-నూనె వేడెక్కిన తర్వాత అందులో మినపపప్పు, ఎండు మిరపకాయలు, రెండు లవంగాలు వేసి సన్నని మంట మీద వేయించండి. మినపపప్పు కాస్త రంగు మారుతున్న సమయంలో కరివేపాకు, చిన్న చింతపండు ముక్క వేసి కలపండి.
-పప్పు అంతా దోరగా, బంగారు గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించి, ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వండి.
-ఇప్పుడు అదే బాండీలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి, ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను వేయండి. అల్లం పచ్చివాసన పోయేలా కనీసం ఒక నిమిషం పాటు వేయించండి. అల్లం మాడిపోకుండా వేయించండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, అల్లం ముక్కలను చల్లారనివ్వండి.
-మిశ్రమం అంతా చల్లారిన తర్వాత, ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో వేయించిన మినపపప్పు మిశ్రమం, అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ముందుగా నీళ్లు పోయకుండా ఒకసారి మిక్సీ పట్టండి. ఆ తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుతూ, పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. బరకగా ఉంటేనే ఈ పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది.
-అంతే అల్లం పచ్చడి రెడీ. ఈ పచ్చడిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే, ఫ్రిజ్ లో వారం రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది.
-ఈ చట్నీని గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా కొత్తిమీర లేదా పుదీనా వేసుకుంటే చట్నీ మరింత సువాసనగా, అదనపు రుచితో అదుర్స్ అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications