Latest Updates
-
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!
ఒక్క క్లిక్.. ఎన్నో భావాలకు లాజిక్.. నేడు వరల్డ్ ఫొటోగ్రఫీ డే..
కంటెంట్ ఎంత బాగా ఉన్నా.. అందుకు తగ్గ కటౌట్ లేకపోతే ఆ స్టోరీ వేస్టే.. అంత గొప్పదనం తెలిపే కటౌట్ ను కేవలం ఒక్క క్లిక్ తో క్రియేట్ చేయొచ్చు.. కేవలం ఒక్క ఫొటోతో ఎన్నో భావాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే అద్భుతమైన శక్తి ఒక్క ఫొటోగ్రఫీకే ఉంది. మానవ జీవితానికి ఈ ఫొటోగ్రఫీకి అవినాభవ సంబంధం ఉంది. కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో విషయాలను, స్వీట్ మెమోరీస్ కు ఫొటోలే నిదర్శనంగా నిలుస్తాయి.

బ్లాక్ అండ్ వైట్ తో ప్రారంభమైన ఫొటోగ్రఫీ కాలానికి అనుగుణంగా కలర్ ఫుల్ గా మారింది. దీంతో ఫొటోగ్రఫీ రోజురోజుకు ఎన్నెన్నో ప్రత్యేకతలను పరిచయం చేస్తూ కొత్త పుంతలు తొక్కుతోంది. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా చిత్రవిచిత్రాల విశేషాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఫొటోగ్రఫీకి శతాబ్దాల చరిత్ర :
పలు రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతి చర్యతో ఓ రూపాన్ని బంధించడాన్ని ఫొటోగ్రఫీ అంటారు. రెండు గ్రీకు పదాల కలయికే ఫొటోగ్రఫీ. ఫొటో అంటే చిత్రం. గ్రఫీ అంటే గీయడం అని అర్థం.. ఫైనల్ గా ఫొటోగ్రఫీ అంటే కాంతింతో చిత్రాన్ని గీయడం అన్నమాట. ఈ ఫొటోగ్రఫీకి శతాబ్దాల చరిత్ర ఉంది. 18వ శతాబ్దంలో ప్యారిస్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్లతో ఫొటోగ్రఫీ ప్రారంభమైంది.

ఫొటోగ్రఫీ ప్రాసెస్ కనుగొన్నదెవరో తెలుసా..
ఫ్రాన్స్ కు చెందిన లూయిస్ జె.ఎం.డాగ్యూరే అనే వ్యక్తి 1837లో ఫొటోగ్రఫీ ప్రాసెస్ ను కనుగొన్నారు. 1839 జనవరి 9న ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాగ్యురే టైప్ ఈ ఫొటోగ్రఫీ ప్రాసెస్ ను అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది నెలలకు 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పేటెంట్ హక్కులను కొనుగోలు చేసి దానిని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

మన దేశంలో ఫొటోగ్రఫీ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా..
ఫ్రాన్స్ దేశంలో 1839లో అధికారికంగా ఫొటోగ్రఫీని ప్రపంచానికి ఉచితంగా అందించినా.. భారతదేశానికి 1857 వరకు ఫొటోగ్రఫీ అందుబాటులోకి రాలేదు. అప్పుడు కూడా బ్రిటీష్ రాజు, జమీందారులు, సిపాయిలు మాత్రమే దీనిని వినియోగించేవారు. 1977 నుంచి
భారతదేశంలోని సామాన్యులకు ఫొటోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. మన దేశంలో తొలిసారిగా లాలా దీన దయాళ్ ఫొటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు.
PC : World Photography Organisation

ప్రస్తుతం సెల్ఫీల హల్ చల్..
బ్లాక్ అండ్ వైట్ తో మొదలైన ఫొటోల ప్రస్థానం ప్రస్తుతం సెల్ఫీలతో తెగ హల్ చల్ చేస్తోంది. ప్రపంచంలో సుమారు 80 శాతం మంది ప్రజలు సెల్ఫీలపై తెగ మోజు చూపుతున్నారు. ఇక మన దేశంలో సెల్ఫీల కోసం ఏవేవో ఫీట్లు చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది సెల్ఫీలను తీసుకుని ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పెట్టి అందరి చేత మన్ననలు పొందుతున్నారు. మరి కొందరైతే సెల్ఫీలను తీసుకుని ప్రతి ఫొటోని షేర్ చేస్తున్నారు. ఇంకొందరికైతే సెల్ఫీల పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లిపోయింది. సో ఫొటోలకు ఇప్పటికీ ఎంత డిమాండ్ ఉందో ఇప్పటికే చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. సో మీరు కూడా ఈరోజు ఒక ఫొటో తీసుకుని హ్యాపీ ఫొటోగ్రఫీ డే విషెస్ ను షేర్ చేసుకోండి.



Click it and Unblock the Notifications
