Latest Updates
-
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు!
ఈ రాశుల వారికి ప్రతి పనిలోనూ అడ్డంకులొస్తాయట...! దీంతో వీరికి విపరీతమైన కోపం, చిరాకు వస్తుందట...!
ఈ రాశిచక్రాల వారు ఎక్కువగా అయోమయం మరియు కోపంతో ఉంటారని తెలుసుకోండి.
జ్యోతిష్యశాస్త్రం ఆధారంగా రాశిచక్రాలను బట్టి మన లక్షణాలు, ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతుంటారు.

గ్రహాల కదలికను బట్టి ఇతర విషయాలను లెక్కలోకి తీసుకొని మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో అంచనా వేస్తుంటారు పండితులు. కొంతమంది చాలా విషయాలలో తరచుగా గందరగోళానికి గురవుతుంటారు.

వీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వారి రంగంలో విజయం సాధించలేరు. అంతేకాదు చాలాసార్లు ప్రమాదాలకు గురవుతారు. ఈ క్రమంలోనే ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారు ఎక్కువ అయోమయంగా.. మరియు గందరగోళ పడుతూ ఉంటారట. వారు ఏ పని సరిగ్గా చెయ్యలేరట.

ఒక్కోసారి వీరి పని పూర్తి కాకపోవడం సంగతి అటుంచితే.. వీరి పనులే పెద్ద సమస్యగా మారుతూ ఉంటాయట. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఈ రాశుల వారి ప్రేమ వ్యవహారాలు కూడా విఫలమవుతూ ఉంటాయట. ఈ సందర్భంగా ఆ రాశుల వారెవరో.. ఆ రాశులలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే తెలుసుకోండి...

మిధున రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి వారు ఏ పని అయినా అత్యంత వేగంగా చేసేందుకు ప్రయత్నిస్తారు. ఏ పనిని ఓపికగా చేయడం మరియు ఎక్కువసేపు చేయడం అనేది వీరికి ఇష్టముండదు. అలాగే వీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చేతులను ఎక్కువగా కదుపుతూ ఉంటారట. కొన్నిసార్లు ఎవరితో అయినా గొడవ జరిగితే.. ఆ కోపంలో అవతలి వ్యక్తిని చేత్తో కొడతారు. లేదంటే.. ఏదైనా వస్తువును నేలకేసి కొడతారు. అందువల్ల మిధునరాశి వారితో సఖ్యతగా ఉంటూ.. వారికి కోపం రాకుండా చూసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో చాలా దుష్పరిణమాలు మరియు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు.

తుల రాశి..
ఈ రాశి వారు ఏ పని చేసినా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు భావిస్తారు. ప్రతి పనినీ ప్రణాళిక ప్రకారం.. ఒక క్రమ పద్ధతిలో ఉండేలా గట్టిగా చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే వీరు ఆశించినట్లు ఎక్కువ సందర్భాలలో పనులు అనేవి ప్రణాళిక ప్రకారం.. పద్ధతి ప్రకారం జరగవట. ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంటుందట. ఈ నేపథ్యంలో వీరు విపరీతంగా ఆవేశపడుతూ ఉంటారట. అదే ఆవేశంలో ఇతరులపై చేయి చేసుకోవడానికీ.. వస్తువుల్ని నేలకేసి కొడుతుంటారట.. అయితే పరిస్థితి అక్కడి వరకు రాకుండా మాత్రం జాగ్రత్తగా ఉంటారట.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు రెగ్యులర్ గా ప్రతి పనిలోనూ కోపం, చిరాకు, అసహనం వంటివి ఇతరులపై వ్యక్తం చేస్తూ ఉంటారట. దీనంతటికీ కారణం వారి చుట్టూ పరిస్థితులు ఎప్పుడూ వారికి చిరాకు తెప్పించడమేనని పండితులు చెబుతున్నారు. దీంతో వీరు అదుపు తప్పి ప్రవర్తిస్తుంటారు. కోపం వచ్చినప్పుడు ఏదైనా వస్తువుల్ని నేలకేసి కొట్టడం అనే గుణం వీరిలోనూ ఉంది. రోజు వారీ పనులు చేసే సమయంలో కూడా వీరు ఏదో ఒక వస్తువును విసురుతూ ఉంటారు. అంతేకాదు కొన్ని బలమైన వస్తువులను కూడా ఆవేశంగా పక్కకు నెడతారు. అయితే.. ఇలా చేసినప్పుడల్లా నష్టం జరుగుతుందని మనం అనుకోవాల్సిన పని లేదు.

కుంభ రాశి..
ఈ రాశి వారు రెగ్యులర్ గా చేసే పనుల విషయంలో ఏవేవో ఊహించుకుంటూ ఉంటారట. అయితే వీరు వాస్తవాలకు దూరంగా ఉంటారట. వీరు ఏ పనినైనా సులభంగా చేయాలని భావిస్తారు. కానీ ఏ ఒక్క పనిని సులభంగా పూర్తి చేయలేరట. ప్రతి పని వీరిలోని పేషన్స్ ను పరీక్షిస్తాయట. అందుకే వీరికి తరచుగా.. కోపం, ఆవేశం వస్తూ ఉంటాయట. అంతేకాదు వీరు ఏదైనా పని అనుకున్న వెంటనే పూర్తి కాకపోతే.. వీరికి ఎక్కువ కోపం, ఆవేశం వస్తుందట. అదే సమయంలో వీరు కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారట.

మీన రాశి..
ఈ రాశి వారు తరచుగా అయోమయానికి గురవుతూ ఉంటారు. ఈ కారణంగా ప్రతి పనిని సరిగ్గా పూర్తి చేయలేరు. వీరు గందరగోళ వాతావరణంలోనే పనిచేస్తూ ఉంటారు. అందువల్లే వీరు ఏ పనిని పూర్తిగా చేయలేరు. వీరు ఏ పని చేసినా అందులో ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. వీరు ఏం చేసైనా పనులను ఒక ప్రణాళిక ప్రకారం.. ఒక క్రమ పద్ధతిలో పూర్తి చేయాలని భావిస్తారు. కాని కేవలం కొన్ని సమయాల్లో మాత్రమే అందుకు మార్గం సుగమం అవుతుందని పండితులు చెబుతున్నారు.
ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











