Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
ఫిబ్రవరిలో శని గ్రహం అస్తమయం.. ఈ రాశులకు తీవ్ర కష్టాలు ఎదురవుతాయట.. తస్మాత్ జాగ్రత్త...!
ఈ రాశుల వారు ఫిబ్రవరి మాసంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారట. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే శనిగ్రహం ప్రభావం ఉంటుందో వారికి కష్టాలు ఎదురవ్వడం సహజం.

ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో శని గ్రహం తన సొంత రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇలాంటి సమయంలో రాశిచక్రాల వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందట. ప్రతికూల ఫలితాలు ఏర్పరిచే శని గ్రహం ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఇదే రాశిలో సంచారం చేయనున్నాడు.

ఈ సందర్భంగా ద్వాదశ రాశిచక్రాలలో కొన్ని రాశుల వారికి తీవ్ర కష్టాలు ఎదుర్కొంటారట. ఇంతకీ ఏయే రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఎవరెవరు అత్యంత జాగ్రత్తగా ఉండాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి వారికి అంగారకుడు(కుజుడు) అధిపతిగా ఉంటాడు. శని గ్రహం, అంగారక గ్రహానికి శత్రుత్వం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో శని గ్రహం అస్తమయం కానుందున ఈ రాశి వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ముఖ్యంగా ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు మీ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నించాలి.

మిధున రాశి..
ఈ రాశి వారికి శని గ్రహం అస్తమయం కావడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురుకానున్నాయి. వీరిపై శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారిలో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శనిగ్రహం సూర్యాస్తమయం సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి శని గ్రహం అస్తమయం కావడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా.. కెరీర్ పరంగా ఇది చాలా కష్టమైన సమయం. ముఖ్యంగా ఉద్యోగులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కూడా ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కన్య రాశి..
ఫిబ్రవరి నెలలో శని గ్రహం అస్తమయం అయ్యే సమయంలో ఈ రాశి వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పని చేసే వారికి ఈ సమయంలో చాలా అడ్డంకులు ఎదురవ్వొచ్చు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు నిరాశే ఎదురుకావొచ్చు. ఈ కాలంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి..
2022 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో శని గ్రహం అస్తమయం కావడం వల్ల ఈ రాశి వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో మీకు అవమానాలు ఎదురవుతాయి. మీ బంధువులతో అనేక సమస్యలు ఎదురవుతాయి. మీ పనులను పూర్తి చేసేందుకు మీరు చాలా కష్టపడాల్సి రావొచ్చు. కాబట్టి మీరు ఈ కాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో శని గ్రహం తన సొంత రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇలాంటి సమయంలో రాశిచక్రాల వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందట. ప్రతికూల ఫలితాలు ఏర్పరిచే శని గ్రహం ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఇదే రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మేషరాశి, మిధున రాశి, కర్కాటక రాశి, కన్య రాశి, తుల రాశి వారికి తీవ్ర కష్టాలు ఎదురవుతాయట.



Click it and Unblock the Notifications
